Search

జమ్మూకాశ్మీర్ నూతన డీజీపిగా కే.రాజేంద్రకుమార్ నియామకం

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపి) గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కే. రాజేంద్రకుమార్ మే  21, 2014న నియమితులయ్యారు.

May 26, 2014 14:01 IST
facebook IconTwitter IconWhatsapp Icon

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపి)గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కే. రాజేంద్రకుమార్ మే  21, 2014న నియమితులయ్యారు. ఆయన మరో (ఆంధ్రప్రదేశ్) ఐపీఎస్ అధికారి అశోక్ ప్రసాద్ స్థానంలో జమ్మూకాశ్మీర్ నూతన డీజీపిగా బాధ్యతలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కే. రాజేంద్ర కుమార్  1984 బ్యాచ్ జమ్మూకాశ్మీర్ కేడర్ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం జమ్ముకాశ్మీర్ ప్రత్యేక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సమన్వయం)గా పనిచేస్తున్నారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో జరిగిన మంత్రిమండలి సమావేశం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది.

హైదరాబాద్ జిల్లాకు చెందిన ఆయన 1956లో జన్మించారు. ఆయన ఎంఎస్సీ పూర్తి చేసిన తరవాత 1984లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. ఆయన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మిలిటంట్ కార్యకలాపాలు అధికంగా ఉన్న సమయంలో జమ్మూకాశ్మీర్ పోలీస్ విభాగంలో వివిధ హోదాలలో పనిచేశారు. గతంలో ఆయన శ్రీనగర్ ఎస్.ఎస్.పీ, జమ్మూ ఐజీ, కాశ్మీర్ ఐజీగా పనిచేశారు.

ఇప్పటివరకు జమ్మూకాశ్మీర్ డీజీపిగా పనిచేసిన అశోక్ ప్రసాద్, కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్ బ్యూరో) ప్రత్యేక సంచాలకులుగా బదిలీ అయ్యారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS