Search

సిరియా గగనతలంలో పరస్పర వాయుసేనల మధ్య ఘర్షణల నివారణకు అమెరికా, రష్యా సైనిక దళాల ఒప్పందం

రష్యా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 20 అక్టోబర్ 2015న పరస్పర అంగీకార ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశాయి. దీని ప్రకారం సిరియాలో జరిగే సైనిక చర్యల్లో రెండు దేశాల వైమానిక దళాలు ఘర్షణకు దూరంగా ఉంటాయి.

Oct 26, 2015 17:12 IST
facebook IconTwitter IconWhatsapp Icon

రష్యా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 20 అక్టోబర్ 2015న పరస్పర అంగీకార ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశాయి. దీని ప్రకారం సిరియాలో జరిగే సైనిక చర్యల్లో రెండు దేశాల వైమానిక దళాలు ఘర్షణకు దూరంగా ఉంటాయి. రష్యా రక్షణమంత్రి మరియు అమెరికా రక్షణ మంత్రులు ఇద్దరూ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం సిరియా గగనతలంలో రెండు దేశాల వైమానిక దళాల మధ్య సుహృద్భావ వాతావరణంలో ఘర్షణలకు తావులేకుండా కష్టకాలంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయానికి వచ్చాయి.

ఈ ఒప్పందం ప్రకారం సంకీర్ణ సభ్యులైన సౌదీ అరేబియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య పరస్పర సహకారం ఉంటుంది.

రష్యా సిరియాపై 30 సెప్టెంబర్ 2015 నుంచి వైమానిక దాడులు ప్రారంభించింది. ఇస్లామిక్ తీవ్రవాదులే లక్ష్యంగా సాగుతోంది. అయితే అమెరికా కు చెందిన యుద్ధ విమానాలు కూడా అక్టోబర్ లో అదే ప్రాంతంలో తన సైనిక చర్యలు చేపట్టాయి.  రెండుదేశాల సేనలు ఒకే పరిధిలోకి వచ్చాయి.

పెంటగాన్ అధికార ప్రతినిధి పీటర్ కుక్ ఈ ఒప్పందం రష్యా వినతిమేరకు జరిగింది. దీని ద్వారా రెండు దేశాల సైనిక అధికారుల మధ్య పరస్పర సమాచారం ఉంటుంది. రెండు దేశాలు రహస్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుని తమ లక్ష్యాల వైపు ముందుకు సాగుతాయి.

రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్  అంటాలీ ఆంటోనీ రెండుదేశాలు కొన్ని నియమాలు, ఆంక్షలను పాటిస్తాయి.  అమెరికా, రష్యా విమానాల మధ్య ఎలాంటి ఘటనలు జరగకుండా ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS