Search

15వ భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం

బిజెపి నేత నరేంద్ర మోడీ 15వ భారత ప్రధానిగా మే 26, 2014న ప్రమాణస్వీకారం చేశారు.

May 27, 2014 10:05 IST
facebook IconTwitter IconWhatsapp Icon

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో బిజెపి నేత నరేంద్ర మోడీ 15వ భారత ప్రధానిగా మే 26, 2014న ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నరేంద్ర మోడీ తోపాటు 45 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
 
నరేంద్ర మోడీ నేతృత్వంలో 45 మంది సభ్యులు ప్రమాణం చేయగా, వారిలో 23 మంది కేబినెట్ మంత్రులు కాగా, 10 మంది స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రులు, వీరితోపాటు మరో 12 మంది సహాయ మంత్రులు ప్రమాణం చేశారు. వీరిలో బిజెపి పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కారీ, వెంకయ్యనాయుడు, ఉమాభారతి, రవిశంకర్ ప్రసాద్ తదితరులు కీలక శాఖలను అందుకున్నారు.

మోడీ మంత్రివర్గంలో మహిళలకు సముచిత ప్రాధాన్యత లభించింది. ఏడుగురు మహిళలకు మోడీ అవకాశం కల్పించారు. సుష్మాస్వరాజ్, నజ్మాహెప్తుల్లా, ఉమాభారతి, మేనకాగాంధీ, హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్, స్మృతి ఇరానీలకు కేబినెట్ హోదా లభించగా, నిర్మల సీతారామన్‌ను సహాయమంత్రిగా నియమించారు.
 
మోడీ మంత్రివర్గంలోని అత్యంత చిన్న, అత్యంత వృద్ధ మంత్రులు కూడా మహిళలే కావడం విశేషం. 38 ఏళ్ల స్మృతి ఇరానీ అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి కాగా, 74 ఏళ్ల నజ్మా హెప్తుల్లా అత్యధిక వయస్సు కలిగిన మంత్రిగా ఉన్నారు. వీరిద్దరూ రాజ్యసభ సభ్యులు కావడం విశేషం. నజ్మా హెప్తుల్లా మోడీ మంత్రివర్గంలోని ఏకైక ముస్లిం మంత్రి కావడం గమనార్హం. పురుషుల్లో వృద్ధ మంత్రిగా 74 ఏళ్ల  కల్‌రాజ్ మిశ్రా గుర్తింపు పొందారు.
ఈ మంత్రివర్గాన్ని మే 27, 2014న అధికారికంగా ప్రకటించారు.

కొత్త మంత్రులు వివరాలు
   మంత్రి  పేరు                            మంత్రిత్వశాఖ పేరు
1) రాజ్‌నాథ్ సింగ్                 -    హోం శాఖ
2) సుష్మా స్వరాజ్                -    విదేశీ భారత వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల శాఖ
3) అరుణ్ జైట్లీ                     -    ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ మరియు అదనంగా రక్షణ శాఖ
4) ఎం. వెంకయ్యనాయుడు       -    పట్టణాభివృద్ధి, హౌసింగ్ మరియు పట్టణ దారిద్ర్య నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
5) నితిన్ గడ్కారీ                  -    జాతీయ రహదారులు, ఉపరితల రవాణా, షిప్పింగ్ శాఖ
6) డీవీ సదానంద గౌడ            -    రైల్వే శాఖ
7) నజ్మా హెప్తుల్లా                 -    మైనారిటీ వ్యవహారాల శాఖ
8) ఉమాభారతి                    -    గంగా నది ప్రక్షాళన మరియు జలవనరుల అభివృద్ధి శాఖ
9) గోపీనాథ్ ముండే               -    గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సురక్షిత మంచినీరు మరియు పారిశుధ్య శాఖ
10) రామ్‌విలాస్ పాశ్వాన్        -    ఆహార, పౌరసరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ
11) కల్‌రాజ్ మిశ్రా                -    సూక్ష్మ చిన్న మరియు మధ్యస్థాయి ఎంటర్‌ప్రైజెస్
12) మేనకా గాంధీ                -    మహిళ, శిశు సంక్షేమ శాఖ
13) అనంత్‌కుమార్               -    రసాయన, ఎరువుల శాఖ
14) అశోక్ గజపతి రాజు          -    పౌర విమానయాన శాఖ
15) అనంత్ గీతె                  -    భారీపరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ
16) హర్‌సిమ్రత్‌సింగ్ కౌర్        -     ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమల శాఖ
17) రవిశంకర్ ప్రసాద్            -     న్యాయ, టెలికాం, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ
18) నరేంద్ర సింగ్ తోమర్         -     గనులు, ఉక్కు, కార్మిక మరియు ఉపాధి శాఖ
19) జువల్ ఓరామ్               -     గిరిజన వ్యవహారాల శాఖ
20) రాధామోహన్ సింగ్         -     వ్యవసాయ శాఖ
21) తావర్ చంద్ గెహ్లాట్         -     సామాజిక న్యాయం, సాధికారత శాఖ
22) స్మృతి జుబిన్ ఇరానీ        -     మానవవనరుల అభివృద్ధి శాఖ
23) హర్షవర్ధన్                   -     ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

 సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)

1) జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్      - ఈశాన్య ప్రాంత అభివృద్ధి (స్వతంత్ర హోదా), విదేశీ వ్యవహారాలు, విదేశీ భారత వ్యవహారాల శాఖ
2) ఇందర్జిత్‌సింగ్ రావు            -  ప్లానింగ్ (స్వతంత్ర హోదా), గణాంక ప్రోగ్రాం అమలు (స్వతంత్ర హోదా), మరియు రక్షణ శాఖ
3) సంతోష్‌కుమార్ గంగ్వార్       -  టెక్స్‌టైల్స్‌ (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాలు,   గంగా నది     ప్రక్షాళన  మరియు   జలవనరుల అభివృద్ధి శాఖ
4) శ్రీపద్ యశోనాయక్           -  సంస్కృతి (స్వతంత్ర హోదా) మరియు పర్యాటక (స్వతంత్ర హోదా) శాఖ
5) ధర్మేంద్ర ప్రధాన్                -  పెట్రోలియం, సహజ వాయువు (స్వతంత్ర హోదా) శాఖ
6) సర్బానంద సోనోవాల్          -  నైపుణ్యాల అభివృద్ధి, యువజన వ్యవహారాలు మరియు క్రీడా (స్వతంత్ర హోదా) శాఖ 
7) ప్రకాశ్ జవదేకర్                -  సమాచార, ప్రసార, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ
8) పియూష్ గోయల్              -  విద్యుత్ (స్వతంత్ర హోదా), బొగ్గు (స్వతంత్ర హోదా) శాఖ
9) జితేంద్ర సింగ్                   -  సైన్స్ అండ్ టెక్నాలజీ (స్వతంత్ర హోదా) ఎర్త్ సైన్సెస్ (స్వతంత్ర హోదా) శాఖ
10) నిర్మల సీతారామన్          -  వాణిజ్య, పరిశ్రమ, (స్వతంత్ర హోదా) ఆర్ధిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ

  సహాయ మంత్రులు

1) జీఎం సిద్ధేశ్వర                         -   పౌర విమానయాన శాఖ
2) మనోజ్ సిన్హా                           -   రైల్వే శాఖ
3) నిహాల్‌చంద్                           -    రసాయన, ఎరువుల శాఖ
4) ఉపేంద్ర కుష్వాహ                     -    గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సురక్షిత మంచి నీరు, పారిశుధ్ద్య శాఖ
5) పీ రాధాకృష్ణన్                         -    భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ
6) కిరణ్ రాజు                             -   హోం వ్యవహారాల శాఖ
7) కృష్ణన్ పాల్                           -    ఉపరితల రవాణా, హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ
8) సంజీవ్ కుమార్ బాల్యన్               -   వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ
9) మన్సుఖ్‌భాయి ధన్జీభాయి వాసవ    –   గిరిజన వ్యవహారాలు శాఖ
10) రావు సాహెబ్ దాదారావు దాన్వే    -    ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ
11) విష్ణుదేవ్ సాయి                     -    గనులు, ఉక్కు, కార్మిక మరియు ఉపాధి శాఖ
12) సుదర్శన్ భగత్                     -    సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS