Search

అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ నుండి తక్షణమే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Dec 30, 2014 17:03 IST
facebook IconTwitter IconWhatsapp Icon

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, 30 డిసెంబర్ 2014న అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ నుండి తక్షణమే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

అన్ని క్రికెట్ ఫార్మాట్ లను ఆడటం వల్ల ఒత్తిడి ఎక్కువవుతున్న కారణంగా ధోని టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఇక పై ఆయన కేవలం వన్డేలు మరియు ట్వంటీ 20 ఫార్మాట్ పోటీల పై మాత్రమే దృష్టి కేంద్రీకరించానున్నారు.

మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి)లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ టెస్టు డ్రా గా ముగిసిన తర్వాత ధోని తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ మ్యాచులో ధోని మూడు ఫోర్మాట్ల క్రికెట్ లో అత్యధిక స్టంపింగ్ (134)లను చేసిన ఆటగాడి (వికెట్ కీపర్)గా నిలిచి, కుమార సంగక్కర (శ్రీలంక) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.

ఆస్ట్రేలియాతో చివరిదైన, నాల్గవ టెస్టుకు విరాట్ కోహ్లి సారధ్యం వహించనున్నారు. ఈ మ్యాచ్ 6 జనవరి 2015న సిడ్నీలో ప్రారంభమవనుంది. భారత క్రికెట్ జట్టు ఈ సిరీస్ ను కోల్పోయింది.

టెస్ట్ క్రికెట్లో మహేంద్రసింగ్ ధోని

• మహేంద్రసింగ్ ధోని, 2 డిసెంబర్ 2005న శ్రీలంకతో జరిగిన మ్యాచులో వికెట్ కీపర్ గా టెస్టుల్లో అరంగేట్రం చేశారు
• ఆయన 2008లో భారత టెస్టు క్రికెట్ జట్టుకు సారధిగా బాధ్యతలను చేపట్టారు
• ఆయన సారధ్యంలో, భారత క్రికెట్ జట్టు టెస్టు ర్యాంకింగ్ లలో అగ్రస్థానంలో నిలిచింది
• తన టెస్టు కెరీర్లో అతను 90 మ్యాచులను ఆడి, 144 ఇన్నింగ్స్ లలో 4876 పరుగులు చేశారు.
• టెస్టుల్లో ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 224 పరుగులు

 

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS