1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. 2015 కరెంట్ అఫైర్స్
 6.  |  
 7. మే 2015 కరెంట్ అఫైర్స్

మే 2015 కరెంట్ అఫైర్స్

అంగన్‌వాడీ సిబ్బంది వయోపరిమితి 60ఏళ్లకు పెంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

May 30, 2015
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు, సహాయకుల గరిష్ఠ వయో పరిమితిని 60ఏళ్లకు పెంచుతూ 30 మే 2015న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

కేంద్ర కేబినెట్‌ కార్యదర్శిగా ప్రదీప్‌ కుమార్‌ సిన్హా నియామకం

May 30, 2015
కేంద్ర కేబినెట్‌ కార్యదర్శిగా ప్రదీప్‌ కుమార్‌ సిన్హా 30 మే 2015న నియమితులయ్యారు. సిన్హా నియామకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదించారు.

డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ గా ఎస్ క్రిస్టోఫర్ నియామకం

May 30, 2015
28 మే 2015 న ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ క్రిస్టోఫర్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) డైరెక్టర్ జనరల్ (డిజి) గా నియమించబడ్డారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తేదీ నుండి రెండు సంవత్సరాల పదవీకాలం ఉంటుంది.

ప్రముఖ అమెరికన్ ఫోటోగ్రాఫర్ మేరీ ఎలెన్ మార్క్ మృతి

May 30, 2015
ప్రముఖ అమెరికన్ ఫోటోగ్రాఫర్ మేరీ ఎలెన్ మార్క్ 25 మే 2015 న అమెరికా లోని న్యూ యార్క్ నగరంలో మన్హట్టన్ వద్ద మరణించారు. ఆమె వయసు 75 సంవత్సరాలు.

ఇండియన్ బ్యాంకు యొక్క సిఎఫ్ఒ గా విఎ ప్రశాంత్ నియామకం

May 30, 2015
28 మే 2015 న విఎ ప్రశాంత్, ఇండియన్ బ్యాంకు యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) గా నియమితులయ్యారు. ఈ నియామకానికి ముందు అతను ఇండియన్ బ్యాంకు జనరల్ మేనేజర్ గా పనిచేశారు. కె శ్రీనివాస రాఘవన్ స్థానంలో ప్రశాంత్ నియమితులయ్యారు.

27 వ మైసూరు మహారాజాగా పట్టాభిషిక్తుడైన వడయార్ రాజవంశానికి చెందిన యదువీర్

May 30, 2015
28 మే 2015 న వడయార్ రాజవంశానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ, మైసూరు రాజ్యానికి సంబంధించిన 27 వ మహారాజా కిరీటంను పొందారు.

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య (ఫిఫా) అధ్యక్షునిగా సెప్‌ బ్లాటర్ నియామకం

May 30, 2015
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య (ఫిఫా) అధ్యక్షునిగా సెప్‌ బ్లాటర్ 29 మే 2015న ఎన్నికయ్యారు. పదిహేడేళ్లుగా ఫిఫా అధ్యక్షునిగా ఉన్న స్విట్జర్లాండ్‌ కు చెందిన సెప్‌ బ్లాటర్ పై జోర్డాన్‌ యువరాజు ప్రిన్స్‌ అలీ బిన్‌ అల్‌హుసేన్‌ పోటీకి నిలిచారు.

మారిషస్ దేశాధ్యక్షుడు కైలాష్ పుర్యాగ్ రాజీనామా

May 30, 2015
మారిషస్ దేశాధ్యక్షుడు కైలాష్ పుర్యాగ్ తన పదవికి 29 మే 2015న రాజీనామా చేశారు.

సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేసిన త్రిపుర

May 28, 2015
సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేస్తూ త్రిపుర ప్రభుత్వం 27 మే 2015న నిర్ణయం తీసుకుంది. 1997లో ప్రవేశపెట్టిన వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్పీఏ)ను త్రిపుర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు త్రిపురముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నేతృత్వంలో కేబినెట్ సమావేశంలో తీర్మానించింది.

దక్షిణ భూమిపై అత్యంత పొడిప్రాంతగా కనుగొనబడిన అటకామ ఎడారిలోని మరియా ఎలెనా సౌత్

May 28, 2015
చిలీలోని అటకామ ఎడారిలో భూమిపై అత్యంత పొడి ప్రాంతాన్ని పరిశోధకులు కనుగొన్నారు. కనుగొన బడిన ఆ సైట్ ను మరియా ఎలెనా సౌత్ (MES) గా సూచిస్తారు.

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ముఖ్య కోచ్‌గా ట్రెవర్ బేలిస్ నియామకం

May 28, 2015
ఇంగ్లండ్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్ 26 మే 2015న ఎంపికయ్యారు. 52 ఏళ్ల బేలిస్ ఇంగ్లాండ్ కు కోచ్‌గా వ్యవరించానున్న మొదటి ఆస్ట్రేలియన్ అయ్యారు.

