Search

ఎఫ్ఎఎ వద్ద ప్రాంతాల మరియు కేంద్ర కార్యకలాపాల యొక్క నిర్వహణాధికారిగా రవి చౌదరి నియామకం

24 ఫిబ్రవరి 2015న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) వద్ద ప్రాంతాలు మరియు కేంద్ర కార్యకలాపాల యొక్క నిర్వహణాధికారిగా భారతీయ-అమెరికన్ రవి చౌదరి, నియమితులయ్యారు.

Feb 26, 2015 13:08 IST
facebook IconTwitter IconWhatsapp Icon

24 ఫిబ్రవరి 2015న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) వద్ద ప్రాంతాలు మరియు కేంద్ర కార్యకలాపాల యొక్క నిర్వహణాధికారిగా భారతీయ-అమెరికన్ రవి చౌదరి, నియమితులయ్యారు. ఈ కీలక పదవిలో, చౌదరి తొమ్మిది విభిన్న ప్రాంతాల్లో విమానయాన విధులను చేపడతారు.

ఎఫ్ఎఎ యొక్క 288 మిలియన్ US డాలర్ల ఆపరేటింగ్ బడ్జెట్ను అమలు పరచే బాధ్యత ఈయనపై ఉంటుంది మరియు దేశవ్యాప్తంగా తొమ్మిది  ప్రాంతాల్లో 2100 ఫెడరల్ ఉద్యోగులకు చౌదరి నేతృత్వం వహిస్తారు.

జాతీయ ఏరోస్పేస్ వ్యవస్థ మద్దతును కేంద్రీకృతం చేయడంతోపాటు  రవాణా శాఖ మరియు కార్యకలాపాలు, భద్రత, విధానం, కార్పొరేట్ పెంపు, అత్యవసర సంసిద్ధత, సౌకర్యాల నిర్వహణ ప్రాంతాల్లో ఎఫ్ఎఎ యొక్క విస్తృత సేవలను అందించే బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుంది.

గతంలో చౌదరి, వాషింగ్టన్ ఎయిర్ ఫోర్స్ జిల్లా, ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద 21 సంవత్సరాలపాటు సేవలను అందించారు.

రవి చౌదరి గురించి

• రవి చౌదరి C-17 పైలట్ మరియు ఎయిర్ ఫోర్స్ లో కమాండ్, కార్యాచరణ, ఇంజనీరింగ్ మరియు సీనియర్ సిబ్బంది కేటాయింపులు మొదలగు వివిధ విభాగాల్లో పని చేశారు.

• అతను పెంటగాన్ వద్ద ఎయిర్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ గ్రూప్ సెక్రటరీలో ప్రసంగరచయుత మరియు  వ్యూహాత్మక ప్లానర్ గా మరియు వైమానిక దళ వ్యూహాత్మక ప్రణాళికలు మరియు కార్యక్రమాల సిబ్బందికి డిప్యూటీ చీఫ్ గా కూడా  పనిచేశారు.

• మే 2014 లో ఆసియా అమెరికన్లు మరియు పసిఫిక్ ద్వీపవాసుల అధ్యక్షుడి సలహా సంఘం సభ్యుడిగా చౌదరిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు.

• చౌదరి, ఎయిర్ ఫోర్స్ అకాడెమీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ,, ఎయిర్ యూనివర్శిటీ నుండి ఆపరేషనల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీని మరియు NASA గ్రాడ్యుయేట్ ఫెలోగా సెయింట్ మేరిస్ విశ్వవిద్యాలయంలో నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉన్నారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS