Search

ఆస్ట్రేలియన్ ఫార్ములావన్ దిగ్గజం సర్ జాక్ బ్రాబమ్ కన్నుమూత

ఫార్ములావన్ గ్రేట్‌గా పేరు ప్రతిష్టలు సాధించిన సర్ జాక్ బ్రాబమ్ మే 19,2014న కన్నుమూశారు.

May 22, 2014 13:06 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఫార్ములావన్ గ్రేట్‌గా పేరు ప్రతిష్టలు సాధించిన సర్ జాక్ బ్రాబమ్ మే 19,2014న కన్నుమూశారు. 88 ఏళ్ల ఈ ఆస్ట్రేలియన్ ఫార్ములావన్ దిగ్గజం చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

సర్ జాక్ బ్రాబమ్ 1959, 1960 మరియు 1966లలో మూడు ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్స్ సాధించడమే కాకుండా, తాను సొంతంగా తయారుచేసుకున్న కారుతో రేసులో విజేతగా నిలిచిన ఏకైక డ్రైవర్‌గా పేరు తెచ్చుకున్నారు. 1955 నుంచి 1970 వరకు కెరీర్ కొనసాగించిన జాక్ బ్రాబమ్ 14 రేసుల్లో విజేతగా నిలిచి, 31 పోడియంలు, 13 పోల్ పొజిషన్‌ లను సాధించారు. 1959, 1960 సంవత్సరాల్లో ప్రపంచ చాంపియన్‌గా ఎదిగిన జాక్ బ్రాబమ్, ఆతర్వాత కూపర్ రేసింగ్ జట్టుకు రూపకల్పన చేశాడు.

సర్ జాక్ బ్రాబమ్

• ఆయన బ్లాక్ జాక్ అనే మారుపేరుతో సుపరిచితులు.  బ్రాబమ్ మౌనంగా ఉండేందుకే ఇష్టపడేవాడు కావడంతో, అతనిని ‘బ్లాక్ జాక్’ అని వ్యవహరించేవారు.
• ఆయన మోటార్‌స్పోర్ట్స్‌కు అందించిన సేవలకుగాను 1979లో నైట్‌హుడ్ బిరుదును పొందిన తొలి ఎఫ్-1 డ్రైవర్ గా గుర్తింపు పొందారు.
• తాను స్వయంగా రూపొందించుకున్న కారుతో రేసును గెలుపొందిన తొలి ఫార్ములావన్ డ్రైవర్ గా బ్రాబమ్ చరిత్ర సృష్టించాడు. ఆయన 1966లో ఫ్రెంచ్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసును గెల్చుకున్నారు. ఈ కారును రూపొందించిన ఆస్ట్రేలియన్ రేప్కో కంపెనీ దీనికి వి 8 ఇంజిన్ ను అమర్చింది.
• సర్ జాక్ బ్రాబమ్ ఈ కారును, 1966లో మారిన నిబందనలను అనుసరించి త్రీ లీటర్ ఇంజిన్ ను వాడాల్సి వచ్చింది.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS