Search

2014 పోర్ష్ గ్రాండ్‌ ప్రీ టెన్నిస్ ఓపెన్‌ టైటిల్ విజేత మరియా షరపోవా

రష్యా టెన్నిస్ క్రీడాకారిణి షరపోవా పోర్ష్ గ్రాండ్‌ ప్రీ టెన్నిస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది.

Apr 29, 2014 10:43 IST
facebook IconTwitter IconWhatsapp Icon

రష్యా టెన్నిస్ క్రీడాకారిణి షరపోవా పోర్ష్ గ్రాండ్‌ ప్రీ టెన్నిస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఏప్రిల్ 27, 2014న స్టట్‌గార్ట్  (జర్మనీ)లో జరిగిన ఫైనల్స్‌ మ్యాచ్‌లో ఆరవ సీడ్ షరపోవా, 3-6, 6-4, 6-1 స్కోర్ తో  తొమ్మిదవ సీడ్  అనా ఇవనోవిచ్‌ (సెర్బియా)ను ఓడించింది.

ఈ విజయంతో షరపోవా హ్యాట్రిక్ టైటిల్ సాధించింది (2012,2013,2014). తొలి సెట్‌ను నెగ్గిన అనా ఇవనోవిచ్‌ తర్వాతి రెండు సెట్లలో అంతటి పోరాట పటిమ కనపరచలేదు. ఏకపక్షంగా సాగిన రెండు, మూడు సెట్లలో షరపోవా, అనాపై ఆధిపత్యం చెలాయించింది.  ఈ సంవత్సరం (2014)లో షరపోవాకు ఇది తొలి డబ్ల్యూటిఎ టైటిల్ మరియు కెరీర్ లో 30వ టైటిల్.
 
విజేతగా నిలిచిన షరపోవాకు ‘పోర్షె 911 టార్గా 4ఎస్’ మోడల్ కారుతోపాటు 96774 యూరోలు  ప్రైజ్‌మనీగా లభించాయి.

స్టట్‌గార్ట్  ఓపెన్ గా కుడా పిలిచే పోర్ష్ గ్రాండ్‌ ప్రీ టెన్నిస్ టోర్నీని పోర్ష్ సంస్థ, ప్రతి ఏట స్టట్‌గార్ట్, జర్మనీలో నిర్వహిస్తుంది. ఈ టోర్నీ క్లే కోర్టు ఇండోర్ టోర్నమెంట్. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ఈ టోర్నీ నిర్వహిస్తారు. టోర్నీ విజేతలకు 740000 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీని బహుకరిస్తారు. 1978లో ఈ టోర్నీను ప్రారంభించారు.

మహిళల డబుల్స్-రన్నరప్ సానియా జోడీ

పోర్ష్ గ్రాండ్‌ప్రీ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా(భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఏప్రిల్ 27,2014న జరిగిన తుదిపోరులో రెండోసీడ్ సానియా-కారాబ్లాక్ జోడీ 2-6, 3-6తో టాప్‌సీడ్ సారా ఎరాని-రాబర్టా విన్సీ (ఇటలీ) ద్వయం చేతిలో చిత్తయ్యింది. సానియా, కారా రన్నరప్ ట్రోఫీతో పాటు సుమారు 9.77 లక్షల రూపాయల  ప్రైజ్‌మనీని గెలుచుకున్నారు. అదే విధంగా చెరో 305 పాయింట్లు దక్కించుకున్నారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS