Search

మైక్రోసాఫ్ట్‌లో నోకియా మొబైల్ విలీనం పూర్తి

మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా, ప్రముఖ ఐటి ఉత్పత్తుల కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో విలీనమైపోయింది.

Apr 28, 2014 13:03 IST
facebook IconTwitter IconWhatsapp Icon

మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా, ప్రముఖ ఐటి ఉత్పత్తుల కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో విలీనమైపోయింది. నోకియా డివైసెస్‌ అండ్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ విలీన ప్రక్రియ పూర్తి అయ్యిందని మైక్రోసాఫ్ట్‌ ఏప్రిల్ 25,2014న ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇక నోకియా డివైసెస్‌ అండ్‌ సర్వీసెస్‌ బిజినెస్‌కి తెరపడనుంది.

అయితే దక్షిణ కొరియాలోని మాసన్‌, భారత్‌లోని చెన్నై ప్లాంట్ల విలీనాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. ఈ కంపెనీ భారత ప్రభుత్వానికి అమ్మకాల పన్ను, ఆదాయ పన్ను కింద సుమారు 6500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీంతో చెన్నై ప్లాంట్‌ ఈ ఒప్పందంలో లేదు. దక్షిణ కొరియాలోని మాసన్‌ ప్లాంట్ మూసివేత ఆలోచనలో నున్నది.

ప్రపంచ వ్యాప్తంగా నోకియాలో పని చేస్తున్న 25000 మంది ఉద్యోగులను సాధరంగా అహ్వానిస్తున్నామని మైక్రోసాఫ్ట్‌ ఈ సందర్బంగా ప్రకటించింది. ప్రపంచంలోని పలు ప్రభుత్వాలు, నోకియా షేర్‌హోల్డర్లు ఈ విలీనానికి ఆమోదం తెలిపారు. నోకియాకు 720 కోట్ల డాలర్లు చెల్లించి మైక్రోసాఫ్ట్‌ దీన్ని స్వాధీనం చేసుకుంది.

ఫిన్లాండ్ కు చెందిన నోకియా మొబైల్ కంపెనీ సెప్టెంబర్ 2013లో  తమ డివైసెస్‌ అండ్‌ సర్వీసెస్‌ విభాగాన్ని మైక్రోసాఫ్ట్ కు విక్రయించడానికి అంగీకరించింది.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS