తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాల ప్రకటన
పోట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డిసెంబర్ 17, 2013 న తెలుగు భాషలో విశిష్ట సేవలను అందించిన ప్రముఖులకు ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది.
తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతి, వివిధ కళా ప్రక్రియల్లో విశిష్ట సేవలు అందించిన 12 మంది ప్రముఖులకు పోట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డిసెంబర్ 17, 2013 న ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది.
పోట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన ఈ జాబితాను తయారు చేసిన కమిటీ, వివిధ రంగాల్లో పలువురు చేసిన సేవలను పరిగణలోకి తీసుకొని పురస్కార గ్రహీతలను ఎంపిక చేసింది. తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానం చేస్తారు.
ప్రతిభా పురస్కారాల విజేతలు
1.తిరునగరి (కవిత్వం)
2.శలాక రఘునాథశర్మ (విమర్శ)
3.బైరు రఘురాం (చిత్రకళ)
4.కె.వి.సత్యనారాయణ (నృత్యం)
5.ద్వారం దుర్గా ప్రసాదరావు (సంగీతం)
6.పాశం యాదగిరి (పత్రికారంగం)
7.డా..బి.నాగిరెడ్డి (నాటకరంగం)
8.పిల్లిట్ల సంజీవ (జానపద కళారంగం)
9.నిడమర్తి లలితా కామేశ్వరి(అవధానం)
10.కాశీబొట్ల రమాకుమారి (అవధానం)
11.శివరాజు సుబ్బలక్ష్మి (ఉత్తమ రచయిత్రి)
12.కలువకొలను సదానంద (కథ/నవల)
ఈ ప్రతిభా పురస్కారాల కింద రూ.20116 నగదు, ప్రశంసాపత్రం, శాలువా బహుకరిస్తారు.
పోట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దేశంలో కొన్ని భాష విశ్వవిద్యాలయాలలో ఒకటి. తెలుగు విశ్వవిద్యాలయం డిసెంబర్ 2న 1985లో హైదరబాద్ కేంద్రంగా స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రత్యేకంగా తెలుగు భాష అభివృద్ధి కొరకు స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయాన్ని 1998 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయమ గా పేరు మార్చారు.ఈ విశ్వవిద్యాలయానికి శ్రీశైలం మరియు రాజముండ్రిలో ప్రాంగణ కళాశాలలు కలిగి వుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధి కొరకు, సాహిత్య , సంగీత, నాటక, హంగ్రీ మరియు లలిత కళా అకాడమీలు , అంతర్జాతీయ తెలుగు సంస్థ మరియు తెలుగు భాషా సమితిలను ఈ విశ్వ విద్యాలయంలో విలీనం చేసింది.