Search

బంగారం దిగుమతుల పై నిబంధనలను సరళతరం చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 21, 2014న బంగారం దిగుమతుల పై నిబంధనలను 20:80 పథకం కింద సరళతరం చేసింది.

May 26, 2014 11:05 IST
facebook IconTwitter IconWhatsapp Icon

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 21, 2014న బంగారం దిగుమతుల పై నిబంధనలను 20:80 పద్ధతి కింద సరళతరం చేసింది. ఈ 20:80 పద్ధతిలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డి.జి.ఎఫ్.టి) చేత నామినేటెడ్ ఏజెన్సీలుగా రిజిస్టర్ అయిన స్టార్ ట్రేడింగ్ హౌసెస్ మరియు ప్రీమియర్ ట్రేడింగ్ హౌసెస్ బంగారం దిగుమతులను చేసుకోవచ్చు.

ఈ నిర్ణయంతో బంగారం దిగుమతులు చేసుకునే సంస్థల సంఖ్య పెరగనుంది. తద్వారా బంగారం లభ్యత పెరిగి, బంగారం ధరలు దిగిరావడానికి ఆస్కారం ఉంది.

దిగజారుతున్న రూపాయి విలువ మరియు కరెంట్ అకౌంట్ డెఫిసిట్(క్యాడ్)లను స్థిరీకరణ చేసేందుకు ఆర్.బి.ఐ జూలై 2013లో బంగారం దిగుమతుల పై ఎన్నో నిబంధలను విధించింది. అప్పుడు ఆర్.బి.ఐ విధించిన 20:80 ఫార్ములా బంగారం దిగుమతులు మరియు ఎగుమతులను నిర్ణయించింది.

20:80 పథకం కింద, ప్రతి ఒక దిగుమతిదారు తన దిగుమతి చేసుకున్న బంగారంలో కనీసం 20 శాతం బంగారాన్ని ఎగుమతులు చేయాలి మరియు దేశీయ వాడక సంతులనం కోసం 80 శాతం బంగారాన్ని అందుబాటులో ఉంచాలి. ఈ సౌకర్యాన్ని ఎంపిక చేయబడిన బ్యాంకులకు మాత్రమే పరిమితం చేసి ఇతర సంస్థలను బంగారం దిగుమతులు నుండి నిరోధించారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS