Search

ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు నగరం యొక్క వృక్ష జాతులు పేరుతో పుస్తకం రచించిన పిఆర్ మోహన్ రావు

పిఆర్ మోహన్ రావు ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు నగరం యొక్క వృక్ష జాతులు పేరుతో ఒక పుస్తకం రచించారు.

Feb 26, 2015 17:50 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు నగరం యొక్క వృక్ష జాతులు : పిఆర్ మోహన్ రావు

పిఆర్ మోహన్ రావు ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు నగరం యొక్క వృక్ష జాతులు పేరుతో ఒక పుస్తకం రచించారు. గుంటూరు నగరంలో గల వృక్ష సంపదను గురించి రచయుత ఈ గ్రంధంలో సమగ్రంగా వివరించారు.ఇది గుంటూరులోని అనేక జాతుల మొక్కలు మరియు చెట్లును గురించి అందుబాటులో ఉన్న మరియు ప్రామాణికమైన గ్రంధం.

76 ఆవృత బీజ కుటుంబాలకు చెందిన 431 పుష్పించే మొక్కలు, పొదలు మరియు చెట్లకు సంబంధించిన సమాచారం ఈ పుస్తకంలో లభిస్తుంది. బెన్థం మరియు హుకర్ విధానం యొక్క వర్గీకరణ ఆధారంగా మొక్కలు, పొదలు మరియు చెట్లు కుటుంబాలను క్రమపద్ధతిలో ఏర్పాటు చేశారు.

మోహన రావు గురించి
మోహన రావు ఒక పదవీవిరమణ పొందిన ప్రొఫెసర్ మరియు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఎఎన్ యు) లో బోటనీ శాఖ మాజీ అధిపతి (.హెచ్ఒడి). ఈ పుస్తకం రాస్తున్న సమయంలో ఈయనకి, ఎఎన్ యు అసిస్టంట్ బోటనీ ప్రొఫెసర్ ఎస్ కె ఖాసిమ్ మరియు మాజీ పరిశోధన విద్యార్థి బీబీ ఆసియా సహకరించారు. వీరిద్దరూ డెహ్రా డన్ నుండి బిషన్ సింగ్ మహేంద్ర పల్ సింగ్ ప్రచురించిన ఈ పుస్తకానికి సహ-రచయితలుగా ఉన్నారు.

 

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS