1. Home
  2.  |  
  3. రాష్ట్రం  |  

డాక్టర్ నలిమెల భాస్కర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Mar 11, 2014 10:11 IST

ప్రముఖ తెలుగు రచయిత నలిమెల భాస్కర్‌కు అనువాద ప్రక్రియలో 2013 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

ప్రఖ్యాత మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన స్మారక శిళగల్ నవలను డాక్టర్ భాస్కర్ స్మారక శిలలు పేరిట తెలుగులోకి 2010లో అనువదించారు. ఈ రచనకు అనువాద సాహిత్య విభాగంలో ఈ జాతీయ పురస్కారానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఆయనను మార్చి 10,2014న ఎంపిక చేసింది.

ఈ పురస్కారం కింద ఆయన 50 వేల రూపాయల నగదు, ప్రశంసాపత్రం మరియు సత్కారాన్ని అందుకోనున్నారు.
 
డాక్టర్ నలిమెల భాస్కర్

• డాక్టర్ నలిమెల భాస్కర్ ఆంధ్రప్రదేశ్ కరీంనగర్ జిల్లాకు చెందిన సాహీతి వేత్త, కవి, రచయత. 27 ఏళ్లపాటు బోధనా వృత్తిలో కొనసాగిన నలిమెల భాస్కర్ బహుభాషా కోవిదుడు. ఆయనకు 14 భాషలపై పట్టుంది. ఆయన కవితా సంపుటి అద్దంలో గోదారికి తెలుగు యూనివర్సిటీ సాహిత్య పురస్కారం లభించింది.
• తెలంగాణ మాండలికాలపై పరిశోధన చేసి తెలంగాణ పదకోశం అనే రచనను వెలువరించారు. ఇప్పటిదాకా ఆయన 20కి పైగా పుస్తకాలను వెలువరించారు.
• ప్రస్తుతం ఆయన అఖిల భారత తెలంగాణ రచయితల వేదికకు అధ్యక్షునిగా, నేషనల్ బుక్ ట్రస్ట్ సలహామండలి సభ్యుడిగా, సాహిత్య అకాడమీ గ్రంథ సమీక్షకుడిగా పనిచేస్తున్నారు.
• కరీంనగర్ జిల్లాకు చెందిన నలిమెల భాస్కర్ అనువాద ప్రక్రియలో విశేష కృషి చేశారు. తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషలకు అందించడంలోనూ, ఇతర భాషల సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకురావడంలోనూ ఆయన విశేష కృషి చేసారు.

సాహిత్య అకాడెమీ

సాహిత్య అకాడెమీ మార్చి 12,1954న భారతదేశ ప్రభుత్వంచే ప్రారంభించబడింది. ఇది ఒక జాతీయ సంస్థ.  భారతీయ సాహిత్య అభివృద్ధి కోసం పనిచేస్తూ మరియు అన్ని భారతీయ భాషలలో సాహిత్య ప్రమాణాలను నిర్ణయించే బాధ్యత కలిగిన స్వయంప్రతిపత్తి గల సంస్థ సాహిత్య అకాడెమీ. ఇది సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం, 1860 కింద, జనవరి 7, 1956న ఒక సొసైటీగా నమోదు చేయబడింది.

Quick Digest

Who: నలిమెల భాస్కర్

Where: న్యూఢిల్లీ

What: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

When: మార్చి 10 , 2014

Is this article important for exams ? Yes11 People Agreed
Read more Current Affairs on: Kendra sahithya academy award , Nalimela bhasker

Latest Videos

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK