జాన్ ఓ కీఫ్, మే బ్రిట్ మోసర్ మరియు ఎడ్వర్డ్ ఐ మోసర్ లకు వైద్యరంగంలో నోబెల్ బహుమతి

నోబెల్ అసెంబ్లీ, వైద్యరంగంలో (ఫిజియాలజీ) 2014 సంవత్సర నోబెల్ బహుమతిని జాన్ ఓ కీఫ్, మే మోసర్ మరియు ఎడ్వర్డ్ ఐ మోసర్ లకు ప్రకటించింది.

Created On: Oct 27, 2014 10:45 ISTModified On: Oct 27, 2014 12:44 IST

నోబెల్ అసెంబ్లీ, 6 అక్టోబర్ 2014న వైద్యరంగంలో (ఫిజియాలజీ) 2014 సంవత్సర నోబెల్ బహుమతిని జాన్ ఓ కీఫ్, మే బ్రిట్ మోసర్ మరియు ఎడ్వర్డ్ ఐ మోసర్ లకు ప్రకటించింది. మెదడులోని కణాల అమరిక (పొజిషనింగ్ వ్యవస్థ)ను కనుగొన్నందుకు గాను వారు ఈ బహుమతిని అందుకున్నారు.
వీరు మెదడులోని పొజిషనింగ్ వ్యవస్థను, ఉన్నత కాగ్నిటివ్ ఫంక్షన్ మరియు సెల్యూలర్ బేసిస్ వంటి అంశాలను కనుగొన్నారు.
పొజిషనింగ్ వ్యవస్థ
1971లో, జాన్ ఓ కీఫ్ పొజిషనింగ్ వ్యవస్థ యొక్క తొలి భాగాన్ని(కాంపోనెంట్) కనుగొన్నారు. గదిలో ఎలుకను చూసినపుడు, మెదడులోని భాగమైన హిప్పోక్యాంపస్ లో ఒక రకమైన నాడీకణం ఉత్తేజితం కావడాన్ని దీనికి ఉదాహరణగా కీఫ్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఇతర నాడీకణాలు కూడా ఉత్తేజితం చెంది, మెదడులో గదికి సంబంధించిన ఒక పటం ఏర్పడుతుందని కీఫ్ తెలిపారు.
2005లో, మే-బ్రిట్ మరియు ఎడ్వర్డ్ మోసర్ లు మెదడు పొజిషనింగ్ వ్యవస్థకు చెందిన మరో కీలక భాగంను కనుగొన్నారు. వీరిద్దరూ మరో రకం కణాలను గుర్తించి, వాటిని గ్రిడ్ కణాలుగా పిలిచారు, ఈ కణాలు వస్తువుల యొక్క సరైన స్థానం మరియు దారిని చూపడంలో తోడ్పడుతాయి. వారు తమ పరిశోధనల ద్వారా, వస్తువుల స్థానాలు మరియు గమ్యసాధనలో ప్లేస్, గ్రిడ్ కణాలు ఎలా పనిచేస్తాయి అనే అంశాన్ని మరింత స్పష్టం చేశారు.
పరిసరాల్లో వస్తువుల స్థానాలు, మెదడు పనితీరు మరియు మాపింగ్ వ్యవస్థకు సంబంధించిన అంశాల పై జాన్ ఓ కీఫ్, మే మోసర్ మరియు ఎడ్వర్డ్ మోసర్ లు తమ పరిశోధనల ద్వారా ఎన్నో శతాబ్దాలుగా తత్వవేత్తలు మరియు శాస్త్రవేత్తలకు అంతుపట్టని ఎన్నో చిక్కుముడులను విప్పారు.

అవార్డు గ్రహీతలు
జాన్ ఓ కీఫ్:  
• జా  ఓ కీఫ్ అమెరికాలోని న్యూయార్క్ లో 1939లో జన్మించారు. ఆయన ప్రస్తుతం లండన్ లోని యూనివర్సిటీ కాలేజీ సైన్స్బురి వెల్కమ్ సెంటర్ డైరెక్టర్ గా ఉన్నారు.
• ఆయన 1967లో కెనడాలోని మక్ గిల్ యూనివర్సిటీ నుంచి ఫిజియాలజీ సైకాలజీ విభాగంలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.
• ఆ తర్వాత ఆయన పోస్ట్ డాక్టోరల్ విద్య కోసం ఇంగ్లాండ్ కు పయనమయ్యారు. ఆయన 1987లో ఇంగ్లాండ్ లోని యూనివర్సిటీ కాలేజీలో కాగ్నిటివ్ న్యూరోసైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా నియమించబడ్డారు.


మే-బ్రిట్ మోసర్:
• మే-బ్రిట్ మోసర్ 1963లో నార్వేలో జన్మించారు. ఆమె ప్రస్తుతం ట్రాన్డెయింలోని సెంటర్ ఫర్ న్యూరల్ కంప్యూటేషన్ లో పనిచేస్తున్నారు
• మే-బ్రిట్ మోసర్, యూనివర్సిటీ ఆఫ్ ఓస్లోలో సైకాలజీ విద్యను అభ్యసించి, 1995లో న్యూరోఫిజియాలజీలో పి.హెచ్.డీ పట్టాను స్వీకరించారు.
• ఆమె 1996లో ట్రాన్డెయింలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేరక ముందు, యూనివర్సిటీ అఫ్ ఎడింబర్గ్ లో పోస్ట్ డాక్టోరల్ ఫెలో గా మరియు లండన్ యూనివర్సిటీ కాలేజీలో ప్రత్యేక పరిశోధకురాలుగా ఉన్నారు. మే-బ్రిట్ మోసర్, 2000లో న్యూరోసైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా నియామకం పొందారు.


ఎడ్వర్డ్ ఐ మోసర్:
• ఎడ్వర్డ్ ఐ మోసర్ 1962లో నార్వేలో జన్మించారు. ఆయన ప్రస్తుతం, ట్రాన్డెయిం లోని కవలి ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ న్యూరోసైన్స్ లో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
• ఆయన 1995లో యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో నుంచి న్యూరోఫిజియాలజీ లో పి.హెచ్.డీ పట్టాను అందుకున్నారు. ఆయన ఆ తర్వాత తన భార్య మరియు సహ పరిశోధకురాలైన మే బ్రిట్ మోసర్ తో కలిసి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ ను పూర్తిచేశారు. వారిద్దరూ అటుతర్వాత, యూనివర్సిటీ ఆఫ్ ఎడింబర్గ్ లో జాన్ ఓ కీఫ్ తో కలిసి పరిశోధనలు ప్రారంభించారు.
• వారిరువురూ 1996లో ట్రాన్డెయిం లోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేరారు. అటుతర్వాత ఎడ్వర్డ్ మోసర్ 1998లో ప్రొఫెసర్ గా నియమించబడ్డారు.

Take Weekly Tests on app for exam prep and compete with others. Download Current Affairs and GK app

एग्जाम की तैयारी के लिए ऐप पर वीकली टेस्ट लें और दूसरों के साथ प्रतिस्पर्धा करें। डाउनलोड करें करेंट अफेयर्स ऐप

AndroidIOS
Comment ()
Jagran Play
रोमांचक गेम्स खेलें और जीतें एक लाख रुपए तक कैश
ludo_expresssnakes_laddergolden_goalquiz_master

Post Comment

9 + 7 =
Post

Comments