1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. రాష్ట్రం
 6.  |  
 7. ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కార్మికుల వేతనాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం

Jan 7, 2016
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 30 డిసెంబర్ 2015 న అంగన్వాడీ కార్మికుల వేతనాలను పెంచాలని నిర్ణయించింది.

డిస్కం పునరుద్ధరణ పథకం ఉదయ్ లో చేరిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

Dec 8, 2015
5 డిసెంబర్ 2015 న ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన (ఉదయ్) లో చేరిన భారతదేశం యొక్క మొదటి రాష్ట్రంగా మారింది. ఈ పథకం రుణ ఒత్తిడిలలో ఉన్న విద్యుత్ సరఫరా కంపెనీలను చైతన్యపరచే లక్ష్యంతో ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా వాసుదేవ దీక్షితులు నియామకం

Dec 2, 2015
ఆంద్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులు 30 నవంబర్ 2015న నియమితులయ్యారు. ఈ మేరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.

ఏపీపీఎస్సీ కొత్త చైర్మన్‌గా ప్రొఫెసర్ ఉదయభాస్కర్ నియామకం

Nov 27, 2015
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చెర్మన్‌గా జేఎన్‌టీయూకే ప్రొఫెసర్, మూల్యాంకన విభాగం డెరైక్టర్ పిన్నమనేని ఉదయభాస్కర్ 25 నవంబర్ 2015న నియమితులయ్యారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం జపాన్ తో రెండు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్

Oct 28, 2015
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 22 అక్టోబ‌ర్ 2015న ఆర్ధిక మౌలిక వ‌స‌తుల అభివృద్ధి కోసం ఎంవోసీ, అమ‌రావ‌తి అభివృద్ధి కోసం జ‌పాన్ ప్ర‌భుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఒక‌ప‌క్క అమ‌రావ‌తి నిర్మాణానికి శంకుస్ధాప‌న జ‌రుగుతున్న వేళ మ‌రోవైపు ఈ ఒప్పందాలు జ‌రిగాయి.

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Oct 23, 2015
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 22 అక్టోబర్ 2015న భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కృష్ణా జిల్లాలోని ఉద్దండ్రాయినిపాలెంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని భూమిపూజ చేశారు.

కాకినాడలో జపాన్‌ ఆహార పార్కు ఏర్పాటుకు జేజీసీ కార్పొరేషన్‌ తో కాకినాడ సెజ్‌ ఒప్పందం

Oct 12, 2015
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ను సంయుక్త ప్రాతిపదికపై అభివృద్ధి చేయడానికి జపాన్‌కు చెందిన జేజీసీ కార్పొరేషన్‌ (జేజీసీ)తో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ సంస్థ కాకినాడ సెజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 11 అక్టోబర్ 2015న అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Oct 12, 2015
9 అక్టోబర్ 2015న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంటర్ ప్రైజ్ ఆర్కిటెక్చర్ (ఏపీఎస్ఇఏ) దీన్నే ప్రత్యామ్నాయంగా ఈ-ప్రగతి అని పిలుస్తున్నారు.

మంగళగిరిలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Oct 8, 2015
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం 8 అక్టోబర్ 2015న ఆమోదం తెలియజేసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, పశ్చిమ బెంగాల్లోని కల్యాణిలో కూడా ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయడానికి సమ్మతించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఇబ్రహీంపట్నం తీర గ్రామం దగ్గర కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం

Sep 21, 2015
ఏటా గోదావరి వరద నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. గోదావరి కృష్ణానదులను 16 సెప్టెంబర్ 2015న సంప్రదాయబద్ధంగా అనుసంధానం చేశారు. గోదావరి కృష్ణానదుల అనుసంధానం కార్యక్రమానికి తెలుగు వైశిష్ట్యానికి అనుగుణంగా కృష్ణా గోదావరి పవిత్ర సంగమం అనే పేరు పెట్టారు. గోదావరి కృష్ణానదులను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అనుసంధానం చేశారు.

విజయవాడ మెట్రోరైల్ కు రూ.6769 కోట్లు, నిర్మాణ బాధ్యత డీఎంఆర్ సీకి అప్పగింత

Sep 15, 2015
ప్రతిష్టాత్మక విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (డిఎంఆర్ సి) కి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సెప్టెంబర్ రెండోవారంలో నిర్ణయం తీసుకుంది. అలాగే విశాఖపట్నంలోని మెట్రో రైలు ప్రాజెక్టును కూడా డిఎంఆర్ సి కి అప్పగించాలని నిర్ణయించింది.

2015 ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కోర్టుల బిల్లును ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ

Sep 8, 2015
ఆంధ్రప్రదేశ్ శాసనసభ 3 సెప్టెంబర్ 2015 న అవినీతి కేసులు మరియు ఆస్తుల సబంధమైన కేసులను కాలపరిమితితో కూడిన తీర్మానాలను సులభతరం చేయడం కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కోసం 2015 ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కోర్టుల బిల్లును ఆమోదించింది.

విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికోసం టాటా ట్రస్టుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

Aug 27, 2015
విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 264 గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సర్ దోరాబ్జీ టాటా ట్రస్టు తో 24 ఆగష్టు 2015న అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.

విశాఖపట్నం నుండి న్యూఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

Aug 12, 2015
11 ఆగష్టు 2015న న్యూఢిల్లీలోని రైల్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.

‘మీ ఇంటికి మీ భూమి’’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Aug 10, 2015
‘‘మీ ఇంటికి మీ భూమి’’ కార్యక్రమాన్ని 10 ఆగష్టు 2015న విశాఖ జిల్లాలోని అనకాపల్లి శంకరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

ఏరోస్పేస్ పాలసీ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

Jul 24, 2015
23 జూలై 2015న ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక కేంద్రంగా మలిచేందుకు తీసుకుంటున్న అనేక చర్యల్లో భాగంగా ఏరోస్పేస్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది.

అత్యాధునిక నగరాల ఎంపికకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Jul 17, 2015
16 జూలై 2015న అత్యాధునిక సాంకేతిక నగరాల (స్మార్ట్‌ సిటీ) ప్రాజెక్టు తొలిదశ పోటీకి అర్హమైన నగరాల్ని ఎంపిక చేసి, ప్రతిపాదనలను రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రముఖ తెలుగు సినీ గాయకుడు వి రామకృష్ణ మృతి

Jul 17, 2015
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు వి రామకృష్ణ. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ 15 జూలై 2015న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని గాయ్రతిహిల్స్ లోని తన నివాసంలో మరణించారు.

ఆంధ్రప్రదేశ్ లో విపత్తు పునరుద్ధరణ పనులకు 1500 కోట్ల రూపాయిల రుణం కు ప్రపంచ బ్యాంకు ఆమోదం

Jul 17, 2015
ఆంధ్రప్రదేశ్‌లో విపత్తు పునరుద్ధరణ పనులకు 250 మిలియన్‌ డాలర్లు అనగా 1500 కోట్ల రూపాయిల రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మధ్య ఆర్థిక ఒప్పందం కుదిరింది.

2015 గోదావరి మహా పుష్కరాలు ప్రారంభం

Jul 14, 2015
14 జూలై 2015 న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, రెండు తెలుగు రాష్ర్టాల్లో 2015 గోదావరి మహా పుష్కరాలు వైభవంగా ఆరంభమయ్యాయి. జూలై 25వ తేదీ వరకు అంటే 12 రోజుల పాటు గోదావరి మహా పుష్కరాలు కొనసాగుతాయి.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...