భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి రోటరీ అత్యున్నత పురస్కారం

దేశంలో పోలియో నిర్మూలనపై విజయం సాధించడంలో తనవంతుగా నాయకత్వం వహించినందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని రోటరీ అత్యున్నత పురస్కారం లభించింది

Created On: Feb 12, 2014 14:00 ISTModified On: Feb 12, 2014 14:11 IST

దేశంలో పోలియో నిర్మూలనపై విజయం సాధించడంలో తనవంతుగా నాయకత్వం వహించినందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని రోటరీ అత్యున్నత పురస్కారం అవార్డ్ ఆఫ్ హానరీ ఫిబ్రవరి 11, 2014న లభించింది.

అంతర్జాతీయ రోటరీ క్లబ్ అధ్యక్షుడు రాన్ బర్టన్ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతికి ఈ అవార్డును అందజేశారు. మానవతా దృక్పథంతో ప్రజలకు మంచి చేయడానికి కృషి చేసిన దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలకు ఈ అవార్డును అందజేస్తారు.

పోలియోపై విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటు రాష్ట్రపతి, యూపీఏ అధినేత్రి సోనియా పాల్గొన్నారు.  చిన్నారుల జీవితాలను మొగ్గదశలోనే ఛిద్రం చేస్తున్న మహమ్మారి వ్యాధి పోలియోను భారత్ జయించింది. జనవరి 13, 2011 తర్వాత ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకపోవటంతో అధికారికంగా పోలియోరహిత దేశంగా భారత్ అవతరించింది.

Take Weekly Tests on app for exam prep and compete with others. Download Current Affairs and GK app

एग्जाम की तैयारी के लिए ऐप पर वीकली टेस्ट लें और दूसरों के साथ प्रतिस्पर्धा करें। डाउनलोड करें करेंट अफेयर्स ऐप

AndroidIOS
Comment ()

Post Comment

1 + 8 =
Post

Comments