Search

2014 పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 26, 2014న ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రదానం చేశారు

Apr 28, 2014 09:59 IST
facebook IconTwitter IconWhatsapp Icon

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 26, 2014న ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో 2014 సంవత్సరానికిగాను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను బహూకరించారు.

మొత్తం 56 మంది ప్రముఖులకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డులను అందజేశారు. ఒకరికి పద్మ విభూషణ్, 11 మందికి పద్మ భూషణ్, 44 మందికి పద్మశ్రీ బిరుదులకు ప్రదానం చేశారు.

పద్మవిభూషణ్

ప్రఖ్యాత యోగా గురువు బేలూరు కృష్ణమాచార్య సుందరరాజ అయ్యంగార్ పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
 
పద్మ భూషణ్

టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, శాస్తవ్రేత్త పి.బలారామ్, జస్టిస్ దల్వీర్ భండారీ, రచయిత రస్కిన్ బాండ్, సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తిరుమలాచారి రామస్వామి, ‘మేనేజ్‌మెంటు గురు’గా ప్రసిద్ధి చెందిన మృత్యుంజయ్ బి ఆత్రేయ, వ్యవసాయ శాస్తవ్రేత్త ఎం.మహదేవప్ప, ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్, ఢిల్లీ ఐఐటిలో పనిచేస్తున్న ప్రొఫెసర్ వినోద్ ప్రకాష్ శర్మ, రచయిత, విద్యావేత్త గులాం మహమ్మద్ షేక్‌లను పద్మ భూషణ్ పురస్కారాలతో సత్కరించారు.

గుజరాతీ విశ్వకోశ్ వ్యవస్థాపకుడు ధీరూబాయ్ ప్రేమ్‌శంకర్ థాకర్‌కు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించగా ఆయన కుటుంబీకులు అవార్డును అందుకున్నారు.
 
పద్మశ్రీ

పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారిలో రంగస్థల నటుడు మహమ్మద్ అలీ బేగ్, జానపద కళాకారుడు రామ్ భరద్వాజ్, ప్రజారోగ్య నిపుణురాలు ఇందిరా చక్రవర్తి, అంతరిక్ష శాస్తవ్రేత్త ఎం.చంద్రశేఖరన్, బెంగాలీ నటి సుప్రియా దేవి, తబలా కళాకారుడు విజయ్ ఘాటే, క్రికెటర్‌ అంజుమ్‌చోప్రా, నటులు పరేష్‌రావల్‌, ఢిల్లీ యూనివర్శిటీ ఉప కులపతి ప్రొఫెసర్‌ దినేష్‌ సింగ్‌ తదితరులున్నారు.

కేంద్ర ప్రభుత్వం మొత్తం 127 మందికి పద్మ అవార్డులను ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించగా, మార్చి 31,2014న రాష్టప్రతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 66 మందికి అవార్డులను అందజేశారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS