Search

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 22 అక్టోబర్ 2015న భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కృష్ణా జిల్లాలోని ఉద్దండ్రాయినిపాలెంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని భూమిపూజ చేశారు.

Oct 23, 2015 13:07 IST
facebook IconTwitter IconWhatsapp Icon

Andhra Pradesh-Amaravatiఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 22 అక్టోబర్ 2015న భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లాలోని ఉద్దండ్రాయినిపాలెంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని భూమిపూజ చేశారు.

‘అమరావతి- ఇది ప్రజల రాజధాని’ పేరుతో నిర్మించ తలపెట్టిన ఈ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి పొరుగు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, జపాన్ మరియు సింగపూర్ దేశాల వాణిజ్య శాఖ మంత్రులతో పాటు కేంద్ర పట్టాణాభివృద్ది శాఖా మంత్రి వెంకయ్య నాయుడు, కార్మిక శాఖ మంత్రి బాదారు దత్తాత్రేయ మరియు వాణిజ్య శాఖ మంత్రి విమలా సీతరామన్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను భాగస్వాములను చేసేందుకు 2015 అక్టోబర్ 13 నుంచి మన మట్టి, మన నీరు కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి గ్రామంలోనూ ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మట్టి, నీటిని సేకరించింది. పుణ్య నదులు, చెరువులు, సముద్రాల నుంచి జలాలను సేకరించింది. దీనికి అనుగుణంగానే, ప్రదాని ఢిల్లీ నుంచి వస్తూ, పార్లమెంట్ భవనం ఆవరణంలోని మట్టిని మరియు యమునా నదిలోని నీరును తీసుకువచ్చారు.

అంతేకాకుండా, మై బ్రిక్ –మై అమరావతి పేరుతో ఒక వెబ్ పోర్టల్ తెరచి దాని ద్వారా ప్రజలు తమ రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకులను ఒక్కొక్క దానికి 10 రూపాయిలు వెచ్చించి కొనేవెసల బాటును కల్పించింది.

నేపధ్యం

1953లో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తొలుత కర్నూల్ తరువాత హైదరాబాద్ రాజధానిగా వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనేక కారణాలు మరియు ఉద్యమాల తరువాత 2014 జూన్ 2న రెండు రాష్ట్రాలుగా విభజించబడి, భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. అప్పటివరకు రాజధానిగా వున్న హైదరాబాద్ భౌగోళికంగా తెలంగాణాకు చెందడంతో, 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మించుకునే వరకు హైదరాబాద్ ను పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. ఈ విభజనతో ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధాని నిర్మాణం అనివార్యమైంది.

రాష్ట్రంలోని పలు ప్రదేశాలను పరిశీలించిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని రాజధాని నిర్మాణానికి నిర్ణయించింది.

అమరావతి గురించి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిగా ఎంచుకున్న అమరావతి, ఇంద్రుని రాజధానిగా ఉండేదని నానుడి, అయితే పద్దెనిమిది శతాబ్దాల క్రితం శాతవాహనుల రాజధానిగా విరాజిల్లిన అమరావతి చాలా విశాలమైనది. అప్పటి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకలోని ప్రాంతాలు ఉండేవి.

ప్రస్తుత రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 33 వేల ఎకారాల భూమిని సేకరించింది.

రాజాధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అందించింది.

రాజధానిలో పరిపాలన భవంతులను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించుకోనుండగా, మిగిలిన అభివృద్ధి మరియు నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించనున్నారు. ప్రైవేటు భాగస్వాములను స్విస్ ఛాలెంజ్ పద్దతిలో ఎంపిక చేస్తారు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS