Search

లాట్వియా ప్రధాని లైండోటా స్త్రౌజుమా రాజీనామా

7 డిసెంబర్ 2015న లాట్వియా యొక్క మొదటి మహిళా ప్రధాన మంత్రి  లైండోటా స్త్రౌజుమా ప్రధాన మంత్రి పదవికి  రాజీనామా చేశారు,

Dec 8, 2015 18:04 IST
facebook IconTwitter IconWhatsapp Icon

7 డిసెంబర్ 2015న లాట్వియా యొక్క మొదటి మహిళా ప్రధాన మంత్రి  లైండోటా స్త్రౌజుమా ప్రధాన మంత్రి పదవికి  రాజీనామా చేశారు,

లాట్వియా పార్లమెంట్, కొత్త ప్రభుత్వంను ఎన్నుకునే వరకు, సెంటర్ రైట్ యూనిటీ పార్టీ, గ్రీన్స్ మరియు రైతులు పార్టీ, ఫార్ రైట్ నేషనల్ అలయన్స్ ఈ మూడు సంకీర్ణ పార్టీల నాయకురాలిగా ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా స్త్రౌజుమా వ్యవహరిస్తారు.

జనవరి 2014 లో అధికారం చేపట్టిన, సెంటర్ రైట్ కేబినెట్ లో అసమ్మతి పుకార్లు ఏర్పడడంతో, నవంబర్ 2015 లో రవాణా మంత్రిని తొలగించిన, తర్వాత  స్త్రౌజుమా రాజీనామా చేశారు.

ఒక సూపర్ మార్కెట్ కుప్పకూలడంతో దేశంలో 54 మంది మృతి చెందడంతో  అప్పటి ప్రధానమంత్రి వైకింగ్ డోంబ్రోవ్స్కిస్ ప్రధానమంత్రి పదవినుండి దిగిపోయిన తరువాత 2014 సాధారణ ఎన్నికలలో గెలిచి లాట్వియా ప్రధానిగా స్త్రౌజుమా పదవి చేపట్టారు.

నేపధ్యం

లాట్వియా, నాటో మరియు యూరోపియన్ యూనియన్ లలో సభ్యత్వం కలిగివుంది. ఇది క్రిమియన్ పెనిన్సులాను ఆక్రమించిన మాస్కోపై  యూరోపియన్ యూనియన్ విధించిన ఆర్థిక ఆంక్షలకు మద్దతివ్వడంతో పాటు, తూర్పు ఉక్రెయిన్ లో రష్యా అనుకూలవాదులకు మద్దతుగా నిలిచింది.

జనవరి 2015లో ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత స్త్రౌజుమా ఈ ప్రాంతంలో రక్షణ వ్యయం పెంచడంతో పాటు, ఆయా ప్రాంతాలలో నాటో ప్రభావం పెంచేందుకు పొరుగునున్న బాల్టిక్ దేశాలయిన ఈస్టోనియా మరియు లిథువేనియాలతో కలిసి పనిచేశారు.

అయితే, స్త్రౌజుమా యొక్క యూనిటీ పార్టీ, నేషనలిస్ట్ అలయన్స్ మరియు గ్రీన్స్ అండ్ ఫార్మర్స్ యూనియన్ పార్టిల  సంకీర్ణం ప్రభుత్వం, 2016 జాతీయ ఆర్థిక బడ్జెట్ మరియు జాతీయ ఎయిర్లైన్స్ అయిన ఎయిర్ బాల్టిక్ కు ఆర్ధిక సహకారంకు జరిగిన ఒప్పందాల తరువాత సమస్యలలో కూరుకుపోయింది.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS