సీనియర్‌ సినీ నటుడు పి.జె.శర్మ నిర్యాణం

వెండితెర జడ్జిగా పేరొందిన సీనియర్‌ నటుడు, పి.జె.శర్మ, హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించారు.

Created On: Dec 15, 2014 11:09 ISTModified On: Dec 15, 2014 12:41 IST

వెండితెర జడ్జిగా పేరొందిన సీనియర్‌ నటుడు, పి.జె.శర్మ డిసెంబర్‌ 14, 2014న హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వయస్సు 80 సంవత్సరాలు.  ‘డైలాగ్‌ కింగ్‌’ సాయికుమార్‌ ఆయన పెద్ద కుమారుడు.

పి.జె.శర్మ పూర్తి పేరు పూడిపెద్ది జోగేశ్వరశర్మ. ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా కళ్లేపల్లి గ్రామం.

‘ఇల్లరికం’తో నటుడిగా పరిచయమైన ఆయన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 500కు పైగా సినిమాల్లో నటించారు. బాలకృష్ణ హీరోగా నటించిన ‘అధినాయకుడు’ ఆయన చివరి చిత్రం. ఆయన వెయ్యి సినిమాలకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్ గా పనిచేశారు.

Take Weekly Tests on app for exam prep and compete with others. Download Current Affairs and GK app

एग्जाम की तैयारी के लिए ऐप पर वीकली टेस्ट लें और दूसरों के साथ प्रतिस्पर्धा करें। डाउनलोड करें करेंट अफेयर्स ऐप

AndroidIOS
Comment ()

Post Comment

8 + 7 =
Post

Comments