1. Home
  2.  |  
  3. CURRENT AFFAIRS
  4.  |  
  5. క్రీడలు

క్రీడలు

2015 బిబిసి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలిచిన ఆండీ ముర్రే

Dec 28, 2015
యూకే కు చెందిన ఆండీ ముర్రే 20 డిసెంబర్ 2015 న లండన్ లో 2015 బిబిసి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నారు.

ఐఒసి ఒలింపిక్ స్కాలర్షిప్ కోసం ఎంపికైన నలుగురు భారత బాక్సర్లు

Dec 18, 2015
నలుగురు భారత బాక్సర్లు శివ థాపా, మన్దీప్ జాంగ్రా గౌరవ్ బిధురి మరియు సుమిత్ సంగ్వాన్ 15 డిసెంబర్ 2015 న ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఒసి) ద్వారా ఒలింపిక్ స్కాలర్షిప్ కోసం ఎంపికయ్యారు.

ప్రపంచ దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ సింగిల్స్ టైటిళ్లు గెలుచుకున్న జపాన్ కు చెందిన నొజోమి ఒకుహర మరియు కెంటో మొమోట

Dec 18, 2015
జపనీస్ షట్లర్లు కెంటో మొమోట మరియు నొజోమి ఒకుహర 13 డిసెంబర్ 2015 న హందన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, దుబాయ్ వద్ద జరిగిన బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ వద్ద వరుసగా పురుషుల సింగిల్స్ మరియు మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు.

59వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించిన విజయ్ కుమార్

Dec 18, 2015
విజయ్ కుమార్ 13 డిసెంబర్ 2015 న న్యూఢిల్లీ లోని తుగ్లకాబాద్ లో డాక్టర్ కర్ని సింగ్ రేంజ్ వద్ద జరిగిన 59 వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో సెంటర్ ఫైర్ పిస్టల్ బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.

2016 సౌత్ ఏషియన్ గేమ్స్ యొక్క మస్కట్ మరియు లోగో ఆవిష్కరణ

Dec 14, 2015
12 వ సౌత్ ఏషియన్ గేమ్స్ నిర్వహణ కమిటీ (ఓసి-ఎస్ఎజి) నిర్వహణ కమిటీ 13 డిసెంబర్ 2014 న అస్సాం లోని గౌహతి లో ఐటిఎ సాంస్కృతిక కేంద్రం మచ్ఖోవా వద్ద ఈ గేమ్స్ యొక్క మస్కట్ మరియు లోగో ను ఆవిష్కరించింది.

59వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం కైవసం చేసుకున్న ఎలిజబెత్ సుసాన్ కౌషే

Dec 14, 2015
11 డిసెంబర్ 2015 న కేరళ రాష్ట్రానికి చెందిన ఎలిజబెత్ సుసాన్ కౌషే న్యూఢిల్లీ లోని డాక్టర్ కర్ని సింగ్ షూటింగ్ రేంజ్ వద్ద జరిగిన 59 వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో మహిళల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.

ప్రపంచ నెం .4 సైక్లిస్ట్ గా భారత సైక్లిస్ట్ డెబోరా హెరాల్డ్

Dec 14, 2015
భారత సైక్లిస్ట్ డెబోరా హెరాల్డ్ 11 డిసెంబర్ 2015 న ప్రపంచ ఎలైట్ మహిళల 500మీ టైమ్ ట్రయిల్ ఈవెంట్ ర్యాంకింగ్ లో నాల్గవ స్థానంలో నిలిచిన మొదటి భారతీయ మహిళా సైక్లిస్ట్ గా పేరు పొందింది.

2015 బిడబ్ల్యుఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు కైవసం చేసుకున్న చెన్ లాంగ్ మరియు కెరొలిన మారిన్

Dec 10, 2015
చైనాకు చెందిన చెన్ లాంగ్ మరియు ఇంగ్లాండ్ కు చెందిన ప్రపంచ ఛాంపియన్ కరోలినా మారిన్ 7 డిసెంబర్ 2015 న దుబాయ్ లో వరుసగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యుఎఫ్) పురుష మరియు మహిళా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కైవసం చేసుకున్నారు.

ప్రో రెజ్లింగ్ లీగ్ లో యూపి వారియర్స్ సహ యజమానిగా రోహిత్ శర్మ

Dec 10, 2015
భారత క్రికెటర్ రోహిత్ శర్మ 9 డిసెంబర్ 2015 న ప్రో రెజ్లింగ్ లీగ్ టీమ్, యూపి వారియర్స్ యొక్క సహ యజమాని అయ్యాడు. ఈ జట్టులో సుశీల్ కుమార్, మరియు జోగీందర్ కుమార్ వంటి ప్రముఖ భారతీయ రెజ్లర్స్ కూడా ఉన్నారు.

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ స్థానంలో తాత్కాలిక ఐపిఎల్ ఫ్రాంచైజీలుగా పూనే, రాజ్ కోట్

Dec 9, 2015
8 డిసెంబర్ 2015 న, 2017 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో తాత్కాలిక ఫ్రాంచైజీలుగా పూనే మరియు రాజ్ కోట్ లు ప్రకటించబడ్డాయి. ఇవి ఐపిఎల్ నుండి సస్పెండైన చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్ల స్థానంలో ఆడతాయి.

బెల్జియం ను ఓడించి హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ గెలిచిన ఆస్ట్రేలియా

Dec 7, 2015
ఆస్ట్రేలియా 6 డిసెంబర్ 2015 న రాయ్పూర్ లోని సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ స్టేడియంలో జరిగిన 2014-2015 పురుషుల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ లో బెల్జియం ను 2-1 తో ఓడించి టైటిల్/ బంగారు పతకం గెలిచింది.

దక్షిణాఫ్రికా తో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ను 3-0 స్కోరుతో గెలిచిన భారతదేశం

Dec 7, 2015
భారత టెస్ట్ క్రికెట్ జట్టు 7 డిసెంబర్ 2015 న దక్షిణాఫ్రికా ను 3-0 స్కోరుతో ఓడించి నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ను గెలుచుకుంది.

నవంబర్ 2015 సంచికలో ఫిపా వరల్డ్ ర్యాంకుల ప్రకటన: అగ్రస్థానంలో ఉన్న బెల్జియం

Dec 5, 2015
3 డిసెంబర్ 2015న ఫిపా/కోకా కోలా వరల్డ్ ర్యాంకుల ప్రకటనను నవంబర్ 2015 సంచికలో ప్రకటించారు.ఈ తుది ర్యాంకులు 2015 ప్రకారం బెల్జియం దేశం అగ్రస్థానంలో నిలిచింది. భారతీయ ఆటగాళ్ళ బృందం ఆరు స్థానాల ఎగబ్రాకి 166వ స్థానానికి చేరుకుంది.

వరల్డ్ బాడీ బిల్డింగ్ మరియు శరీరాకృతి ఛాంపియన్ షిప్ పోటీల్లో ఇండియా క్రీడాకారుడు ఠాకూర్ అనూప్ సింగ్ కి బంగారు పతకం

Dec 3, 2015
ఇండియాకు చెందిన ఠాకూర్ అనూప్ సింగ్ 28 నవంబర్ 2015న 7వ డబ్ల్యుబిపిఎఫ్ వరల్డ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ ఛాంపియన్ షిప్స్ లో బంగారు పతకం సాధించాడు. ఫిట్ నెస్ శరీరాకృతి విభాగంలో ఈ పతకం అందుకున్నాడు.

తొమ్మిది నిముషాల్లో ఐదు గోల్స్ చేసి నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ లు పొందిన రాబర్ట్ లెవాన్డోస్కీ

Dec 2, 2015
పోలిస్ ఫుట్ బాల్ ఆటగాడు రాబర్ట్ లెవాన్డోస్కీ తొమ్మిది నిముషాల్లో ఐదు గోల్స్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ల్లో నమోదయ్యాడు.

బంగ్లాదేశ్ ను ఓడించి అండర్ 19 ముక్కోణపు క్రికెట్ టైటిల్ ను గెలుచుకున్న ఇండియా

Dec 1, 2015
29నవంబర్ 2015న ఇండియా అండర్ -19 ముక్కోణపు సిరీస్ ను గెలుచుకుంది. కోల్ కతా లో జరిగిన ఫైనల్స్ లో ఏడువికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను భారత్ ఓడించింది.

ఢిల్లీ హాఫ్ మారథాన్ ను గెలుచుకున్న ఇథియోపియాకు చెందిన బిర్హాను లెగాసె, కెన్యన్ సింథియా లిమో

Dec 1, 2015
ఇథియోపియాకు చెందిన బిర్హాను లెగాసె, కెన్యన్ సింథియా లిమోలు 29 నవంబర్ 2015న జరిగిన ఢిల్లీ మారథాన్ లో మహిళలు, పురుషుల కేటగిరీలో గెలుపొందారు.

బెల్జియం ను ఓడించి 2015 డేవిస్ కప్ టెన్నిస్ టైటిల్ గెలుచుకున్న గ్రేట్ బ్రిటన్

Dec 1, 2015
గ్రేట్ బ్రిటన్ 29 నవంబర్ 2015 న బెల్జియం లోని ఘెంట్ వద్ద 3-1 తేడాతో బెల్జియం ను ఓడించి 2015 డేవిస్ కప్ టెన్నిస్ టైటిల్ ను గెలుచుకుంది.

వ్లాదిమీర్ క్లిట్స్చకో ను ఓడించి ప్రపంచ హెవీ వెయిట్ విజేతగా నిలిచిన టైసన్ ఫ్యూరీ

Nov 30, 2015
బ్రిటన్ యొక్క టైసన్ ఫ్యూరీ 28 నవంబర్ 2015 న ఉక్రెయిన్ యొక్క వ్లాదిమీర్ క్లిట్స్చకో ను ఓడించి ప్రపంచ బాక్సింగ్ అసోసియేషన్ (డబ్ల్యుబిఎ) (సూపర్), అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ (ఐబీఎఫ్), ప్రపంచ బాక్సింగ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుబీఓ), అంతర్జాతీయ బాక్సింగ్ ఆర్గనైజేషన్ (ఐబీఓ) మరియు రింగ్ ఏకీకృత హెవీవెయిట్ ఛాంపియన్ గా నిలిచాడు.

వరుసగా 3వసారి మకావో ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గెల్చిన పివి సింధు

Nov 30, 2015
భారత షట్లర్ పివి సింధు 29 నవంబర్ 2015 న, వరుసగా మూడవ సారి మకావో ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది.
Loading...

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

Loading...