Search

అదాని గ్రూప్ కు కార్మిచాయెల్ బొగ్గు గని ప్రాజెక్టుని తిరిగి అప్పగించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం15 అక్టోబర్ 2015 న ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిచాయెల్ బొగ్గు గని, రైల్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అత పెద్ద ప్రాజెక్టులను అదానీ గ్రూప్ కు అప్పగించింది.

Oct 19, 2015 15:07 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం15 అక్టోబర్ 2015 న ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిచాయెల్ బొగ్గు గని, రైల్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అత పెద్ద ప్రాజెక్టులను అదానీ గ్రూప్ కు అప్పగించింది.

అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం చరిత్రలో అత్యంత కఠినమయిన 36 నిబంధనలతో అనుమతులను మంజూరు చేసింది.


అదానీ గ్రూప్ కు విధించిన నిబంధనలు

• కోల్ సీమ్ గ్యాస్, బొగ్గు మైనింగ్ అభివృద్ధి విషయాలను స్వతంత్ర నిపుణుల కమిటీ నిర్ణయిస్తుంది.

• సదరన్ బ్లాక్ త్రోటెడ్ ఫించ్ ప్రాంతంలో 31వేల హెక్టార్ల ప్రాంతాన్ని రక్షించడం, అభివృద్ధి చేస్తారు.

• వచ్చే 10 ఏళ్ళలో వివిధ జాతుల పరిరక్షణకు 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల నిధిని కేటాయించి ఖర్చు చేయాల్సి ఉంటుంది.

• దూంగమబుల్లా స్ప్రింగ్స్ ప్రాంతంలోని భూగర్బజలాలను పరిరక్షించడం, పరిమితులను అమలుచేయాలి.

ఈ గని ఎందుకు వివాదాస్పదం అయింది?

• ఈ గని వివాదాస్పదం కావడానికి కారణం గ్రేట్ బేరియర్ రీఫ్ పై ఈ గని ప్రబావం చూపడమే. క్వీన్స్ లాండ్ కోస్తా ప్రాంతానికి చుట్టూ ఉన్న 1500 మైళ్ళ దూరంలో ఇటు గ్రేట్ బ్రిటన్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ దేశాలతో సంబంధం కలిగి ఉంది. ఈ బేరియర్ ప్రాంతం లో 15వందల రకాల వివిధ జాతుల చేపలు, 4వేల రకాల పగడాలు,  మొలస్క్, పక్షిజాతులు నాశనం అవుతాయని ఆందోళన కలుగుతోంది.

• ఈ గని వల్ల ఈ ప్రాంతంలోని భూగర్భ జలాలపై ప్రభావం పడుతుంది. ఈ గని నిర్వహణ కోసం అదాని గ్రూప్ బెల్యోండో నది నుంచి ఏడాదికి 12.5 గేలన్ల నీటిని  వాడుకోవడానికి లైసెన్స్ కూడా తీసుకుంది. ఈ గనికోసం విచ్చలవిడిగా భూగర్భ నీటిని వాడుకునే అవకాశం ఉంది. అలాగే భూగర్భ మైనింగ్ వల్ల కూడా భూగర్భవాతావరణం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

• ఈ గని వల్ల 60 ఏళ్ళ వ్యవధిలో 200 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను విడదల చేస్తుంది. అలాగే బొగ్గును కాల్చడం వల్ల సుమారు 130 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది.

• ఈ ప్రాంతం ఉన్నచోట ఎన్నో రకాల అంతరంచిపోతున్న పక్షి జాతులు ఉన్నాయి. ఈ ప్రాంతం వల్ల రెండు విషపు జంతువులు నాశనం అయ్యే ప్రమాదం ఉంది. యక్కా స్కింక్ అనే బల్లులు కొండల్లో, చిన్న చిన్న బొరియల్లో తలదాచుకుంటాయి, అలాగే అలంకారిక పాములు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది.

నిర్ణీత సమయం

• కార్మిచాయెల్ ప్రాజెక్టుకు 8 మే 2014న మొట్టమొదటిసారిగా క్విన్స్ లాండ్ కో ఆర్డినేటర్ జనరల్ అనుమతి ఇచ్చారు.

• ఈ గని ని 150 సంవత్సరాల పాటు నిర్వహించుకునేలా ప్రతిపాదన ఉంది. అయితే ఈ కాలపరిమితిని 60 సంవత్సరాలకు కుదించారు.

• 29 జూలై 2014న ఫెడరల్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్ మెంట్ గ్రెగ్ హంట్ మైనింగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

• 5 ఆగస్టు 2015న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫెడర్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎన్విరాన్ మెంట్, మరియు అదానీ గ్రూప్ లు ప్రాజెక్టుకి సంబంధించి సమ్మతిని తెలియచేస్తూ ఫెడరల్ కోర్టు ముందు సంతకాలు చేశాయి.

• జూలై 2014లో ఫెడరల్ ప్రభుత్వం కార్మిచాయెల్ కు ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ మాకె కన్సర్వేషన్ గ్రూప్ జనవరి 2015లో ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ అండ్ బయో డైవర్శిటీ కనర్వేషన్ యాక్ట్ 1999 కింద కోర్టుకెళ్ళింది.

• ఆగస్టు 2015న ఈప్రాజెక్టుకు వివిధ పర్యావరణ అభ్యంతరాల వలన తాత్కాలికంగా నిలుపుదల చేసింది.

కార్మిచాయెల్  కోల్ మినీ ప్రాజెక్టు గురించి...

కార్మిచాయెల్ కోల్ మినీ అనేది ధర్మల్ కోల్ మినీ మధ్య ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ ప్రాంతం నార్త్ గలీలీ ప్రాంతంలో ఉంది. మొట్టమొదటిసారిగా 2010లో మొత్తం ప్రాజెక్టును అదానీ మైనింగ్ నిర్మించింది.ఇది పూర్తిగా భారత్ కు చెందిన అదానీ గ్రూప్ కు చెందినది. మొత్తం పెట్టుబడి సుమారుగా 16.5 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 60 మిలియన్ టన్నుల బొగ్గుని ఎగుమతి చేస్తారు. ఈ ఎగుమతుల్లో ఎక్కువభాగం భారత్ కే ఉంటుంది. మొత్తం 60 సంవత్సరాల పాటు అనుమతి మంజూరు చేశారు.

ఈ గని మొత్తం వైశాల్యం సిడ్నీ హార్బర్ కు ఏడు రెట్లు ఉంటుంది. ఈ మైనింగ్ తవ్వకాలు భూగర్భంతో పాటు, బయటి తవ్వకాలు కూడా ఉంటాయి.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS