Search

ఐదోసారి సిక్కిం ముఖ్యమంత్రిగా పవన్ కుమార్ చామ్లింగ్ ప్రమాణస్వీకారం

పవన్ కుమార్ చామ్లింగ్ మే 21, 2014న సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు.

May 22, 2014 09:01 IST
facebook IconTwitter IconWhatsapp Icon

పవన్ కుమార్ చామ్లింగ్ మే 21, 2014న సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్టక్ లోని రాజ్ భవన్ లో జరిగింది. సిక్కిం రాష్ట్ర గవర్నర్ శ్రీనివాస్ పాటిల్, పవన్ చామ్లింగ్ తోపాటు 11 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు.

పవన్ కుమార్ చామ్లింగ్ నాయకత్వంలోని సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ 2014 అసెంబ్లీ ఎన్నికలలో మూడింట రెండొంతుల మెజారిటీని సాధించి 32 అసెంబ్లీ స్థానాలకు గాను, 22 అసెంబ్లీ స్థానాలను చేజిక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ 10 అసెంబ్లీ స్థానాలను పొంది ప్రధాన విపక్షంగా ఆవిర్భవించింది.

సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన 63 ఏళ్ల పవన్ కుమార్ చామ్లింగ్ డిసెంబర్ 12, 1994 నుంచి సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.  ఆయన ఈ పదవిలో 20 సంవత్సరాలను పూర్తి చేసుకోనున్నారు.
 
ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చామ్లింగ్ ఈ ఐదేళ్ళ పదవి కాలాన్ని పూర్తి చేస్తే, ఎక్కువకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు మాజీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, దివంగత కమ్యూనిస్ట్ నేత జ్యోతిబసు ఎక్కువకాలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా రికార్డును కలిగి ఉన్నారు.
 
సుప్రసిద్ధ కమ్యూనిస్ట్ నేత అయిన జ్యోతిబసు 1977 నుండి 2000 వరకు 23 ఏళ్ల పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS