1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. 2015 కరెంట్ అఫైర్స్
 6.  |  
 7. నవంబర్ 2015 కరెంట్ అఫైర్స్

నవంబర్ 2015 కరెంట్ అఫైర్స్

ఏషియన్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనిల్ ఖన్నా మరోసారి ఎన్నిక

Nov 30, 2015
28 నవంబర్ 2015 ఏషియన్ టెన్నిస్ ఫెడరేషన్ (ఏటిఎఫ్) అధ్యక్షుడిగా అనిల్ ఖన్నా మరోసారి ఎన్నికయ్యారు.

వ్లాదిమీర్ క్లిట్స్చకో ను ఓడించి ప్రపంచ హెవీ వెయిట్ విజేతగా నిలిచిన టైసన్ ఫ్యూరీ

Nov 30, 2015
బ్రిటన్ యొక్క టైసన్ ఫ్యూరీ 28 నవంబర్ 2015 న ఉక్రెయిన్ యొక్క వ్లాదిమీర్ క్లిట్స్చకో ను ఓడించి ప్రపంచ బాక్సింగ్ అసోసియేషన్ (డబ్ల్యుబిఎ) (సూపర్), అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ (ఐబీఎఫ్), ప్రపంచ బాక్సింగ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుబీఓ), అంతర్జాతీయ బాక్సింగ్ ఆర్గనైజేషన్ (ఐబీఓ) మరియు రింగ్ ఏకీకృత హెవీవెయిట్ ఛాంపియన్ గా నిలిచాడు.

వరుసగా 3వసారి మకావో ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గెల్చిన పివి సింధు

Nov 30, 2015
భారత షట్లర్ పివి సింధు 29 నవంబర్ 2015 న, వరుసగా మూడవ సారి మకావో ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది.

బీహార్ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే సదానంద్ సింగ్ బాధ్యతలు స్వీకరణ

Nov 30, 2015
29 నవంబర్ 2015 న బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్, బీహార్ 16 వ శాసన సభకు ప్రోటెం స్పీకర్ గా కాంగ్రెసు శాసనసభ్యుడు సదానంద్ సింగ్ ను ప్రమాణస్వీకారం చేయించారు.

ప్రఖ్యాత జపనీస్ చరిత్రకారుడు నోబొరు కరాషిమ మృతి

Nov 30, 2015
దక్షిణ భారతదేశం మరియు దక్షిణ ఆసియా యొక్క ప్రఖ్యాత జపనీస్ చరిత్రకారుడు నోబొరు కరాషిమ 26 నవంబర్ 2015 న టోక్యో లో మరణించారు. అతని వయస్సు 82 ఏళ్ళు. అతను తన భార్య టకాకో కరాషిమ, ముగ్గురు కుమారులు మరియు ముగ్గురు మునుమనవళ్లతో కలిసి ఉంటున్నారు.

కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ గా ప్యాట్రిషియా స్కాట్లాండ్ నియామకం

Nov 30, 2015
డొమినికా లో జన్మించిన ఒక బ్రిటిష్ న్యాయవాది ప్యాట్రిషియా స్కాట్లాండ్ 27 నవంబర్ 2015 న కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ గా నియమితులయ్యారు. ఈ నియామకం తో, ప్యాట్రిషియా 53 సభ్యదేశాలు ఉన్న కామన్వెల్త్ యొక్క 66-సంవత్సరాల చరిత్రలో ఈ పదవిని చేపట్టిన మొదటి బ్రిటిష్ పౌరురాలు మరియు అలాగే మొదటి మహిళ గా మారింది.

అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికలలో మారిషియో మక్రి గెలుపు

Nov 30, 2015
కన్జర్వేటివ్ ప్రతిపక్ష అభ్యర్థి మారిషియో మక్రి 2015 నవంబర్ నాలుగో వారంలో 51.5 శాతం ఓట్లతో అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందారు.

ప్రముఖ సాహితీవేత్త సురేంద్ర ఉపాధ్యాయ్ అస్తమయం

Nov 30, 2015
ప్రముఖ సాహితీవేత్త మరియు ప్రొఫెసర్ సురేంద్ర ఉపాధ్యాయ్ 25 నవంబర్ 2015 న గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన వయస్సు 74 ఏళ్ళు. ఆయన రాజస్థాన్ బ్రిజభాషా అకాడమీ మాజీ చైర్మన్.

ఓలాక్యాబ్స్ యొక్క సీఎఫ్ఓ గా రాజీవ్ బన్సాల్ నియామకం

Nov 30, 2015
రాజీవ్ బన్సాల్, 27 నవంబర్ 2015 న దేశంలో దాని విస్తరణ డ్రైవ్ భాగంగా అనువర్తన ఆధారిత క్యాబ్ ఆపరేటర్ ఓలాక్యాబ్స్ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) గా నియమితులయ్యారు.

వరల్డ్ రోబో ఒలింపియాడ్ 2015లో దోహాలో, 2016లో న్యూఢిల్లీలో నిర్వహణ

Nov 28, 2015
వరల్డ్ రోబో ఒలింపియాడ్ (డబ్ల్యుఆర్వో) 2015 దోహాలోని కతార్ లో 6 నవంబర్ నుంచి 8 నవంబర్ 2015 న నిర్వహించారు. 2015 సెషన్ లో రోబో ఎక్ప్ ప్లోరర్స్ థీమ్ తో పాల్గొన్నాయి. ఈ రోబో ఒలింపియాడ్ లో 55 దేశాలకు చెందిన విద్యార్ధులు పాల్గొన్నారు.

2015 దక్షిణాసియా వార్షిక విపత్తు నిర్వహణ కవాతు ముగింపు

Nov 28, 2015
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన దక్షిణాసియా వార్షిక విపత్తు నిర్వహణ కవాతు (ఎస్ఎఎడీఎంఇఎక్స్) 2015, 26 నవంబర్ 2015 న ఢిల్లీలో ముగిసింది.

ఎగవేతకు గురైన బాండ్ల కొనుగోలుకు విదేశీ మదుపుదార్లకు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి

Nov 28, 2015
రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) 26 నవంబర్ 2015 న విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్ పిఐ) పూర్తిగా లైదా పాక్షికంగా ఎగవేత దారుల బాండ్లను మెచ్యూరిటీ చెందని, ప్రధాన మయిన వాయిదాలు చెల్లించిన బాండ్లను కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చింది.

భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్స్ కు కేంద్ర యూనిట్ గా పనిచేసేందుకు ఎన్పిసిఐకి ఆర్బిఐ సూత్రప్రాయ ఆమోదం

Nov 28, 2015
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, 24 నవంబర్ 2015న నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) కి భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్ (బిబిసీపీయు) గా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బిబీపీఎస్ కు) సూత్రప్రాయంగా అనుమతి మంజూరు చేసింది.

ఐసిసి ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ 20 క్వాలిఫయర్స్ కోసం నలుగురు మహిళా అంపైర్ల ను నియమించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్

Nov 28, 2015
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) 25 నవంబర్ 2015న ఐసిసి ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ 20 క్వాలిఫయర్ 2015 కోసం నలుగురు మహిళా అంపైర్ల ను నియమించింది.

భారత నావికాదళానికి ఎఎస్ డబ్ల్యు కార్వెట్టి కడ్మాట్ ను అందచేసిన జీఆర్ఎస్ఇ

Nov 28, 2015
రెండవ యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ కార్వెట్టి కడ్మాట్ ను రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఇ) లాంఛనంగా భారత నావికాదళానికి 26 నవంబర్ రెండవ యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ కార్వెట్టి కడ్మాట్ ను రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఇ) లాంఛనంగా భారత నావికాదళానికి 26 నవంబర్ 2015న కోల్ కతా లో అందచేసింది.

అణు సామర్థ్యం కలిగిన పృథ్వి-II క్షిపణి ప్రయోగం విజయవంతం

Nov 27, 2015
భారత్ పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు ఆయుధాలను మోసుకుపోగల సామర్ధ్యం గల పృథ్వి-II క్షిపణిని రక్షణశాఖ 26 నవంబర్ 2015న ఒడిషా తీరంలోని చాందీపూర్ విజయవంతంగా పరీక్షించింది.

భారత్‌ భాగస్వామ్యంతో రూపొందించిన బరాక్‌-8 క్షిపణిని ప్రయోగించిన ఇజ్రాయెల్‌

Nov 27, 2015
భారత్‌ భాగస్వామ్యంతో రూపొందించిన బరాక్‌-8 క్షిపణిని ఇజ్రాయెల్‌ మిలటరీ 26 నవంబర్ 2015న విజయవంతంగా ప్రయోగించింది.

2015 వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఢిల్లీ సవరణ) బిల్లును ప్రవేశపెట్టిన ఢిల్లీ ప్రభుత్వం

Nov 27, 2015
ఢిల్లీ ప్రభుత్వం 26 నవంబర్ 2015 న ఢిల్లీ అసెంబ్లీలో 2015 వర్కింగ్ జర్నలిస్ట్స్ మరియు ఇతర వార్తాపత్రికా ఉద్యోగులు (సర్వీస్ పరిస్థితులు) మరియు ఇతర నియమాలు (ఢిల్లీ సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు.

నేషనల్ ట్రస్ట్ కింద వికలాంగులకు 10 కొత్త సవరించిన పథకాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

Nov 27, 2015
కేంద్ర సామాజిక న్యాయం మరియు స్వావలంబన మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ 24 నవంబర్ 2015న వికలాంగుల కోసం న్యూఢిల్లీలో 10 సవరించిన / కొత్త పథకాలను ప్రవేశేపెట్టారు.

102 అమృత్ నగరాల్లో మౌలిక సదుపాయాలను పెంచడానికి 3120 కోట్ల రూపాయల పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం

Nov 27, 2015
పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 26 నవంబర్ 2015 న అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) కింద ప్రకటించబడిన 102 నగరాలకు ప్రాథమిక పట్టణ మౌలిక సదుపాయాలను పెంచడం కోసం 3120 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రణాళికలను ఆమోదించింది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...