Search

దివంగత పోప్‌లు జాన్-23, జాన్ పాల్-2లకు సెయింట్ హోదా

కేథలిక్ చర్చికి నేతృత్వం వహించిన ఇద్దరు ప్రసిద్ధ దివంగత పోప్‌లు జాన్-23, జాన్ పాల్-2లకు 'సెయింట్' హోదా లభించింది.

Apr 29, 2014 10:07 IST
facebook IconTwitter IconWhatsapp Icon

కేథలిక్ చర్చికి నేతృత్వం వహించిన ఇద్దరు ప్రసిద్ధ దివంగత పోప్‌లు జాన్-23, జాన్ పాల్-2లకు 'సెయింట్' హోదా లభించింది. ఈ మేరకు ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 27,2014న వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ప్రకటన చేశారు.
 
లక్షలాది ప్రజల సమక్షంలో తొలిసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహించగా, పదవీ విరమణ చేసిన పోప్ బెనెడిక్ట్-16 కూడా ఇందులో పాల్గొనడం చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. "చర్చి ఏకాభిప్రాయం మేరకు దేవుని ఆశీర్వాదం పొందిన జాన్-23, జాన్ పాల్-2లను సెయింట్లుగా ప్రకటిస్తున్నాం. నేటినుంచి ఈ జాబితాలో చేరిన ఈ మహనీయులు చిరస్మరణీయులు'' అని పొప్ ప్రకటించారు.

పోప్‌గా జాన్-23 (ఇటలీ), అక్టోబర్ 28, 1958 నుండి జూన్ 3, 1963 వరకు వ్యవహరించారు. పోప్‌గా జాన్ పాల్-2 (పోలాండ్), అక్టోబర్ 16, 1978 నుండి ఏప్రిల్ 2,2005 వరకు వ్యవహరించారు.

జాన్‌పాల్-2 మాతృభూమి పోలండ్ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన యాత్రికులు సూర్యోదయానికి ముందే అక్కడికి చేరుకుని, ఎరుపు-తెలుపు రంగు జండాలు రెపరెపలాడిస్తూ ఆనందోత్సాహాలు ప్రకటించారు. ఒకే వేడుకలో ఇద్దరు పోప్‌లు దర్శనమివ్వడం, మరో ఇద్దరు పోప్‌లకు సెయింట్ హోదా ప్రకటించడం అపురూపమని అనేకమంది హర్షామోదాలు వ్యక్తం చేశారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS