Search

2014 మొనాకో గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ టైటిల్ విజేత నికో రోస్‌బర్గ్

నికో రోస్ బర్గ్ మే 25,2014న మొనాకో ఫార్ములా వన్ గ్రాండ్ ప్రి టైటిల్ విజేతగా నిలిచాడు.

May 27, 2014 10:13 IST
facebook IconTwitter IconWhatsapp Icon

మెర్సిడెజ్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ మే 26, 2014న మొనాకో గ్రాండ్ ప్రి ఫార్ములా వన్-2014 టైటిల్ ని కైవసం చేసుకున్నాడు. మొనాకోలోని మోంటేకార్లో పట్టణంలో జరిగిన ఈ రేసును గంట 29 నిముషాల 27.661 సెకన్లలో ముగించి, తన కెరీర్‌లో రెండవసారి మొనాకో గ్రాండ్‌ప్రిని టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.

సహచర మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నుంచి గట్టిపోటీ లభించినా, రోస్‌బర్గ్ వరుసగా రెండో ఏడాది మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. మోంటెకార్లో పట్టణంలో జరిగిన ఈ 78 ల్యాప్‌ల రేసులో, రోస్‌బర్గ్ అగ్రస్థానంలో నిలిచి టైటిల్ దక్కించుకున్నాడు. తద్వారా ఆయన ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. గత నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్ ఈసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఆరు రేసుల్లోనూ మెర్సిడెస్ డ్రైవర్లకే టైటిల్ లభించడం విశేషం. అంతేకాకుండా ఫార్ములావన్ చరిత్రలో ఒక సీజన్‌లో ఆరంభ ఆరు రేసుల్లో టైటిల్ నెగ్గిన రెండో జట్టుగా మెర్సిడెస్ గుర్తింపు పొందింది. 1988లో మెక్‌లారెన్ జట్టు సీజన్‌లో వరుసగా 11 రేసుల్లో గెలిచింది.

భారత్‌కు చెందిన ఫోర్స్ఇండియా ఫార్ములావన్ జట్టుకు, ఈ రేసు మిశ్రమఫలితాలను మిగిల్చింది. ఆ జట్టుకు చెందిన హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానంలో నిలిచి 10 పాయింట్లు సంపాదించగా, సెర్గియో పెరెజ్ రేసు తొలి ల్యాప్‌లోనే వెనుదిరిగాడు. ఫార్ములా వన్ తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 8, 2014న జరగనుంది.

టాప్ 5 డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌

స్థానం

డ్రైవర్

జట్టు

పాయింట్లు

1.

నికో రోస్‌బెర్గ్           

మెర్సిడెస్

122

2.

లెవిస్ హామిల్టన్                   

మెర్సిడెస్

118

3.

ఫెర్నాన్డో అలోన్సో          

ఫెరారీ                

  61

4.

డేనియల్ రికియార్డో   

రెడ్‌బుల్           

  54

5.

నికో హోల్కెంబర్గ్

ఫోర్స్ఇండియా

  47

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS