1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో యూనియన్ కార్బయిడ్ అధిపతి వారెన్ ఆండర్సన్ మృతి

1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రధాన నిందితుడు, యూనియన్ కార్బయిడ్ మాజీ అధిపతి వారెన్ ఆండర్సన్, 92 సంవత్సరాల వయస్సులో మృతి చెందారు.

Created On: Nov 3, 2014 14:57 ISTModified On: Nov 4, 2014 17:24 IST

1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రధాన నిందితుడు, యూనియన్ కార్బయిడ్ మాజీ అధిపతి వారెన్ ఆండర్సన్, 92 సంవత్సరాల వయస్సులో మృతి చెందారు.
 ఆండర్సన్ అనారోగ్యంతో 29 సెప్టెంబర్ 2014న వేరొ బీచ్, ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో చనిపోగా, అయితే ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించలేదు. రికార్డులు ఆధారంగా ఆండర్సన్ మృతిని నిర్ధారిస్తున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.

వారెన్ ఆండర్సన్  గురించి
• ఆండర్సన్ , అమెరికా దేశానికి చెందిన ఒక వ్యాపారవేత్త, 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ కు  చైర్మన్ మరియు CEOగా వ్యవహరిస్తున్నారు.
• వారెన్ ఎం ఆండర్సన్ ను 1 ఫిబ్రవరి 1992న భూపాల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రధాన నిందితునిగా అధికారికంగా ప్రకటించింది. ఆ కేసు విషయంలో కోర్టకు హాజరుకానందుకు గాను ఆండర్సన్ పరారైనట్టుగా కూడా ప్రకటించింది.
• కేంద్ర ప్రభుత్వం అతనిని అప్పగించాలని అనేక సార్లు అమెరికా ప్రభుత్వానికి అభ్యర్థించినా కూడా సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ 2003లో అభ్యర్థనను ఖండించింది.
• ఆ ఘటన జరిగిన నాలుగు రోజులకు భోపాల్ వచ్చిన ఆండర్సన్ ను అరెస్ట్ చేసి వెంటనే బిల్ ఇవ్వగా, తరువాత ఎప్పుడు అతను కోర్టులో హాజరుకాలేదు.  

1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పురుగుమందులు తయారుచేసే యూనియన్ కార్బైడ్ పరిశ్రమ నుంచి 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి మిథైల్ ఐసో సయనైడ్ (Methyl Isocyanate (MIC))అనే విషరసాయనం లీకైన ఘటనలో అధికారిక లెక్కల ప్రకారం 3787 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచ పారిశ్రామిక దుర్ఘటనల్లోనే అత్యంత ఘోరమైన ‘భోపాల్‌ దుర్ఘటన'లో అనధికార అంచనాల ప్రకారం 10 వేల మంది ప్రాణాలు కోల్పోగా.విషవాయువును పీల్చి ఐదు లక్షల మందికిపైగా భయంకరమైన వ్యాధుల బారినపడ్డారు.

Take Weekly Tests on app for exam prep and compete with others. Download Current Affairs and GK app

एग्जाम की तैयारी के लिए ऐप पर वीकली टेस्ट लें और दूसरों के साथ प्रतिस्पर्धा करें। डाउनलोड करें करेंट अफेयर्स ऐप

AndroidIOS
Comment ()

Post Comment

4 + 6 =
Post

Comments