Search

వికలాంగులకు అనుకూలంగా ఉండే ఏటీఎంల ఏర్పాటుకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశం

వికలాంగులకు అనుకూలంగా ఉండే నూతన ఏటీఎంలను ఏర్పాటుచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 21, 2014న అన్ని బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది.

May 24, 2014 13:09 IST
facebook IconTwitter IconWhatsapp Icon

వికలాంగులకు అనుకూలంగా ఉండే నూతన ఏటీఎంలను ఏర్పాటుచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 21, 2014న అన్ని బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయాలు వికలాంగులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉండనున్నాయి.

జులై 1,2014 నుంచి ఏర్పాటు చేసే అన్ని ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ఏటీఎం) లను మాటల ద్వారా సలహాలు, సూచనలు ఇచ్చేవిగా తయారుచేయాలని నిర్దేశించింది. అంతేకాక బ్రెయిలీ కీప్యాడ్‌లు కూడా ఉంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. వీల్‌ ఛెయిర్లలో వచ్చే వారి కోసం తగు ఏర్పాట్లు ఉండాలని చెప్పింది. ప్రస్తుతం ఉన్న ఏటీఎంలు అన్నింటినీ కూడా మాట్లాడే, బ్రెయిలీ కీప్యాడ్‌లు ఉండేవిధంగా మార్చేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని కూడా ఆర్‌బీఐ బ్యాంకులకు తేల్చిచెప్పింది.

2009లో ఆర్.బి.ఐ నీడ్ ఫర్ బ్యాంక్ బ్రాంచెస్/ఏటిఎం టు బి మేడ్ యాక్సేసిబుల్ టు పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ (Need for Bank Branches / ATMs to be made accessible to persons with disabilities) అనే పేరుతో ఒక సర్కులర్ ను విడుదల చేసింది. ఈ సర్కులర్ లో జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు తాము ఏర్పాటు చేసే ఏటీఎంలలో మూడింట ఒకటోవంతు ఏటిఎంలు మాట్లాడే, బ్రెయిలీ కీప్యాడ్‌ సదుపాయాలతో కూడినవి ఉండాలని ఆర్‌బీఐ పేర్కొంది.
 
ఈ సర్కులర్ లోని ముఖ్యాంశాలు

• ఈ ఏటిఎంలను ఏర్పాటు చేసే విషయంలో వాణిజ్య బ్యాంకులన్ని తమలో తాము సంప్రదించుకొని ప్రతి స్థలంలో వికలాంగుల సహాయార్ధం మాటల ద్వారా సలహాలు, సూచనలు ఇచ్చి, బ్రెయిలీ కీప్యాడ్‌లు ఉన్న ఒక ఏటిఎంను ఏర్పాటు చేయాలని సూచించింది.
• వీల్‌చైర్‌ను ఉపయోగించేవారు/వైకల్యంగల వ్యక్తులు ఏటీఎంలను వినియోగించడంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రస్తుత, భవిష్యత్తులో ఏర్పాటు చేసే ఏటీఎంల వద్ద ర్యాంప్‌లను ఏర్పాటుచేయాలని సూచించింది. ఏటీఎంల ఎత్తు వీల్‌చైర్‌లో వచ్చే వారికి అణువుగా ఉండేవిధంగా చూడాలని పేర్కొంది.
• కంటిచూపు సరిగాలేని (లో విజన్) వ్యక్తుల కోసం ఏటీఎంల వద్ద మ్యాగ్నిఫయింగ్ గ్లాస్‌లను అందుబాటులో ఉంచాలని సూచించింది.
• వైకల్యంగల వ్యక్తులకు కల్పిస్తున్న సదుపాయాలన్నింటి వివరాలను తెలియజేసే నోటీసుబోర్డును కొట్టొచ్చినట్లు కనిపించేలా ఏర్పాటు చేయాలని కూడా ఆర్.బి.ఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
 
ఈ అంశాలకు సంబంధించిన పురోగతిని బ్యాంకులు తమ కస్టమర్ సర్వీస్ కమిటీకి ఎప్పటికప్పుడు నివేదించాలని స్పష్టం చేసింది.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS