Search

ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న పివి సింధు

భారత బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

Apr 28, 2014 10:01 IST
facebook IconTwitter IconWhatsapp Icon

భారత బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
 
ఏప్రిల్ 26, 2014న గిమ్‌చెయాన్, కొరియాలో జరిగిన సెమీ ఫైనల్‌లో ఆమె వరల్డ్ నెం.2 క్రీడాకారిణి షిజియాన్‌ను ఢీకొని 21-15, 20-22, 12-21 తేడాతో ఓటమి చవిచూసింది. ఈ టోర్నమెంట్ నిబంధనలను అనుసరించి సెమీ ఫైనల్స్‌లో ఓటమిపాలైన ఇద్దరు క్రీడాకారిణులకు కాంస్య పతకాలను బహూకరిస్తారు. సెమీస్‌ను చేజార్చుకున్న సింధు ఈ నిబంధనను అనుసరించే కాంస్య పతకాన్ని సాధించింది.
 
మహిళల డబుల్స్

మహిళల డబుల్స్ విభాగంలో జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప జోడీకి కాంస్య పతకం లభించింది. వీరు సెమీ ఫైనల్‌లో 12-21, 7-21 తేడాతో లూ యింగ్-లూ యు జోడీ చేతితో ఓటమి చవిచూసారు.

మహిళల డబుల్స్‌లో లూ యింగ్-లూ యు (చైనా); మిక్స్‌డ్ డబుల్స్‌లో లీ చున్ హె-చావు హో వా (హాంకాంగ్) జోడిలు టైటిల్స్ సాధించాయి

పురుషుల, మహిళల సింగిల్స్

పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలలో లిన్ డాన్ (చైనా), సుంగ్ జీ యున్ (కొరియా) విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో నాలుగోసీడ్ సుంగ్ జీ యున్ (కొరియా) 21-19, 21-15తో షిజియాన్ వాంగ్ (చైనా)ను ఓడించింది.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS