Search

హిందీ రచయిత విశ్వనాథ్ త్రిపాఠికి 2013 వ్యాస్ సమ్మాన్ అవార్డు ప్రదానం

ప్రసిద్ధ హిందీ రచయిత విశ్వనాథ్ త్రిపాఠి మే 29, 2014న ప్రఖ్యాతిగాంచిన వ్యాస్ సమ్మాన్ అవార్డు – 2013 ను అందుకున్నారు.

May 31, 2014 10:10 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ప్రసిద్ధ హిందీ రచయిత విశ్వనాథ్ త్రిపాఠి  మే 29, 2014న  ప్రఖ్యాతిగాంచిన వ్యాస్ సమ్మాన్ అవార్డు – 2013 ను అందుకున్నారు. ఈ సాహితీ అవార్డు కింద ఆయన ఒక మెమెంటో, ఒక ప్రశంసాపత్రంతోపాటు 2.5 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకున్నారు. ఆయన రచించిన వ్యోంకేష్ దర్వేష్ రచనకు గాను 23వ వ్యాస్ సమ్మాన్ అవార్డును అందుకున్నారు.

వ్యాస్ సమ్మాన్ అవార్డు

• వ్యాస్ సమ్మాన్ అవార్డును 1991లో కే.కే.బిర్లా ఫౌండేషన్ నెలకొల్పింది. ఈ అవార్డును పదేళ్ళ కాలంలో హిందీ భాషలో విశేష రచనలు చేసిన వారికి అందజేస్తారు.
• భారత్ కే ప్రాచీన్ భాష పరివార్ ఆర్ హిందీ అనే సాహితీ రచనకు గాను తొలిసారిగా రామ్ విలాస్ శర్మ ఈ అవార్డును అందుకున్నారు.
• న భూతో న భవిష్యతి అనే నవలకు గాను నరేంద్ర కోహ్లి 2012 వ్యాస్ సమ్మాన్ అవార్డును పొందగా, రామ్ దరష్ మిశ్రా తన కవితాసంకలనం ఆమ్ కే పత్తే కు 2011 వ్యాస్ సమ్మాన్ అవార్డును స్వీకరించారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS