1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్థిక రంగం

ఆర్థిక రంగం

ఒఎన్జిసి విదేశ్ లోకి 5000 కోట్ల రూపాయల పెట్టుబడి కోసం సిసిఇఎ ఆమోదం

Dec 24, 2015
ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) 22 డిసెంబర్ 2015 న ఒఎన్జిసి విదేశ్ లిమిటెడ్ (ఒవిఎల్) యొక్క ఈక్విటీ వాటా మూలధనం లోకి ఇప్పటికే ఉన్న సమానమైన మొత్తాన్ని ఈక్విటీ లోకి రుణ మార్పిడి ద్వారా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ లిమిటెడ్ (ఒఎన్జిసి) ద్వారా 5000 కోట్ల రూపాయల పెట్టుబడి కోసం దాని ఆమోదం తెల్పింది.

కెజి వాయు క్షేత్రాలపై ఒఎన్జిసి, ఆర్ఐఎల్ వివాదంఫై విచారణ కోసం ఎపి షా కమిటీ

Dec 23, 2015
పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ 15 డిసెంబర్ 2015 న కృష్ణా గోదావరి (కెజి) గ్యాస్ క్షేత్రాలలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఒఎన్జిసి) మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మధ్య వివాదంఫై విచారణ జరిపేందుకు ఒక ఏక సభ్య సంఘాన్ని నియమించింది.

తయారీరంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఎంఎస్డిఈ మరియు డిహెచ్ఐ మధ్య ఒప్పందం

Dec 9, 2015
స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ (ఎంఎస్డిఈ) మరియు భారీ పరిశ్రమల శాఖ (డిహెచ్ఐ) మధ్య 8 డిసెంబర్ 2015 న తయారీ రంగంలో నైపుణ్య అభివృద్ధి కోసం ఒక అవగాహనా ఒప్పందం (MoU) ఫై సంతకాలు చేశారు.

2030 నాటికి ఓఎన్జీసీలో జీరో అగ్నిప్రమాదాల నమోదుకోసం ప్రపంచబ్యాంకుతో అవగాహన

Dec 9, 2015
పారిస్ లో జరుగుతున్న యుఎన్ఎఫ్ సిసిసి, పార్టీస్ 21 (కాప్ 21) లో భాగంగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ 7 డిసెంబర్ 2015న 2030 నాటికి అగ్నిప్రమాదాలను సున్నా స్థాయికి తగ్గించుకునేందుకు ప్రపంచబ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

వస్తుసేవల పన్ను ప్రామాణిక రేటు 17-18% గా అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలోని ప్యానెల్ సిఫార్సు

Dec 7, 2015
ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలోని ప్యానెల్ 4 డిసెంబర్ 2015న వస్తుసేవల పన్ను (జిఎస్టి) కింద సాధ్యమయ్యే పన్ను రేట్లపై తన నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కు సమర్పించింది.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణ నిబంధనలు సవరించిన ఆర్బిఐ

Dec 5, 2015
రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) 3డిసెంబర్ 2015న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బి) ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణాలు (పీఎస్ఎల్) నిబంధనలను సవరించింది.

భారతీయ ఆర్ధిక వ్యవస్థ 2015-16 రెండవ త్రైమాసికంలో 7.4 శాతం వృద్ధి: సిఎస్వో

Dec 5, 2015
సిఎస్ వో 30 నవంబర్ 2015న భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 2015-16 ఆర్ధిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) లో 7.4శాతం పెరిగిందని పేర్కొంది. ఇదే సమయంలో 2014-15తో పోలిస్తే..సిఎస్ వో కేంద్ర గణాంకాల కార్యాలయం. ఇది కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమ అమలు విభాగంలో భాగం.

ఎగవేతకు గురైన బాండ్ల కొనుగోలుకు విదేశీ మదుపుదార్లకు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి

Nov 28, 2015
రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) 26 నవంబర్ 2015 న విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్ పిఐ) పూర్తిగా లైదా పాక్షికంగా ఎగవేత దారుల బాండ్లను మెచ్యూరిటీ చెందని, ప్రధాన మయిన వాయిదాలు చెల్లించిన బాండ్లను కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చింది.

భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్స్ కు కేంద్ర యూనిట్ గా పనిచేసేందుకు ఎన్పిసిఐకి ఆర్బిఐ సూత్రప్రాయ ఆమోదం

Nov 28, 2015
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, 24 నవంబర్ 2015న నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) కి భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్ (బిబిసీపీయు) గా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బిబీపీఎస్ కు) సూత్రప్రాయంగా అనుమతి మంజూరు చేసింది.

బంగ్లాదేశ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తో ద్వైపాక్షిక సహకారానికి ఎంవోయూపై సెబీ సంతకం

Nov 26, 2015
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) 22 నవంబర్ 2015న బంగ్లాదేశ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (బిఎస్ఈసి) తో ద్వైపాక్షిక సహకారం మరియు సాంకేతిక సహకారానికి సంబంధించి పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశాయి.

ఇంధన సర్ చార్జి ఫిక్సింగ్ కు పాల్పడినందుకు 3 విమానయాన సంస్థలకు జరిమానాలు విధించిన సీసీఐ

Nov 24, 2015
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 17 నవంబర్ 2015న ఇంధన సర్ ఛార్జి (ఎఫ్ఎస్సీ) లో ఫిక్సింగ్ కు పాల్పడినందుకు భారీ జరిమానాలు విధించింది. ఈ మూడు విమాన యాన సంస్థలు జెట్ ఎయిర్ వేస్ (ఇండియా) లిమిటెడ్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ మరియు స్పైస్ జెట్ లిమిటెడ్.

హైడ్రోకార్బన్ అన్వేషణ విస్తీర్ణం పెంచేందుకు ఫిస్కల్ మరియు ఒప్పందం అమలుకోసం ముసాయిదా

Nov 24, 2015
కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వశాఖ 16 నవంబర్ 2015న హైడ్రోకార్బన్ అన్వేషణ ముసాయిదా కు సంబంధించిన సలహా కాగితాలను విడుదలచేసింది. దీని ద్వారా ఫిస్కల్ మరియు ఒప్పందం అమలుకోసం సాధారణ ప్రజానీకం అభిప్రాయాలను సేకరిస్తారు.

క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో మార్చి 2017 నాటికి సీసీటీఎన్ఎస్ మరియు ఐసిజెఎస్ ప్రాజెక్టు కి ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతి

Nov 24, 2015
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన 18నవంబర్ 2015న సమావేశమయిన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ (సిసిఇఏ) దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ను పునరుద్ధరించడానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ రెండు కొత్త ప్రాజెక్టులకు అనుమతి మంజూరుచేసింది.

ఆర్థికమంత్రి అధ్యక్షతన ఎన్ఐఐఎఫ్ కు గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటుచేసిన ప్రభుత్వం

Nov 24, 2015
కేంద్ర ప్రభుత్వం జాతీయ పెట్టుబడులు మరియు మౌలిక వసతుల నిధి (ఎన్ఐఐఎఫ్) కి 13 నవంబర్ 2015న గవర్నింగ్ కౌన్సిల్ (జిసి)ని ఏర్పాటుచేసింది.

కోల్ ఇండియా లిమిటెడ్ లో 10 శాతం మూలధనాన్ని పెట్టుబడుల ఉపసంహరణకు సీసీఈఏ అనుమతి

Nov 23, 2015
ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఇఏ) 18 నవంబర్ 2015న కోల్ ఇండియా లిమిటెడ్ లో (సీఐఎల్) లో 10 శాతం ఈక్విటీ మూలధనాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇచ్చింది.

రాష్ట్రాలు, కేంద్రపాలిక ప్రాంతాల విద్యుత్, కొత్త పునరుద్ధరణ శక్తి మరియు గనుల శాఖల మంత్రుల సమావేశం ముగింపు

Nov 23, 2015
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్, సంప్రదాయేతర శక్తి మరియు గనుల శాఖల మంత్రులు 7 నవంబర్ 2015న కేరళలోని కోచిలో నిర్వహించిన సమావేశం ముగిసింది.

జాతీయ తయారీ విధానం కింద టెక్నాలజీ కొనుగోలు మరియు అభివృద్ధి నిధి ప్రారంభం

Nov 23, 2015
కేంద్ర ప్రభుత్వం 18 నవంబర్ 2015 న జాతీయ తయారీ విధానం, 2011 కింద టెక్నాలజీ కొనుగోలు మరియు అభివృద్ధి నిధి (టిఎడిఎఫ్) ని ప్రారంభించింది. టిఎడిఎఫ్, రాష్ట్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహాయమంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా ప్రారంభించబడింది.

పన్ను పరిధిలోకి వచ్చే అన్ని సేవలపైనా 0.5శాతం స్వచ్చ భారత్ పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

Nov 9, 2015
6 నవంబర్ 2015 న పన్ను పరిధిలోకి వచ్చే అన్ని సేవలపైనా 0.5 శాతం స్వచ్చ భారత్ పన్ను (SBC) విధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

18 ఔషధ సమ్మేళనాల ధరలను కట్టడిచేసిన నేషనల్ ఫార్మషూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పిపిఎ)

Nov 3, 2015
29 అక్టోబర్ 2015న, ఏంటీ-డయాబెటిక్ మెట్ఫార్మిన్ హెచ్సిఐ మాత్రలు, ఏంటీబాక్టీరియా సెఫ్త్రియక్షొన్ సోడియం ఇంజక్షన్ ప్యాక్లు వంటి 18 ఔషధ సమ్మేళనాల ధరలను నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పిపిఎ) కట్టడి చేసింది.

వలసలు మరియు అభివృధ్ది సంక్షిప్తసమాచారాన్ని విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు

Oct 29, 2015
22 అక్టోబర్ 2015 న ప్రపంచ బ్యాంకు, ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వలసలు మరియు నగదు నగదు బదలాయింపులతో కూడిన వలసలు మరియు అభివృధ్ది సంక్షిప్తసమాచారాన్ని విడుదల చేసింది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...