Search

ఓఎన్‌జీసి విదేశ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నరేంద్ర కుమార్ వర్మ ఎంపిక

పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు నరేంద్రకుమార్ వర్మను ఓ.ఎన్.జీ.సి విదేశ్ లిమిటెడ్ (ఓవిఎల్) నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపిక చేసింది.

May 24, 2014 18:01 IST
facebook IconTwitter IconWhatsapp Icon

పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పి.ఈ.ఎస్.బి) మే 21, 2014న నరేంద్ర కుమార్ వర్మను ఓ.ఎన్.జీ.సి విదేశ్ లిమిటెడ్ (ఓవిఎల్) నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపిక చేసింది. నరేంద్ర కుమార్ వర్మ ప్రస్తుతం ఓవిఎల్ మాతృ సంస్థ ఓ.ఎన్.జీ.సీ ఎక్స్‌ప్లోరేషన్స్ విభాగ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఓవిఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న దినేష్ కే సరాఫ్ మార్చి 2014లో ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓ.ఎన్.జీ.సి) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ గా బాధ్యతలను చేపట్టారు. ఆయన స్థానంలో నరేంద్ర కుమార్ వర్మ ఈ బాధ్యతలను చేపట్టారు.

నరేంద్ర కుమార్ వర్మ

  • నరేంద్ర కుమార్ వర్మ అప్లైడ్ జియాలజిలో మాస్టర్స్ పట్టాను మరియు పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్స్ లో ఎం.టెక్ డిగ్రీని కలిగి ఉన్నారు. దీనికి అదనంగా ఆయన ఫైనాన్స్ లో ఎంబీఏ పట్టాను పొందారు.
  • ఆయన ఫ్రాంటియర్ బేసిన్, ముంబై ఆఫ్ షోర్, అస్సాం అరాకన్ బేసిన్ ఎక్స్‌ప్లోరేషన్స్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఆయన వియత్నాం, మయన్మార్, ఇండోనేషియా, ఖతర్, నార్త్ కాస్పియన్ మరియు ఇరాన్ అఫ్ షోర్ బ్లాకుల పరిమాణాల అంచనాను పర్యవేక్షిస్తున్నారు.

 
ఓ.ఎన్.జీ.సి విదేశ్ లిమిటెడ్

  • ఓ.ఎన్.జీ.సి విదేశ్ లిమిటెడ్ (ఓవిఎల్) భారత ప్రభుత్వం యొక్క మహారత్న షెడ్యుల్  “ఏ” కేంద్ర పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ (సిపిఎస్ఈ) కంపెనీ. ఇది పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వశాఖ పరిపాలన నియంత్రణలో పనిచేస్తుంది. ఈ కంపెనీ పూర్తిగా ఓ.ఎన్.జీ.సీ యొక్క విదేశీ విభాగం.
  • ఓవిఎల్ ప్రధానంగా 16 దేశాలలో (విదేశాల్లో) ఆయిల్, నాచురల్ గ్యాస్ నిక్షేపాలను కనుగొనటం, అభివృద్ధి, ఉత్పత్తి మరియు వెలికితీత వంటి వ్యాపార కలాపాలను కలిగి ఉంది.


ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ (ఓవిఎల్), మార్చి 5, 1965న ఏర్పడిన హైడ్రోకార్బన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి జూన్ 15, 1989న ఓవిఎల్ గా మారింది.
 
ఓవిఎల్ కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉండగా, దీని మాతృ సంస్థ ఓ.ఎన్.జీ.సీ కేంద్ర కార్యాలయం డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)లో ఉంది.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS