Search

క్రీడా రంగంలో మోసాలను అరికట్టే ముసాయిదా బిల్లుకు కేంద్ర హోం శాఖ ఆమోద ముద్ర

క్రీడా రంగంలో మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్రం హోం శాఖ ఆమోద ముద్ర వేసింది

Apr 29, 2014 09:40 IST
facebook IconTwitter IconWhatsapp Icon

క్రీడా రంగంలో మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్రం హోం శాఖ తన ఆమోద ముద్ర వేసింది.
 
ఈ ముసాయిదా బిల్లు ప్రకారం స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ సహా క్రీడల్లో ఎలాంటి మోసాలకు పాల్పడినా శిక్షార్హులవుతారు. దోషులకు ఐదు సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
 
క్రీడా మోసాల నిరోధక బిల్లును కేంద్ర న్యాయ శాఖ సలహాలు, సూచనలతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూపొందించింది. దేశాలో క్రీడా రంగాన్ని ప్రక్షాళన చేయడంతోపాటు పారదర్శకతను పాటించే విధంగా ఈ బిల్లును తీర్చిదిద్దారు. క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ముసాయిదా బిల్లు తమకు చేరిందని, దానిని ఆమోదించి తిరిగి పంపించామని హోం శాఖ తెలిపింది. క్రీడా మంత్రిత్వ శాఖ కేబినెట్ ఆమోదం కోసం ఈ బిల్లును పంపనుంది, ఆతర్వాత పార్లమెంటులో ప్రవేశ పెడతారు.
 
క్రీడా మంత్రిత్వ శాఖ సూచన మేరకు జస్టిస్ (రిటైర్డ్) ముద్గల్ కమిటీ ఈ ముసాయిదా బిల్లును తయారు చేసింది. ఇటివలే జస్టిస్ (రిటైర్డ్) ముద్గల్ కమిటీ ఐపిఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ పై తన నివేదికను సమర్పించింది.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS