Search

ఏపీపీఎస్సీ కొత్త చైర్మన్‌గా ప్రొఫెసర్ ఉదయభాస్కర్ నియామకం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చెర్మన్‌గా జేఎన్‌టీయూకే ప్రొఫెసర్, మూల్యాంకన విభాగం డెరైక్టర్ పిన్నమనేని ఉదయభాస్కర్ 25 నవంబర్ 2015న నియమితులయ్యారు.

Nov 27, 2015 12:02 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చెర్మన్‌గా జేఎన్‌టీయూకే ప్రొఫెసర్, మూల్యాంకన విభాగం డెరైక్టర్ పిన్నమనేని ఉదయభాస్కర్ 25 నవంబర్ 2015న నియమితులయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు (జీఓ నెంబర్ 149) జారీ చేసింది.

ప్రొఫెసర్‌గా ఆయన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

ఉదయభాస్కర్ గురించి

• ఉదయభాస్కర్‌ స్వస్థలం గుంటూరు జిల్లా వేమూరు.

• 1983లో బీటెక్‌(సివిల్‌) జేఎన్‌టీయూ కాకినాడలోనూ, 1985లో ఐఐటీ(కాన్పూర్‌)లో ఎంటెక్‌ పూర్తి చేశారు. 1994లో ఐఐటీ(కాన్పూర్‌)లో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు.

• విజయనగరం, కాకినాడ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించారు. కాకినాడ జేఎన్‌టీయూను మొట్టమొదటి ఎన్‌బీఏ అక్రిడిటేషన్ కాలేజీగా తీర్చిదిద్దారు.

• ఆయన హయాంలోనే మొట్టమొదటి అటానమస్ కాలేజీగా కూడా యూజీసీ నుంచి గుర్తింపు పొందింది.

• విదేశీ వర్సిటీల సంబంధాల డైరెక్టర్‌గా, డైరెక్టర్‌ ఆఫ్‌ అకడమిక్‌ అండ్‌ ప్లానింగ్‌(డీఏపీ)గాను, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, అసోసియేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్‌మెంట్ జీవితకాల సభ్యుడిగా, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ సభ్యుడిగా, ఏఐసీటీఈ ఇన్‌స్పెక్షన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App


Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS