Search

నాలుగోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నవీన్ పట్నాయక్

బిజూ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ వరుసగా నాలుగోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా మే 21, 2014న ప్రమాణ స్వీకారం చేశారు.

May 22, 2014 13:01 IST
facebook IconTwitter IconWhatsapp Icon

బిజూ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ వరుసగా నాలుగోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా మే 21,2014న ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లోని రాజ్ భవన్ లో జరిగింది. నాలుగుసార్లు వరుసగా ఒడిశా ముఖ్యమంత్రి పీఠాన్ని పొందిన నేతగా నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టించారు.

ఒడిశా రాష్ట్ర గవర్నర్ ఎస్.సి. జమీర్, నవీన్ పట్నాయక్ తోపాటు 21 మంది నూతన మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో 11 మంది క్యాబినెట్ మంత్రులు కాగా, 10 మంది సహాయ మంత్రులు.

ప్రదీప్ కుమార్ అమాత్, డాక్టర్ దామోదర్ రౌత్, దేబి ప్రసాద్ మిశ్రా, ప్రదీప్ మహారథి, బిజయిశ్రీ రౌత్రే, బిక్రం కేషరి అరుఖ్, ఉషా దేవి, లాల్ బెహారీ హిమిరిక, జోగేంద్ర బెహెర, బద్రి నారాయణ పాత్ర మరియు పుష్పెంద్ర సింగ్ దియో క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.

ప్రఫుల్ల మాలిక్, రమేష్ చంద్ర మజ్హి, అతాను సబ్యసాచి నాయక్, అరుణ్ కుమార్ సాహు, సంజయ్ కుమార్ దాస్బుర్మ, సుదం మరాండి, అశోక్ కుమార్ పాండా, ప్రణబ్ ప్రకాష్ దాస్, ప్రదీప్ పాణిగ్రాహి మరియు స్నేహాంగిని చ్చూరియా సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

2014 అసెంబ్లీ ఎన్నికలలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ పార్టీ 147 అసెంబ్లీ స్థానాలకు గాను 117 స్థానాలు గెలిచి మెజారిటీని సాధించింది. కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలను, భారతీయ జనతా పార్టీ 10 స్థానాలను నెగ్గింది. సమతా క్రాంతి దళ్ పార్టీ ఒక స్థానాన్ని గెలవగా, ఇతరులు మూడు స్థానాలను గెలిచారు.

నవీన్ పట్నాయక్ గురించి క్లుప్తంగా

• నవీన్ పట్నాయక్ అక్టోబర్ 16, 1946న జన్మించారు. ఆయన మాజీ ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ కుమారుడు. ఆయన 1997లో బిజూ జనతాదళ్ పార్టీని స్థాపించారు.ఆయన వయస్సు 67 సంవత్సరాలు.
• అంతకముందు ఆయన జనతాదళ్ పార్టీలో పనిచేశారు. ఆయన రాజకీయ నేత మాత్రమే కాక రచయిత కూడా.
• ఆయన మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్‌ (1998) ప్రభుత్వ క్యాబినెట్‌లో కేంద్ర గనుల శాఖ మంత్రిగా (బిజూ జనతాదళ్ పార్టీ) పనిచేశారు.
• ఆయన మార్చి 5, 2000వ సంవత్సరం నుంచీ ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS