Search

పుట్నిసైట్ అనే నూతన ఖనిజాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో శాస్త్రవేత్తలు పుట్నిసైట్ అనే నూతన ఖనిజాన్ని ఇటీవల కనుగొన్నారు.

Apr 25, 2014 13:05 IST
facebook IconTwitter IconWhatsapp Icon

పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో శాస్త్రవేత్తలు పుట్నిసైట్ అనే నూతన ఖనిజాన్ని ఇటీవల కనుగొన్నారు.  ఈ ఖనిజాన్ని కనుగొన్న ఆస్ట్రేలియా ఖనిజ శాస్త్రవేత్తలు ఆండ్రూ, క్రిస్టిన్ పుట్నిస్ పేర్ల ఆధారంగా దీనికి పుట్నిసైట్ అని నామకరణం చేశారు. ఈ ఖనిజం రసాయన నామం SrCa4 Cr +3, 8 (CO3)8 SO4(OH)16 25H2O. ఈ పరిశోధన అంశాన్ని ఫిబ్రవరి 2014 ఎడిషన్ మినరలాజికాల్ మ్యాగజైన్ 78వ సంచిక వెల్లడించింది. ఈ ఖనిజం గురించిన విశేషాలు ఇటివలే వార్తల్లో ప్రచురించారు.
 
పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఈ ఖనిజం లభించింది. దీనిని ప్రాథమిక పరిశీలన కోసం కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(CSIRO)కు తరలించి ఆ తర్వాత పూర్తి వివరాల కోసం ఇలియట్ పట్టణానికి తరలించారు.

పుట్నిసైట్ అనే ఈ నూతన ఖనిజం 4000 సంఖ్య గల ఖనిజాల కుటుంబంలో, వినూత్న నిర్మాణాన్ని కలిగి ఉంది. ఈ ఖనిజం అరుదైన ఖనిజ మిశ్రమంతో స్ట్రాన్షియం, కాల్షియమ్, క్రోమియం, సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ అణువులను కలిగి ఉంది.

ఈ నూతన ఖనిజం ఉత్తర నోర్స్ మాన్ ప్రాంత కొవాన్ సరస్సు వద్ద జరిగిన ఉపరితల తవ్వకాల్లో (పశ్చిమఆస్ట్రేలియా) లభించింది. అగ్నిపర్వతాల పై లభించిన ఈ ఖనిజం చిన్న స్పటికాల రూపంలో 0.5 మిమీలకు తక్కువకాని అడ్డుకోలతను కలిగి ఉంది.
 
ఈ ఖనిజం ముదురు ఆకుపచ్చ తెల్లని రాయి పై గులాబీ చుక్కలను కలిగి ఉంటుంది.  సూక్ష్మదర్శిని కింద వీక్షించినట్లైతే ఇది చతురస్రాకార, ఘనాకార స్పటికాల రూపంలో కనిపిస్తుంది.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS