ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చీఫ్ వసంత్ గోవారికర్ అస్తమయం

Jan 3, 2015 15:03 IST

ప్రముఖ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ వసంత్ గోవారికర్ పుణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇస్రో మాజీ చీఫ్ అయిన ఆయన డెంగ్యూ, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో 2 జనవరి 2015న కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు.

‘భారత మాన్సూన్ నమూనా’ పితామహుడిగా పేరుగాంచిన ఆయన తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో వాతావరణ మార్పులను సూచించే వ్యవస్థను రూపొందించిన తొలి శాస్త్రవేత్త. ఆయన 1991-1993, మధ్య అప్పటి భారత ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు కు శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు.

వసంత్ గోవారికర్, విక్రం సారాభాయ్ కి ప్రధాన శిష్యుడు. ఆయన భారత శాటిలైట్ పరిశోధన కార్యక్రమంలో ఏ.పి.జే అబ్దుల్ కలాం, ఈ. వి. చిట్నిస్, ప్రమోద్ కాలే, యూ.ఆర్.రావు మరియు ఇతరులతో కలిసి పనిచేశారు.

ఆయన డాక్టర్ ఎఫ్.హెచ్.గార్నర్ తో కలిసి గార్నర్- గోవారికర్ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హాం(యూకే) నుండి గార్నర్ సారధ్యంలో కెమికల్ (రసాయన) ఇంజనీరింగ్ లో డాక్టరేట్ ను పూర్తిచేశారు.

వసంత్ రంచ్చోడ్ గోవారికర్ గురించి

• వసంత్ రంచ్చోడ్ గోవారికర్, 25 మార్చి 1933లో మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో జన్మించారు
• ఆయన అంతరిక్ష పరిశోధన, వాతావరణ అంచనా మరియు ఇతర అంశాల పై పరిశోధనలు చేశారు. గోవారికర్ యూకే అటామిక్ ఎనర్జీ అథారిటీలో కూడా పనిచేశారు.
• భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో పనిచేసిన ఆయన, 1979 నుండి 1985 మధ్యకాలంలో విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వర్తించారు  
• ఆయన శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పనిచేశారు
• వసంత్ రంచ్చోడ్ గోవారికర్ 1967లో, తుంబాలోని ఈక్వేటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ లో ప్రోపెల్లంట్ ఇంజనీరింగ్ డివిజన్ కు అధిపతిగా వ్యవహరించారు.
• ఆయన 1995 నుండి 1998 మధ్య పూణే విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేశారు.
ఆయన అందుకున్న అవార్డులు
1. పద్మ శ్రీ (1984)
2. పద్మభూషణ్ (2008)
3. ది ఫై ఫౌండేషన్ అవార్డు

Quick Digest

Who: వి.ఆర్.గోవారికర్

Where: పుణే , మహారాష్ట్ర

What: కన్నుమూత

When: 2 జనవరి 2015

Is this article important for exams ? Yes6 People Agreed
Read more Current Affairs on: వసంత్ గోవారికర్ , పద్మశ్రీ అవార్డు , కన్నుమూత , Padma Shri award , dengue , ISRO , V R Gowarikar , died , 82 , Pune

Latest Videos

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK