1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. 2015 కరెంట్ అఫైర్స్
 6.  |  
 7. అక్టోబర్ 2015 కరెంట్ అఫైర్స్

అక్టోబర్ 2015 కరెంట్ అఫైర్స్

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తో మూడు సంవత్సరాల భాగస్వామ్యఒప్పందం పై హాకీ ఇండియా సంతకం

Oct 30, 2015
దేశంలో హాకీని అత్యున్నత క్రీడగా తిరిగి నిలపాడానికి, హాకీ యొక్క అత్యున్నత పరిపాలన విభాగమైన హాకీ ఇండియా(HI), 28 అక్టోబర్ 2015న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)తో మూడేళ్ల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

పన్ను చెల్లింపులు సులభతరం చేసేందుకు ఈ-సహ్యోగ్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

Oct 30, 2015
27 అక్టోబర్ 2015 న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను అధికారులు ముందు భౌతికంగా హాజరవ్వక్కరలేకుండా పన్ను చెల్లింపులు సులభతరం చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ, ఈ-సహ్యోగ్ పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.

బ్లాక్ బెర్రీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా నరేంద్ర నాయక్ నియామకం

Oct 30, 2015
నరేంద్ర నాయక్ 27 అక్టోబర్ 2015 న బ్లాక్ బెర్రీ పునర్నిర్మాణ ప్రయత్నాల పర్యవేక్షణ కోసం బ్లాక్ బెర్రీ ఇండియా కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. నాయక్, జూన్ 2015 లో కంపెనీ నుంచి రాజీనామా చేసిన సునీల్ లాల్వని స్థానంలో నియమించబడ్డారు.

సిబిఈసి ఛైర్మన్ గా నజీబ్ షా నియామకం

Oct 30, 2015
సీనియర్ ఐఆర్ఎస్ అధికారి నజీబ్ షా, 28 అక్టోబర్ 2015 న పరోక్ష పన్నుల కోసం అగ్రగామి సమాఖ్య అయినటువంటి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సిబిఈసి) యొక్క ఛైర్మన్ గా నియమితులయ్యారు. అతని నియామకం, కేబినెట్ నియామకాల కమిటీ (ఎసిసి) ఆమోదం పొందింది.

వలసలు మరియు అభివృధ్ది సంక్షిప్తసమాచారాన్ని విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు

Oct 29, 2015
22 అక్టోబర్ 2015 న ప్రపంచ బ్యాంకు, ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వలసలు మరియు నగదు నగదు బదలాయింపులతో కూడిన వలసలు మరియు అభివృధ్ది సంక్షిప్తసమాచారాన్ని విడుదల చేసింది.

రోమ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పీపుల్స్ చాయిస్ అవార్డు గెల్చిన యాంగ్రీ ఇండియన్ గాడెసెస్

Oct 29, 2015
పాన్ నలిన్ దర్శకత్వం వహించిన యాంగ్రీ ఇండియన్ గాడెసిస్ సినిమాకు 2015 అక్టోబర్ 25 న ఇటలీలోని రోమ్ లో జరిగిన 10 వ రోమ్ చలన చిత్రోత్సవంలో బిఎన్ఎల్ పీపుల్స్ చాయిస్ అవార్డు లభించింది.

2015 ఢిల్లీ హైకోర్టు సవరణ చట్టంను నోటిఫై చేసిన కేంద్ర న్యాయశాఖ

Oct 29, 2015
ఢిల్లీ హైకోర్టు సవరణ చట్టం, 2015 పై కేంద్ర న్యాయశాఖ 2015 అక్టోబర్ 26న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ చట్టం వల్ల ఢిల్లీలోని జిల్లా కోర్టుల చట్ట మూల పరిథి 20 లక్షల నుంచి 2 కోట్ల రూపాయలకు పెరుగుతుంది. ఈ చట్టం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అధికారాలు కల్పిస్తూ ఢిల్లీ జాతీయ రాజధాని పరిధిలో కేసులు లేదా ఇతర ప్రొసీడింగ్స్ ను సంబందిత సబార్డినేట్ కోర్టులకు బదీలీ చేయవచ్చునని పేర్కొంది.

నేపాల్ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన బిధ్యా దేవి భండారీ

Oct 29, 2015
బిధ్యా దేవి భండారీ 28 అక్టోబర్ 2015 న నేపాల్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

హీరో ఇండియన్ విమెన్స్ ఓపెన్ 2015 గెలుచుకున్న డెన్మార్క్ కి చెందిన ఎమిలి క్రిస్టిన్ పీటర్సన్

Oct 29, 2015
25 అక్టోబర్ 2015న డెన్మార్క్ కి చెందిన ఎమిలి క్రిస్టిన్ పీటర్సన్ డి.ఎల్.ఎఫ్ మరియు గుర్గావ్ లోని కంట్రీ క్లబ్, హర్యానా వద్ద హీరో విమెన్స్ ఇండియన్ ఓపెన్ 2015లో విజయం సాధించింది. ఇది ఆమె తొలి యూరోపియన్ టూర్ టైటిల్.

సిటీబ్యాంకు భారత ప్రధాన ఆర్ధికవేత్తగా సమిరణ్ చక్రవర్తి నియామకం

Oct 29, 2015
సిటీబ్యాంకు 27 అక్టోబర్ 2015 వ తేదీన భారత ప్రధాన ఆర్ధికవేత్తగా సమిరణ్ చక్రవర్తి ని నియమించినట్లు ప్రకటించింది.

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం కోటాను ప్రకటించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

Oct 29, 2015
మధ్యప్రదేశ్ ప్రభుత్వం 28 అక్టోబర్ 2015 న రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించుకుంది.

ముంబై-గోవా మార్గంలో ప్రారంభంకానున్న భారతదేశపు తొలి ఎ.సి. డబుల్ డెక్కర్ శతాబ్ది రైలు

Oct 29, 2015
ముంబై-గోవా మార్గంలో, భారత్ తొలి ఎ.సి.డబుల్ డెక్కర్ శతాబ్ది రైలును త్వరలోనే నడపనున్నట్లు 23 అక్టోబర్ 2015న కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది.

టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్, టీ 20 ఇంటర్నేషనల్ మరియు మహిళా ర్యాంకులు విడుదలచేసిన ఐసిసి

Oct 28, 2015
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) 26 అక్టోబర్ 2015న అధికారికంగా ఐసిసి మెన్స్ టీం ర్యాంకింగ్ లు టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ (ఒడిఐ) మరియు టీ 20 ఐ క్రికెట్ లను విడుదల చేసింది.

ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ లో రజత పతకం గెలుచుకున్న దీపికా కుమారి

Oct 28, 2015
25 అక్టోబర్ 2015 న భారత ఆర్చర్ దీపికా కుమారి మెక్సికో సిటీ లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ లో రజత పతకం కైవసం చేసుకుంది.

మూడేళ్లలో 215 కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న హర్యానా ప్రభుత్వం

Oct 28, 2015
హర్యానా ప్రభుత్వం 25 అక్టోబర్ 2015 న ప్రసార మరియు పంపిణీ (టి & డి) నష్టాలను తగ్గించేందుకు వివిధ సామర్ధ్యాలు కలిగిన 215 అదనపు సబ్ స్టేషన్లను ప్రణాళిక ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది.

కాప‌లా లేని లెవెల్ క్రాసింగ్ ల వ‌ద్ద ప్రమాద నిర్మూలన హెచ్చ‌రిక‌ వ్యవస్థను అభివృద్దిచేసిన భార‌తీయ రైల్వే

Oct 28, 2015
భార‌తీయ రైల్వే శాఖ కాప‌లా లేని లెవెల్ క్రాసింగ్ ల వ‌ద్ద ప్రమాద నిర్మూలన హెచ్చ‌రిక‌ వ్యవస్థను ఏర్పాటుచేయ‌నుంది. ఈ ప‌ద్ధ‌తిని గ‌త మూడునెల‌లుగా ప్ర‌యోగాత్మ‌కంగా కోయంబ‌త్తూరు-మెట్టుపాళ్యం సెక్ష‌న్ లో ప‌రిశీలించింది. ఈ యంత్రాల పనితీరుపై సంతృప్తిని వ్య‌క్తంచేసింది.

నంద‌కుమార, శివ‌నేశ‌న్ ల‌ను జీవితకాల పురస్కారం మరియు సంగీత ఆచార్య ర‌త్న అవార్డులతో స‌త్క‌రించిన యుకె

Oct 28, 2015
యుకెలో భార‌త హై క‌మిష‌న‌ర్ రంజ‌న్ మ‌తాయ్ అక్టోబ‌ర్ 2015లో డా.ఎంఎన్ నంద‌కుమార మ‌రియు శివ‌శ‌క్తి శివనేశ‌న్ ల‌ను లైఫ్ టైం అఛీవ్ మెంటు అవార్డు మ‌రియు సంగీత ఆచార్య ర‌త్న అవార్డుల‌తో ఇద్ద‌రినీ లండ‌న్ లో స‌త్క‌రించారు.

ప‌రీక్ష‌ల్లో కాపీ కొట్ట‌డం నేరంగా పరిగణించనున్న చైనా

Oct 28, 2015
చైనాలో క్రిమిన‌ల్ లా స‌వ‌ర‌ణ ప్ర‌కారం విద్యార్ధులఉ ప‌రీక్ష‌ల్లో కాపీ కొట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేస్తే వారిని వెంట‌నే అరెస్టు చేసి ఏడేళ్ళ వ‌రకూ జైలు శిక్ష వేస్తారు.ఈ కొత్త చ‌ట్టం 1 న‌వంబ‌ర్ 2015 నుంచి అమ‌లులోకి వ‌స్తుంది.

రాష్ట్ర అభివృద్ధి కోసం జపాన్ తో రెండు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్

Oct 28, 2015
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 22 అక్టోబ‌ర్ 2015న ఆర్ధిక మౌలిక వ‌స‌తుల అభివృద్ధి కోసం ఎంవోసీ, అమ‌రావ‌తి అభివృద్ధి కోసం జ‌పాన్ ప్ర‌భుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఒక‌ప‌క్క అమ‌రావ‌తి నిర్మాణానికి శంకుస్ధాప‌న జ‌రుగుతున్న వేళ మ‌రోవైపు ఈ ఒప్పందాలు జ‌రిగాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పోలియో దినోత్సవం నిర్వహణ

Oct 27, 2015
ప్రపంచవ్యాప్తంగా 24 అక్టోబర్ 2015 న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని నిర్వహించారు. వికలాంగ వ్యాధి ప్రమాదాలను గురించి అవగాహన సృష్టించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...