1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. న్యూస్ కాప్సూల్
 6.  |  
 7. వార్తల్లోని వ్యక్తులు

వార్తల్లోని వ్యక్తులు

మహేల జయవర్ధనేకు జీవితకాల గౌరవ సభ్యత్వమిచ్చిన ఎంసిసి

Dec 10, 2015
9 డిసెంబర్ 2015 న మాజీ శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్ధనేకు, మేరీలిబోర్న్ క్రికెట్ సంఘం (ఎంసిసి) జీవితకాల గౌరవ సభ్యత్వాన్ని అందించింది.

భారతదేశం యొక్క 43 వ ప్రధాన న్యాయమూర్తిగా తీర్థ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం

Dec 3, 2015
3 డిసెంబర్ 2015 న రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతదేశం 43 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తీర్థ్ సింగ్ (టియస్) ఠాకూర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. దీనికి ముందు, 2 డిసెంబర్ 2015న జస్టిస్ హెచ్ఎల్ దత్తు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేశారు, ఆ స్థానంలో ఠాకూర్ ను నియమిoచారు.

ఏషియన్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనిల్ ఖన్నా మరోసారి ఎన్నిక

Nov 30, 2015
28 నవంబర్ 2015 ఏషియన్ టెన్నిస్ ఫెడరేషన్ (ఏటిఎఫ్) అధ్యక్షుడిగా అనిల్ ఖన్నా మరోసారి ఎన్నికయ్యారు.

వరల్డ్ వాటర్ కౌన్సిల్ గవర్నర్స్ బోర్డుకు పృథ్వీ రాజ్ సింగ్ ఎన్నిక

Nov 18, 2015
14 నవంబర్ 2015 న జల్ భాగీరథి ఫౌండేషన్ కు చెందిన పృథ్వీ రాజ్ సింగ్, 2016-18 కాలానికి ప్రపంచ జల మండలి గవర్నర్స్ (WWC) బోర్డుకు ఎన్నికయ్యారు.

అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు వీరేంద్ర సెహ్వాగ్ వీడ్కోలు

Oct 20, 2015
20 అక్టోబర్ 2015న భారత క్రికెట్ క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లతో పాటు, ఐపీఎల్ నుంచి కూడా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని వీరూ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

సాహిత్య అకాడెమీ సభ్యత్వానికి శశి దేశ్‌పాండే రాజీనామా

Oct 10, 2015
సాహిత్య అకాడెమీ సర్వసభ్య మండలికి ప్రముఖ రచయిత్రి శశి దేశ్‌పాండే 9 అక్టోబర్ 2015న రాజీనామా చేశారు. బెంగళూరులో జరిగిన కన్నడ రచయిత ఎం.ఎం.కలబుర్గి హత్యపై సాహిత్య అకాడెమీ మౌనంగా ఉండటంపై తీవ్ర అసంతృప్తితో వ్యక్తంచేస్తూ రాజీనామా చేశారు.

బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా అబ్దుల్ బరి సిద్దిక్వి ఎన్నిక

Sep 25, 2015
అబ్దుల్ బరి సిద్దిక్వి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) సీనియర్ నాయకుడు, 23 సెప్టెంబర్ 2015 న బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బిసిఎ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

సుస్థిర రవాణా కోసం ఐక్యరాజ్యసమితి ఉన్నతస్థాయి సలహా గ్రూపులో ఎలాట్టువలపిల్ శ్రీధరన్

Sep 23, 2015
మెట్రో మాన్ ఎలాట్టువలపిల్ శ్రీధరన్ 18 సెప్టెంబర్ 2015 న సుస్థిర రవాణా కోసం ఏర్పడిన ఐక్యరాజ్యసమితి యొక్క అత్యున్నత స్థాయి సలహా గ్రూపు (హెచ్ఎల్ఎజి - ఎస్టీ) లో తన సేవలందించడానికి నియమించబడ్డారు.

యూకేలోని లేబర్ పార్టీ నాయకునిగా జెరెమీ కార్బిన్ ఎన్నిక

Sep 18, 2015
జెరెమీ కార్బిన్ 12 సెప్టెంబర్ 2015 న యునైటెడ్ కింగ్డమ్ లోని లేబర్ పార్టీ నాయకుడుగా ఎన్నికయ్యారు.

శాక్రమెంటో మొదటి మహిళా పోస్ట్ మాస్టర్ గా ప్రమాణస్వీకారం చేసిన భారతీయ-అమెరికన్ జగ్దీప్ గ్రెవాల్

Sep 15, 2015
భారతీయ-అమెరికన్ జగ్దీప్ గ్రెవాల్ 2015 సెప్టెంబర్ 3 న ప్రమాణస్వీకారం కాలిఫోర్నియా లోని శాక్రమెంటో నగరం యొక్క మొదటి మహిళా పోస్ట్ మాస్టర్ గా ప్రమాణస్వీకారం చేసింది.

శ్రీలంక ప్రధాన కోచ్‌ పదవికి మర్వన్‌ ఆటపట్టు రాజీనామా

Sep 4, 2015
శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి మర్వన్‌ ఆటపట్టు 3 సెప్టెంబర్ 2015 రాజీనామా చేశాడు. భారత్‌ తో జరిగిన టెస్టు సిరీస్‌లో శ్రీలంక 1-2 తేడాతో ఓటమి పాలవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. శ్రీలంక, భారత్ కంటే ముందు పాకిస్తాన్ చేతిలోనూ ఓటమిపాలయ్యింది.

ఆస్ట్రేలియన్ ఆఫ్ ది డే గా తేజిందర్ పాల్ సింగ్ ను ప్రకటించిన కామన్వెల్త్ బ్యాంక్

Sep 1, 2015
గత మూడు సంవత్సరాలుగా డార్విన్ లో నిరాశ్రయులకు ఆహారం అందిస్తునందుకు ఆస్ట్రేలియా లోని భారత సంతతి డ్రైవర్ తేజిందర్ పాల్ సింగ్ ను ఆస్ట్రేలియన్ ఆఫ్ ది డే గా కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా 31 ఆగష్టు 2015న ప్రకటించింది.

అంతర్జాతీయ ఉగ్రవాద ప్రత్యేక జాబితాలోకి అబ్దుల్ ఆజీజ్‌ హక్కానీని చేర్చిన అమెరికా

Aug 27, 2015
పాకిస్థాన్‌కు చెందిన హక్కానీ నెట్‌వర్క్‌ అధినేత సిరాజుద్దీన్ హక్కానీ సోదరుడు అబ్దుల్‌ అజీజ్‌ హక్కానీ పేరును అంతర్జాతీయ ఉగ్రవాద ప్రత్యేక జాబితాలో చేర్చినట్టు అమెరికా 25 ఆగష్టు 2015న చేర్చింది.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన ఆచార్య దేవ్ వ్రత్

Aug 14, 2015
ఆచార్య దేవ్ వ్రత్ 12 ఆగష్టు 2015 న సిమ్లా లోని రాజ్ భవన్ వద్ద హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేశారు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మైఖేల్ క్లార్క్

Aug 11, 2015
ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ 8 ఆగష్టు 2015 న ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ ఆడిన తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించారు.

సుప్రీం కోర్టు వేకువజామున విచారణలో తాజా విజ్ఞప్తిని తిరస్కరించడంతో యాకుబ్ మెమన్ కి ఉరిశిక్ష అమలు

Jul 30, 2015
1993లో ముంబై వరుస బాంబు పేలుళ్లకు ఏకైక కారణం అని నేరం నిర్ధారణ కావడంతో, యాకుబ్ మెమన్ ను నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో 30 జూలై 2015 న ఉరితీశారు.

AIIB అధ్యక్ష పదవికి మాజీ చైనీస్ ఆర్దిక మంత్రి జిన్ లిక్యున్ ను ప్రతిపాదించిన చైనా

Jul 7, 2015
బీజింగ్ ఆధారిత ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (AIIB) మొదటి అధ్యక్షునిగా ఉండేందుకు వరకు చైనా, తన మాజీ చైనీస్ ఆర్దిక మంత్రి జిన్ లిక్యున్ ప్రతిపాదించడంతో 6 జూలై 2015 న ఆయన వార్తలలో నిలిచారు.

ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సిడి బాలాజీ

Jul 4, 2015
3 జూలై 2015న ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఏజెన్సీ (ADA) డైరెక్టర్ గాను మరియు లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA) ప్రోగ్రాం డైరెక్టర్ గా కమోడోర్ సిడి బాలాజీ (రిటైర్డ్) బాధ్యతలు స్వీకరించారు. అతను 30 జూన్ 2015న పదవీ విరమణ చేసిన విశిష్ట సైంటిస్ట్ PS సుబ్రమణ్యం స్థానంలో నియమితులయ్యారు.

హౌసింగ్‌ డాట్‌ కామ్‌ ముఖ్యకార్య నిర్వహణాధికారి రాహుల్‌ యాదవ్‌ కు ఉద్వాసన

Jul 2, 2015
స్థిరాస్తి ఆన్‌లైన్‌ పోర్టల్‌ హౌసింగ్‌ డాట్‌ కామ్‌, తన ముఖ్యకార్య నిర్వహణాధికారి(సీఈఓ) రాహుల్‌ యాదవ్‌ ను 1 జూలై 2015న తొలగించింది. హౌసింగ్‌ డాట్‌ కామ్‌ కు రాహుల్‌ యాదవ్‌ సహా-వ్యవస్థాపకుడు.

21వ శతాబ్దపు గొప్ప టెస్ట్ ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ ఎన్నిక

Jun 26, 2015
2000 నుండి టాప్-100 టెస్ట్ ప్లేయర్స్ జాబితా పేరుతో జరిగిన ఆన్లైన్ పోల్ లో 21 వ శతాబ్దపు అత్యుత్తమ టెస్ట్ ప్లేయర్ గా మాజీ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎన్నికయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా యొక్క వెబ్ సైట్ cricket.com.au ఈ పోల్ నిర్వహించి ఫలితం, జూన్ 2015 నాలుగో వారంలో విడుదలచేసింది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...