1. Home
  2.  |  
  3. CURRENT AFFAIRS
  4.  |  
  5. ఆర్కైవ్స్
  6.  |  
  7. 2014 కరెంట్ అఫైర్స్
  8.  |  
  9. మే 2014 కరెంట్ అఫైర్స్

మే 2014 కరెంట్ అఫైర్స్

23వ బీహార్ ముఖ్యమంత్రిగా జితన్ రామ్ మంజి ప్రమాణస్వీకారం

May 21, 2014
బీహార్ నూతన (23వ) ముఖ్యమంత్రిగా జితన్ రామ్ మంజి మే 20, 2014న ప్రమాణస్వీకారం చేశారు.

భారత మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాంకు ఎడింబర్గ్ విశ్వవిద్యాలయ గౌరవ డిగ్రీ ప్రదానం

May 21, 2014
భారత మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం మే 15,2014న స్కాట్లాండ్ లోని ఎడింబర్గ్ విశ్వవిద్యాలయ గౌరవ డిగ్రీని అందుకున్నారు.

ఇటాలియన్ ఓపెన్ పురుషుల టెన్నిస్ విజేత నోవాక్ జకొవిచ్

May 20, 2014
ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ రెండో ర్యాంక్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్ మే 17, 2014న గెల్చుకున్నాడు.

లీలా హోటల్స్ వ్యవస్థాపకుడు సిపి కృష్ణన్ నాయర్ కన్నుమూత

May 20, 2014
లీలా హోటల్స్ వ్యవస్థాపకులు సిపి కృష్ణన్ నాయర్ మే 17, 2014న కన్నుమూశారు.

సిసిఐ క్లాసిక్ బిలియర్డ్స్‌ టోర్నమెంట్ విజేత పంకజ్ అద్వానీ

May 19, 2014
పంకజ్‌ అద్వానీ మే 14, 2014న సిసిఐ క్లాసిక్‌ బిలియర్స్‌ అండ్‌ స్నూకర్స్ టోర్నమెంట్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లువాలియా రాజీనామా

May 19, 2014
భారత ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లువాలియా మే 17, 2014న తన డిప్యూటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

16వ లోక్ సభ ఎన్నికలలో 282 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం

May 17, 2014
16వ లోక్ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 282 సీట్లు కైవసం చేసుకొని ఘన విజయం సాధించింది

2014-ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో బిజూ జనతా దళ్ ఘన విజయం

May 17, 2014
2014 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో బిజూ జనతా దళ్ పార్టీ మరోసారి విజయం సాధించింది.

2014-అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం

May 17, 2014
2014 అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంది.

2014-సిక్కిం అసెంబ్లీ ఎన్నికలలో సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఘన విజయం

May 17, 2014
2014-సిక్కిం అసెంబ్లీ ఎన్నికలలో సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డిఎఫ్‌) అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని విజయం సాధించింది.

ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ బాధ్యతను ముకుల్ ముద్గల్ కమిటీకి అప్పగించిన సుప్రీం కోర్టు

May 17, 2014
ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై తదుపరి విచారణ బాధ్యతను ముకుల్ ముద్గల్ కమిటీ అప్పగిస్తూ సుప్రీం కోర్టు మే 16,2014న ఉత్తర్వులు జారీ చేసింది.

2014-ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో తెరాస,సీమాంధ్రలో తెదేపా ఘన విజయం

May 17, 2014
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో తెరాస 63 సీట్లతోను, సీమాంధ్రలో తెదేపా 106 సీట్లతోను ఘన విజయం సాధించాయి.

కేంద్ర జల సంఘం చైర్మన్‌గా అశ్విన్ బి పాండ్యా నియామకం

May 16, 2014
కేంద్ర జల సంఘం చైర్మన్ & కేంద్ర ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా అశ్విన్ బి పాండ్యా మే 15,2014న నియమితులయ్యారు

ఆరుగురు భారతీయ-అమెరికన్లకు ప్రతిష్టాత్మక ఎలిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ హానర్

May 16, 2014
ఆరుగురు ఇండో-అమెరికన్లకు ప్రతిష్టాత్మక 2014-ఎలిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ హానర్ గౌరవం దక్కింది.

ఎల్‌టిటిఇపై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు

May 16, 2014
శ్రీలంక తమిళ తీవ్రవాద సంస్థ ఎల్‌టిటిఇపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం మే 14,2014న మరో అయిదేళ్ల పాటు పొడిగించింది.

ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త మల్లాది సుబ్బమ్మ కన్నుమూత

May 15, 2014
ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి, సామాజిక కార్యకర్త మల్లాది సుబ్బమ్మ మే 15,2014న అనారోగ్యంతో కన్నుమూశారు.

ఇంటర్నేషనల్ టెక్నాలజీ లా అసోసియేషన్ అధ్యక్షుడిగా సాజై సింగ్ నియామకం

May 15, 2014
ఇంటర్నేషనల్ టెక్నాలజీ లా అసోసియేషన్ (ఐటిఎల్ఏ) నూతన అధ్యక్షుడిగా భారత్ కు చెందిన సాజైసింగ్ మే 14, 2014న నియమితులయ్యారు.

టిఐఈ సిలికాన్ వ్యాలీతో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం

May 15, 2014
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మే 14, 2014న టిఐఈ సిలికాన్ వ్యాలీతో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పై సంతకం చేసింది.

ఐక్యరాజ్యసమితి సిరియా రాయబారి లఖ్దర్ బ్రహిమి రాజీనామా

May 15, 2014
సిరియాలో ఐక్యరాజ్యసమితి రాయబారి లఖ్దర్ బ్రహిమి మే 13, 2014న రాజీనామా చేశారు.

అమెరికా న్యాయ విశ్వవిద్యాలయం డీన్‌గా సుజిత్‌ చౌదరి నియామకం

May 15, 2014
అమెరికా బెర్కిలీన్యాయ విశ్వవిద్యాలయం డీన్‌గా భారత సంతతికి చెందిన సుజిత్‌ చౌదరి(44) నియమితులయ్యారు.
Loading...

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

Loading...