Search

ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఛైర్మన్ సి రంగరాజన్ రాజీనామా

ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి (పీఎంఈఏసీ) ఛైర్మన్ చక్రవర్తి రంగరాజన్ మే 19, 2014న తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

May 22, 2014 10:08 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి (పీఎంఈఏసీ) ఛైర్మన్ చక్రవర్తి రంగరాజన్ మే 19, 2014న తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో రంగరాజన్ రాజీనామా సమర్పించారు.  పీఎంఈఏసీ చైర్మన్ పదవికాలం ప్రధాని పదవీకాలానికి సమాంతరంగా ఉంటుంది. ఆయన తన రాజీనామాను ప్రధాని మన్మోహన్ సింగ్ కు అందజేశారు.
 
2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయంతో ప్రధాని పదవీకాలం ముగియగా, దీనికి సంబంధించిన పీఎంఈఏసీ సభ్యుల పదవీకాలం కూడా ముగిసింది. ప్రధాని మన్మోహన్ సింగ్  మే 17, 2014న తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.

ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి

ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి (పీఎంఈఏసీ) అనేది ప్రధానంగా భారత ప్రధానికి ఆర్ధిక సలహాలను అందించే ఒక తాత్కాలిక, స్వతంత్ర హోదా గల మండలి. ఈ సలహా మండలి దేశ కీలక ఆర్ధికాంశాల పై తటస్థంగా వ్యవహరించి ఆర్ధిక మాంద్యం, మైక్రోఫైనాన్స్ మరియు పారిశ్రామిక ఉత్పత్తి వంటి కీలక ఆర్ధికాంశాల పైన సలహాలను అందిస్తుంది.

స్వాతంత్ర్యానంతరం ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఎన్నోసార్లు ఏర్పడింది. సి.రంగరాజన్ నేతృత్వంలోని పిఎంఈఏసి కన్నా ముందు సురేష్ టెండూల్కర్ నేతృత్వంలోని పిఎంఈఏసి డిసెంబర్ 29, 2004న యూపిఏ-l ప్రభుత్వ కాలంలో ఏర్పడింది. సురేష్ టెండూల్కర్ నేతృత్వంలోని పిఎంఈఏసి పదవీకాలం మే 21, 2009న ముగిసింది.

డాక్టర్ సి రంగరాజన్ నేతృత్వంలోని ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలిలో (పీఎంఈఏసీ) సౌమిత్ర చౌదరీ, వీఎస్ వ్యాస్, పులిన్ బీ నాయక్ మరియు దిలిప్ ఎం నచానే సభ్యులు. వీరు కూడా తమ రాజీనామాలను సమర్పించారు.
 
సి.రంగరాజన్ నేతృత్వంలోని ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి ఆగస్ట్ 2009లో యూపిఏ- II ప్రభుత్వ కాలంలో ఏర్పడింది.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS