Search

భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆర్.ఎమ్.లోధా ప్రమాణ స్వీకారం

భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆర్.ఎమ్.లోధా ఏప్రిల్ 27,2014న ప్రమాణ స్వీకారం చేశారు.

Apr 28, 2014 09:20 IST
facebook IconTwitter IconWhatsapp Icon

భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆర్.ఎమ్.లోధా ఏప్రిల్ 27,2014న ప్రమాణ స్వీకారం చేశారు.  అంతకుముందు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన పి. సదాశివం నుంచి ఆర్.ఎమ్.లోధా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆర్.ఎమ్.లోధా సుప్రీం కోర్టు యొక్క 41వ ప్రధాన న్యాయమూర్తి.

భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆర్.ఎమ్.లోధాచే ప్రమాణం చేయించారు. రాష్టప్రతి భవన్ దర్బార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్టప్రతి హమిద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్, కొందరు కేంద్ర మంత్రులు, మాజీ న్యాయమూర్తులు హాజరయ్యారు. కేవలం ఐదు నెలల మాత్రమే ఈ పదవిలో కొనసాగే లోధా సెప్టెంబర్ 27న రిటైర్ అవుతారు. బొగ్గు గనుల కుంభకోణంపై సిబిఐ జరుపుతున్న దర్యాప్తు ప్యానల్‌కు లోధా సారధ్యం వహిస్తున్నారు.
 
రాజస్థాన్ జోధ్‌పూర్‌లో జన్మించిన జస్టిస్ లోధా 1973 ఫిబ్రవరిలో రాజస్థాన్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. రాజస్థాన్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి రాజ్యాంగ సంబంధ, సివిల్, కంపెనీ వ్యవహారాలు, క్రిమినల్, పన్నులు, కార్మిక వివాదాలు తదితర అంశాల్లో విశేష అనుభవం గడించారు.

1994లో ముంబయి హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007లో రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. రాజస్థాన్‌లోనే రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2008లో నియమితులయ్యారు. డిసెంబర్ 17,2008 నుంచి సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (క్లాజ్-2) ప్రకారం  రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS