ప్రముఖ సాహితీవేత్త చల్లా రాధాకృష్ణమూర్తి కన్నుమూత
బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఆర్.ఎం. చల్లా ఏప్రిల్ 29, 2014న రాజమండ్రిలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహీతివేత్త డాక్టర్ ఆర్.ఎం. చల్లా ఏప్రిల్ 29, 2014న రాజమండ్రిలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. ఆయన పూర్తి పేరు చల్లా రాధాకృష్ణమూర్తి, కానీ ఆర్.ఎం. చల్లాగానే ఆయన అందరికీ సుపరిచితుడు.
సాహితీవేత్తగా, వ్యాస రచయితగా, అనువాదకుడిగా, వ్యాఖ్యాతగా, విమర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది. వీటితోపాటు తత్వశాస్త్రం, కవిత్వం మరియు సంగీతంలో కూడా అద్భుతమైన పాండిత్యం ఉంది. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం, ఉర్దూ, బెంగాలీతోపాటు ఫ్రెంచ్, జర్మనీ, ఇటాలియన్ భాషలలో ఆయనకు ప్రావీణ్యం వుంది.
పాలకొల్లు దగ్గర భీమలాపురం (పశ్చిమగోదావరి)లో జూన్ 28,1926న జన్మించిన చల్లా రాధాకృష్ణమూర్తి ఇండియన్ ఎక్స్ప్రెస్లో లెఫ్ట్ఫ్రమ్ ఆర్ఎం చల్లా పేరుతో 27 ఏళ్లపాటు సంపాదకీయం రాశారు. ఆయన శ్రీ మద్భగవద్గీత (తెలుగు వ్యాఖ్యానం), హిందూ వెడ్డింగ్ (ఆంగ్ల రచన) 'అక్షర హారతి' (నానీలు) అనే ప్రసిద్ధ రచనలతోపాటు 13 కావ్యరచనలను చేశారు. వీటితోపాటు ఆంజనేయ రామాయణం (ఆంగ్లం) రిగ్ వేదాన్ని ఫ్రెంచ్ జర్మనీ బాషలలోకి అనువదించారు.
ఆయన రాసిన పుస్తకాలకు శ్రీపాద కృష్ణమూర్తిశాస్ర్తీ, శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ వంటి గొప్ప సాహితీవేత్తలు పీఠికలు రాశారు. ఆయన మరణం పట్ల సాహిత్యాభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు.
Take Weekly Tests on app for exam prep and compete with others. Download Current Affairs and GK app
एग्जाम की तैयारी के लिए ऐप पर वीकली टेस्ट लें और दूसरों के साथ प्रतिस्पर्धा करें। डाउनलोड करें करेंट अफेयर्स ऐप
AndroidIOS
Comments