1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. 2015 కరెంట్ అఫైర్స్
 6.  |  
 7. సెప్టెంబర్ 2015 కరెంట్ అఫైర్స్

సెప్టెంబర్ 2015 కరెంట్ అఫైర్స్

ఆసియా అభివృద్ధి బ్యాంకుతో 123.51 మిలియన్ US డాలర్ల రుణ ఒప్పందంఫై సంతకం చేసిన భారతదేశం

Sep 30, 2015
భారతదేశం 28 సెప్టెంబర్ 2015 న పంజాబ్, ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పర్యాటక అవస్థాపన మరియు సేవలను మెరుగుపరచడం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) తో 123.51 మిలియన్ US డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది.

నైరోబిలో మొదటి ఇండో-ఆఫ్రికా ఐసిటి ప్రదర్శన ప్రారంభం

Sep 30, 2015
28 సెప్టెంబర్ 2015 న కెన్యా యొక్క ఐసిటి అథారిటీ, భారతదేశం యొక్క టెలికాం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (టిఇపిసి) మరియు నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) తో కలిసి నైరోబి లోని కెఐసిసి లో మొదటి ఇండో-ఆఫ్రికా ఐసిటి ప్రదర్శన ప్రారంభించింది.

2017 సంవత్సరాన్ని మహారాష్ట్ర సందర్శన సంవత్సరంగా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Sep 30, 2015
మహారాష్ట్ర ప్రభుత్వం 28 సెప్టెంబర్ 2015 న రాష్ట్రములో పర్యాటక రంగ ప్రచారము కొరకు 2017 సంవత్సరాన్ని మహారాష్ట్ర సందర్శన సంవత్సరంగా ప్రకటించింది. తద్వారా పర్యాటకులను మరింతగా ఆకర్షించడానికి సులభమవుతుంది. ఈ ప్రభుత్వం, అంతర్జాతీయ పర్యాటక ప్రమోషన్ ప్రాజెక్ట్ మహారాష్ట్ర ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ 2015 (ఎంఐటిఎం) ని కూడా ప్రారంభించింది.

ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ డైరెక్టర్ జనరల్ గా జయంత్ ప్రసాద్ నియామకం

Sep 30, 2015
నేపాల్ మాజీ భారత రాయబారి జయంత్ ప్రసాద్ 29 సెప్టెంబర్ 2015 న ప్రతిష్టాత్మక న్యూ ఢిల్లీ ఆధారిత వ్యూహాత్మక వ్యవహారాల డిఫెన్స్ స్టడీస్ మరియు విశ్లేషణల సంస్థ (ఐడిఎస్ఎ) యొక్క డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు.

బిలియన్ పర్యాటకులు, బిలియన్ అవకాశాలు థీమ్ తో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహణ

Sep 29, 2015
ప్రపంచ వ్యాప్తంగా 27 సెప్టెంబర్ 2015 న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించారు. ఒక బిలియన్ పర్యాటకులు, ఒక బిలియన్ అవకాశాలు అనే నేపథ్యంతో 2015 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించారు.

2015 శాస్త్ర రామానుజన్ బహుమతి గెలుచుకున్న గణిత శాస్త్రజ్ఞుడు జాకబ్ సిమేర్మన్

Sep 29, 2015
కెనడా లోని టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన గణితశాస్త్రజ్ఞుడు జాకబ్ సిమేర్మన్ 28 సెప్టెంబర్ 2015 న ప్రతిష్టాత్మక 2015 శాస్త్ర రామానుజన్ బహుమతి కోసం ఎంపికయ్యారు.

మాజీ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఫ్రాంక్ టైసన్ మృతి

Sep 29, 2015
మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ ఫ్రాంక్ టైసన్ 27 సెప్టెంబర్ 2015 న ఆస్ట్రేలియా లో మరణించారు. అతని వయస్సు 85 సంవత్సరాలు. ఇతని మారుపేరు టైఫూన్. టైసన్ 1960 లో ఆస్ట్రేలియా కు వలస వచ్చారు.

గ్యాంగ్జౌవ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకున్న సానియా మిర్జా - మార్టినా హింగిస్

Sep 29, 2015
సానియా మీర్జా మరియు మార్టినా హింగిస్ 26 సెప్టెంబర్ 2015 న టెన్నిస్ గ్యాంగ్జౌవ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నారు. టాప్ సిడెడ్ ఇండో-స్విస్ జత చైనా లోని గ్యాంగ్జౌవ్ వద్ద జరిగిన శిఖరాగ్ర పోరులో చైనీస్ జట్టు జు షిలిన్ మరియు యూ క్సియోడి ని 6-3, 6-1 తేడాతో ఓడించింది.

మణిపూర్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్

Sep 29, 2015
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 28 సెప్టెంబర్ 2015 న మేఘాలయ గవర్నర్ వి. షణ్ముగనాథన్ ను మణిపూర్ గవర్నర్ గా నియమించారు. డాక్టర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణం తరువాత మణిపూర్ గవర్నర్ గా షణ్ముగనాథన్ కుఅదనపు బాధ్యతలు అప్పగించారు.

మొదటి 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు స్థాపించిన ఎన్ఎల్సీ

Sep 29, 2015
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) 28 సెప్టెంబర్ 2015 న నైవేలీ వద్ద దాని మొదటి 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఇది, సంస్థ యొక్క మొదటి పునరుత్పాదక శక్తి ప్రాజెక్ట్.

2006 బాల్యవివాహాల నిషేధ చట్టం, ముస్లింలకూ వర్తిస్తుంది: గుజరాత్ హైకోర్టు

Sep 29, 2015
గుజరాత్ హైకోర్టు 25 సెప్టెంబర్ 2015 ప బాల్యవివాహాల నిషేధ చట్టం, 2006 ముస్లింలకూ వర్తిస్తుందని రూలింగ్ ఇచ్చింది. అంతేకాదు చట్టం వ్యక్తిగత నియమాలకంటే బలమైనదని జస్టిస్ జెబి పర్దివాలా తన తీర్పులో పేర్కొన్నారు.

ట్రాన్స్ ఫార్మింగ్ అవర్ వరల్డ్: 2030 స్థిరత్వాభివృద్ధి ఎజెండాకు యూఎన్జిఏ ఆమోదం

Sep 29, 2015
193 దేశాల ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (యుఎన్ జిఏ) 25 సెప్టెంబర్ 2015న ట్రాన్స్ ఫార్మింగ్ అవర్ వరల్డ్: 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్ మెంట్ ను ఆమోదించింది.

కెరియర్ రాకెట్ లాంగ్ మార్చ్-11 ను విజయవంతంగా ప్రయోగించిన చైనా

Sep 29, 2015
చైనా 25 సెప్టెంబర్ 2015న కెరియర్ రాకెట్ లాంగ్ మార్చ్ -11 ను గన్సు లోని నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్ జిక్వాన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ నాలుగు చిన్న సైజు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాలన్నీ కేవలం ప్రయోగం కోసమే.

భారతదేశంలో హృదయనాళ వ్యాధి వ్యాప్తిపై సీఎస్ఐ సర్వే నివేదిక

Sep 29, 2015
కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) 25 సెప్టెంబర్ 2015న భారతదేశంలో హృదయనాళ వ్యాధి వ్యాప్తి (సీవీడీ) సర్వే నివేదికను విడుదలచేసింది. సీవీడి అనేది గుండె మరియు రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులను సూచిస్తుంది.

మణిపూర్‌ గవర్నర్‌ సయ్యద్‌ అహ్మద్‌ మృతి

Sep 28, 2015
మణిపూర్‌ గవర్నర్‌ డాక్టర్‌ సయ్యద్‌ అహ్మద్‌ 27 సెప్టెంబర్ 2015న మరణించారు. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో మృతిచెందారు.

2015 ఫార్ములావన్‌ జపనీస్‌ గ్రాండ్‌ ప్రి గెల్చిన మెర్సీడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌

Sep 28, 2015
27 సెప్టెంబర్ 2015 న మెర్సీడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ (బ్రిటన్‌) జపనీస్‌ గ్రాండ్‌ ప్రి ఫార్ములావన్‌ రేసు విజేతగా నిలిచాడు. అతడి జట్టు సహచరుడు నికో రోస్‌బర్గ్‌ రెండో స్థానం సాధించాడు.

ఖగోళ పరిశోధన కోసం భారత్ యొక్క మొట్టమొదటి ఆస్ట్రోశాట్‌ ప్రయోగం విజయవంతం

Sep 28, 2015
28 సెప్టెంబర్ 2015న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మొట్టమొదటి సారిగా ఖగోళ పరిశోధన కోసం చేసిన పీఎస్‌ఎల్‌వీ సీ30 ప్రయోగం విజయవంతంమైంది. ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా 1513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్‌ను శ్రీహరికోటలోని షార్ నుండి నింగిలోకి పంపించారు.

2015 ప్రపంచ బిలియర్డ్స్‌ టైటిల్‌ గెల్చిన పంకజ్‌ అడ్వాణీ

Sep 28, 2015
27 సెప్టెంబర్ 2015న భారత స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ అడ్వాణీ అద్భుతమైన ఆటతో 2015 ప్రపంచ బిలియర్డ్స్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో జరిగిన ఫైనల్ పోరులో 5 గంటల పాటు సాగిన మ్యాచ్ లో పంకజ్‌ 2408-1240 తేడాతో పీటర్‌ గిల్‌క్రిస్ట్‌ (సింగపూర్‌)ను ఓడించాడు.

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షా విధానం సమీక్షకు బిఎస్ బస్వాన్ కమిటీని నియమించిన కేంద్ర ప్రభుత్వం

Sep 28, 2015
ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితర ఉన్నతాధికారుల ఎంపికకు ఉద్దేశించిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షా విధానం, అర్హత, వయో సడలింపు, సిలబస్‌ తదితర అంశాలను సమీక్షించుటకుగాను నిపుణుల కమిటీని ఏర్పాటుచేసినట్టు కేంద్ర సిబ్బంది, ప్రజా సమస్యలు మరియు పించణిల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ నాలుగవ వారం లో ప్రకటించింది.

టెలినార్ ఇండియాగా యూనినార్ బ్రాండ్ పేరు మార్పు

Sep 28, 2015
టెలినార్ గ్రూపు 23 సెప్టెంబర్ 2015 న భారతదేశం లో దాని అనుబంధ సంస్థ అయినటువంటి యూనినార్ నుండి దాని చట్టపరమైన కంపెనీ పేరుతో పాటు దాని బ్రాండ్ గుర్తింపును టెలినార్ ఇండియా కమ్యూనికేషన్స్ ప్రెవేట్ లిమిటెడ్ గా మార్చుకున్నట్లు ప్రకటించింది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...