సంరక్షణ మరియు కస్టడీ చట్టాలపై నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించిన 20 వ లా కమిషన్

May 27, 2015
22 మే 2015 న భారతదేశం యొక్క 20 వ లా కమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రి సదానంద గౌడకు భారతదేశం లో సంరక్షకుల సంస్కరణలు మరియు కస్టడీ చట్టాలు పేరుతో 257వ నివేదిక సమర్పించారు.

2015 దోహా అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ లో 4 స్వర్ణ పతకాలు గెలుచుకున్న భారత బాక్సర్లు

May 27, 2015
23 మే 2015న 2015 దోహా అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ లో 4 స్వర్ణ పతకాలు, ఒక రజతం మరియు రెండు కాంస్య పతకాలు భారత బాక్సర్లు గెల్చుకున్నారు. కామన్వెల్త్ క్రీడల్లోరజత పతక విజేత దేవేంద్ర సింగ్ (49కేజి), శివ థాపా (56 కేజి), మనీష్ కౌశిక్ (60 కేజి), మనోజ్ కుమార్ (64 కేజి)లు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు.

ప్రముఖ దర్శకనిర్మాత మార్టి పసెట్టా మృతి

May 27, 2015
అకాడమీ అవార్డ్స్ ప్రసార దర్శకుడు మార్టి పసెట్టా యునైటెడ్ స్టేట్స్ లో లా క్విన్టాలో జరిగిన కారు ప్రమాదం గాయపడిన తరువాత 21 మే 2015 న చనిపోయారు. అతను వయస్సు 82 ఏళ్ళు. పసెట్టా తన భార్య ఎలిస్, కుమార్తె డెబ్బీ, కుమారుడు గ్రెగరీ మరియు ఐదుగురు మనవళ్లతో జీవించారు.

బ్రిటిష్ నటుడు టెర్రీ సూ-పాత్ మృతి

May 27, 2015
బ్రిటిష్ నటుడు టెర్రీ సూ-పాత్, తూర్పు లండన్ లో 22 మే 2015న మృతి చెందారు. అతని వయస్సు 50 ఏళ్ళు. అతను తన ఇంట్లో చనిపోయి ఉన్నాడు, మరణానికి కారణాలు తెలియలేదు.

మిజోరం గవర్నర్ గా నిర్భయ్ శర్మ ప్రమాణ స్వీకారం

May 27, 2015
మిజోరం గవర్నర్ గా 26 మే 2015 న రాజ్ భవన్ లోని దుబార్ హాల్ లో లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) నిర్భయ్ శర్మ ప్రమాణస్వీకారం చేశారు.

మెక్సికో ఉత్తర నగరం సియుడ్యాడ్ అక్యునను తాకిన టోర్నడో

May 26, 2015
మెక్సికో ఉత్తర నగరం సియుడ్యాడ్ అక్యున ప్రాంతంపై 25 మే 2015 న టోర్నడో విరుచుకుపడింది. ఈ టోర్నడో తాకిడికి మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు స్పష్టం చేశారు.

280 కోట్ల రూపాయల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకై 21 ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం

May 26, 2015
25 మే 2015న 280 కోట్ల రూపాయల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకై 21 ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపిబి) సిఫారసుల ఆధారంగా ఈ ఎఫ్డిఐ ప్రతిపాదనలు జరిగాయి.

దర్యాప్తులోవున్నఇద్దరు భారతీయుల పేర్లు అధికారిక గెజిట్లో ప్రకటించిన స్విట్జర్లాండ్

May 26, 2015
మే నాలుగోవ వారంలో విడుదలైన స్విట్జర్లాండ్ యొక్క అధికారిక గెజిట్లో లో స్విస్ బ్యాంకు ఖాతాలలో నల్లధనాన్ని దాచుకున్న ఇద్దరు భారతీయుల పేర్లను స్విట్జర్లాండ్ వెల్లడించింది. ఈ పేర్లు వారి వారి దేశాల్లో దర్యాప్తు చేసుకునే విధంగా విదేశీ జాతీయ పేర్ల జాబితాలో భాగంగా వెల్లడించబడ్డాయి.

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సిఎండిగా మనోజ్ మిశ్రా నియామకం

May 26, 2015
24 మే 2015 న రాష్ట్రాల నేతృత్వంలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) కు ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా మనోజ్ మిశ్రా నియమితులయ్యారు. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ యొక్క సిఎండి పదవి ఫిబ్రవరి 2014 లో నీరు అబ్రోల్ పదవీ విరమణ చేసినప్పటినుండీ ఖాళీగా ఉంది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...