1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. మే 2014 కరెంట్ అఫైర్స్

మే 2014 కరెంట్ అఫైర్స్

2014 గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఎంపికైన టెక్నోపార్క్ టిబిఐ

May 15, 2014
టెక్నోపార్క్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ మే 14, 2014న ప్రత్యేక ప్రశంస విభాగంలో 2014 గోల్డెన్ పీకాక్ జాతీయ శిక్షణ అవార్డుకు ఎంపికైంది.

2014-హాకీ ప్రపంచకప్‌కు 18 మందితో భారత జట్టు ఎంపిక

May 15, 2014
మే 31, 2014 నుండి జరుగనున్న హాకీ ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు 18 మంది సభ్యులతో కూడిన జట్టును హాకీ ఇండియా మే 14,2014న ప్రకటించింది.

టర్కీ బొగ్గు గనిలో పేలుడు 245 మంది మృతి

May 15, 2014
పశ్చిమ టర్కీలోని సోమా బొగ్గు గనిలో మే 14,2014న సంభవించిన పేలుడు ప్రమాదంలో 245 మంది పైగా మృతి చెందారు.

ఢిల్లీలో కాలుష్య నివారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్

May 14, 2014
ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కాలుష్య నివారణ కోసం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మే 13, 2014న ఒక ఉన్నతస్థాయి కమిటీని రూపొందించారు.

ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళానికి తొలిసారి మహిళ నేతృత్వం

May 14, 2014
సైప్రస్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళానికి తొలి మహిళ కమాండర్ గా నార్వేకు చెందిన మేజర్ జనరల్ క్రిస్టీన్ లండ్ నియమితులయ్యారు.

ప్రజా వేగుల రక్షణ బిల్లు-2011కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర

May 14, 2014
ప్రజా వేగుల రక్షణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మే 13,2014న ఆమోద ముద్ర వేసారు.

అవినీతి కేసులో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఆల్మర్ట్‌కు ఆరేళ్ల జైలు శిక్ష

May 14, 2014
అవినీతి ఆరోపణ కేసులో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఆల్మర్ట్‌కు ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ టెల్ అవీవ్ జిల్లా కోర్టు మే 13,2014న తీర్పు చెప్పింది.

నూతన ఆర్మీ చీఫ్‌గా దల్బీర్ సింగ్ సుహాగ్ నియామకానికి కేబినెట్ కమిటీ ఆమోదముద్ర

May 14, 2014
నూతన ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియామకానికి కేబినెట్ కమిటీ మే 13,2014న ఆమోదముద్ర వేసింది.

తాజా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో సానియా-కారా బ్లాక్‌ జోడీకి రెండో ర్యాంకు

May 13, 2014
తాజా డబ్ల్యూటీఏ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత క్రీడాకారిణి సానియా మీర్జా-జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్‌తో కలిసి రెండోర్యాంకులో నిలిచింది.

మే 12, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

May 13, 2014
ప్రపంచవ్యాప్తంగా మే 12, 2014ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకున్నారు.

35 మంది నర్సులకు 2014 నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుల ప్రదానం

May 13, 2014
భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 35 మంది నర్సింగ్‌ సిబ్బందికి 2014 నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డులను ప్రదానం చేశారు.

యూకే సంపన్నుల జాబితాలో హిందూజా సోదరులకు అగ్రస్థానం

May 13, 2014
ది సండే టైమ్స్ వారపత్రిక మే 11, 2014న విడుదల చేసిన యూకే అత్యంత సంపన్నుల జాబితాలో, హిందుజా సోదరులు ప్రథమ స్థానం పొందారు.

20వ జాతీయ మహిళల సీనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్స్ టైటిల్ విజేత మణిపూర్

May 13, 2014
20వ జాతీయ మహిళల సీనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్స్ టైటిల్ ను మణిపూర్ జట్టు కైవసం చేసుకుంది

సౌరశక్తి నుంచి జెట్‌ ఇంధనం తయారీ

May 13, 2014
సౌరశక్తిని, నీరు, కార్బన్‌డయాక్సైడ్‌ను ఉపయోగించి తొలిసారి హరిత జెట్‌ ఇంధనాన్ని ఐరోపా శాస్త్రవేత్తలు తయారుచేశారు.

2014-మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విజేత రాఫెల్ నాదల్

May 13, 2014
ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు రాఫెల్ నాదల్ 2014-ముటువ మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.

శారదా చిట్ ఫండ్ కంపెనీ స్కాం విచారణకు సిట్ ఏర్పాటు

May 13, 2014
పశ్చిమ బెంగాల్ శారదా చిట్ ఫండ్ కంపెనీ కుంభకోణానికి సంబంధించి విచారణకు ప్రత్యేక విచారణ టీమ్ (సిట్) ను సిబిఐ మే 12,2014న ఏర్పాటుచేసింది.

2014-మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విజేత మరియా షరపోవా

May 12, 2014
రష్యా టెన్నిస్ క్రీడాకారిణి షరపోవా 2014-మాడ్రిడ్ టెన్నిస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచింది.

సీబీఐ తొలి మహిళా అదనపు డైరెక్టర్‌గా అర్చనా రామసుందరం

May 12, 2014
ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరం, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో మొదటి మహిళా అదనపు డెరైక్టర్‌గా మే 8, 2014న బాధ్యతలు స్వీకరించారు.

2014 స్పానిష్ గ్రాండ్‌ ప్రీ ఫార్ములా వన్ విజేత లూయిస్ హామిల్టన్‌

May 12, 2014
మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మే 11, 2014న స్పానిష్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్-2014 టైటిల్ ని కైవసం చేసుకున్నాడు

కాపరో గ్రూప్‌కు 2014-ఇంటర్నేషనల్ బిజినెస్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

May 12, 2014
ప్రముఖ బ్రిటిష్ కంపెనీ కాపరో గ్రూప్ మే 9, 2014న ఇంటర్నేషనల్ బిజినెస్ ఆఫ్ ది ఇయర్-2014 అవార్డును కైవసం చేసుకుంది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...