Search

చైనాలో భారత్‌ ఉత్సవాల లోగో ఆవిష్కరణ

చైనాలో భారత్‌ ఉత్సవాలకు సంబంధించి లోగోను, పోస్టర్లను, వెబ్‌పేజీని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవీంద్ర సింగ్‌ ఆవిష్కరించారు.

Apr 25, 2014 15:09 IST
facebook IconTwitter IconWhatsapp Icon

చైనాలో జరిగే భారత్‌ ఉత్సవాలకు సంబంధించి లోగోను, పోస్టర్లను, వెబ్‌పేజీని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవీంద్ర సింగ్‌ ఏప్రిల్ 24,2014న ఆవిష్కరించారు. బీజింగ్‌లో భారత రాయబారి ఆశోక్‌ కె.కాంత కూడా వీటినే బీజింగ్‌లో కూడా ఆవిష్కరించారు.
 
ఈ ఉత్సవాల ద్వారా ఉభయ దేశాలు తమ మధ్య నున్న స్నేహపూర్వక సంబంధాలను పటిష్టం చేసుకోనున్నాయి. అందులో భాగంగానే 2014వ సంవత్సరాన్ని చైనా, భారత్ ప్రభుత్వాలు ఇండో-చైనా స్నేహపూర్వక (India-China Year of Friendly Exchanges) సంవత్సరంగా ప్రకటించింది.

2013 మే లో చైనా ప్రధాని లీ కెక్వియాంగ్‌ భారత్‌లో పర్యటించినపుడు, మరియు 2013 అక్టోబరులో భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చైనాలో పర్యటించినపుడు కుదిరిన పరస్పర అవగాహనా ఒప్పందం కారణంగానే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

ఈ ఉత్సవాలను 2014 మే నుండి వచ్చే 2015  మార్చి వరకు చైనాలోని 12 నగరాల్లో నిర్వహిస్తారు. దీనికోసం మే 7వ తేదిన 75మంది సభ్యులతో కూడిన భారత ప్రతినిధి వర్గం చైనాలో పర్యటించనుంది.

భారత్‌ ఉత్సవాల లోగోలో భారత సంస్కృతి ప్రతిభింభిచేల కథాకళి ముఖ చిత్రం, మరియు చైనా సంస్కృతి ప్రతిభింభిచేల బీజింగ్‌ ఒపేరా మాస్క్ తో రూపొందించారు. ఈ ఉత్సవాలను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, విదేశంగా శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS