Search

నౌకా ప్రమాదానికి బాధ్యత వహిస్తూ దక్షిణకొరియా ప్రధాని చుంగ్ హాంగ్‌వాన్ రాజీనామా

నౌక ప్రమాదానికి గురైన ఘటనకు నైతికబాధ్యత వహిస్తూ దక్షిణకొరియా ప్రధానమంత్రి చుంగ్ హాంగ్‌వాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు

Apr 28, 2014 11:00 IST
facebook IconTwitter IconWhatsapp Icon

స్కూలు పిల్లలతో విహారానికి వెళ్లిన భారీ నౌక ప్రమాదానికి గురైన ఘటనకు నైతికబాధ్యత వహిస్తూ దక్షిణకొరియా ప్రధానమంత్రి చుంగ్ హాంగ్‌వాన్ ఏప్రిల్ 27,2014న  తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా ప్రకటన అనంతరం  సముద్ర రవాణాపై నిబంధనలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని వాన్  పేర్కొన్నారు.

సెవోల్‌ అనే పేరుగల ఈ భారీ నౌక 476మందితో ప్రయాణంలో ఉండగా ఏప్రిల్‌16న దక్షిణ కొరియా దక్షిణ తీరంలోని సముద్రంలో మునిగిపోయింది. ఈ నౌకలో ఎక్కువమంది విద్యార్దులు, ఉపాధ్యాయిలు ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు 187మంది చనిపోయినట్లు అధికారులు దృవీకరించారు. మొత్తం 300 మంది ప్రయాణికులు కనిపించకుండా పోయారు.

ఇంచెయాన్ నుండి జెజూ అనే పర్యాటక ద్వీపానికి ఈ హైస్కూల్‌ విద్యార్ధుల బృందం ప్రయాణం చేస్తున్నారు. ఈ భారీ పడవ బరువు 6825 టన్నులు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS