Search

ప్రపంచంలో మొట్టమొదటి డెంగ్యూ టీకాను ఆమోదించిన మొదటి ఆసియా దేశంగా ఫిలిప్పీన్స్

ఫిలిప్పీన్స్ 22 డిసెంబర్ 2015 న ప్రపంచంలో మొట్టమొదటి డెంగ్యూ టీకా డెంగ్వాక్సియా మార్కెటింగ్ కోసం ఆమోదం తెల్పిన తొలి ఆసియా దేశంగా మారింది.

Dec 28, 2015 05:28 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఫిలిప్పీన్స్ 22 డిసెంబర్ 2015 న ప్రపంచంలో మొట్టమొదటి డెంగ్యూ టీకా డెంగ్వాక్సియా మార్కెటింగ్ కోసం ఆమోదం తెల్పిన తొలి ఆసియా దేశంగా మారింది.

ఫిలిప్పీన్స్ యొక్క ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్థానిక ప్రాంతాల్లో 9 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగిన అందరిలో నాలుగు రకాల డెంగ్యూ వైరస్ క్రిముల వల్ల కలిగే వ్యాధి నివారణ కోసం డెంగ్వాక్సియా టీకాను ఆమోదించింది.

గతంలో 9 డిసెంబర్ 2015 న ఫ్రెంచ్ ఔషధ దిగ్గజం సనోఫీ ద్వారా తయారైన డెంగ్వాక్సియా టీకా మెక్సికో లో దాని తొలి నియంత్రణ అనుమతిని సంపాదించింది.

డెంగ్వాక్సియా టీకాకు సంబంధించిన కీలక వాస్తవాలు
• వైద్య నష్టానికి రక్షణ కోసం ఫెడరల్ కమిషన్ (కోఫెప్రిస్), స్థానీయ ప్రాంతాల్లో పసిపిల్లలు, కౌమార మరియు పెద్దలు, 9 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగిన అందరిలో నాలుగు రకాల డెంగ్యూ వైరస్ క్రిముల వల్ల కలిగే వ్యాధి నివారణ కోసం డెంగ్వాక్సియా టీకాను ఆమోదించింది.
• డెంగ్వాక్సియా యొక్క కోఫెప్రిస్ ఆమోదం, భౌగోళిక మరియు సాంక్రమిక వ్యాధుల సెట్టింగులు, మరియు జాతి మరియు సామాజిక, ఆర్ధిక నేపధ్యాలుగల 15 దేశాలలో నివసిస్తున్న వివిధ వయసు కలిగిన 40000 మంది పైగా పాల్గొన్న ఒక విస్తృతమైన క్లినికల్ అభివృద్ధి కార్యక్రమం యొక్క ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
• 2014 చివరిలో ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రచురించిన నివేదిక ప్రకారం ప్రస్తుతమున్న నాలుగు ఆకారాల డెంగ్యూ క్రిములకు వ్యతిరేకంగా రక్షించే టీకాలు సగటున 60.8 శాతం ప్రభావ రేటును కలిగి ఉంటాయి.

సనోఫీ గురించి
• సనోఫీ పారిస్, ఫ్రాన్స్ లో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక ఫ్రెంచ్ బహుళజాతి ఔషధ సంస్థ.
• ఇది ఈఎల్ఎఫ్ అక్విటైన్ యొక్క అనుబంధ సంస్థగా 1973 లో స్థాపించబడింది.
• ఈ కంపెనీ ప్రధానంగా ప్రిస్క్రిప్షన్ మార్కెట్ లో ఔషధ పరిశోధన మరియు అభివృద్ధి, తయారీ మరియు మార్కెటింగ్ రంగంలో నిమగ్నమైంది.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS