ఏప్రిల్ 25; ప్రపంచ మలేరియా దినోత్సవం

మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కోసం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ 25, 2014న విశ్వవ్యాప్తంగా నిర్వహించారు.

Created On: Apr 28, 2014 08:30 ISTModified On: Apr 28, 2014 13:21 IST

ప్రపంచ మలేరియా దినోత్సవం – ఏప్రిల్ 25, 2014

మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కోసం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ 25, 2014న విశ్వవ్యాప్తంగా నిర్వహించారు.
 
2013-15 ప్రపంచ మలేరియా దినోత్సవ ప్రచార కార్యక్రమ థీమ్ : ఇన్వెస్ట్ ఇన్ ది ఫ్యూచర్.డిఫీట్ మలేరియా (Invest in the future.Defeat Malaria)

ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మలేరియా వ్యాధి పై ఒక మాన్యువల్ (కరదీపిక)ను విడుదల చేసింది. ఈ మాన్యువల్ ప్రపంచ దేశాలకు మలేరియా వ్యాధి నిర్మూలన పట్ల శాస్త్రీయ అవగాహనా కల్పిస్తుంది. ఈ నూతన కరదీపిక, ఫ్రం మలేరియా కంట్రోల్ టు మలేరియా ఎలిమినేషన్ (From malaria control to malaria elimination: a manual for elimination scenario planning) తో అన్ని దేశాలు మలేరియా నివారణ కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికను పాటించి, దృష్టిసారించాల్సిన వివిధ అంశాలను గూర్చి తెలుసుకుని మరింత మెరుగ్గా పనిచేసే వీలు కలుగుతుంది.
 
2000వ సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాధి మరణాలలో 42 శాతం తగ్గుదల ఉండగా, ఆఫ్రికా ప్రాంతంలో 49 శాతం తగ్గుదల నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ప్రపంచ మలేరియా దినోత్సవం

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలు 2007లో ఏర్పాటు చేశాయి. ఈ దినాన్ని ప్రతిసంవత్సరం ఏప్రిల్ 25 జరుపుకుంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఎక్కువగా మలేరియా వ్యాధి బారిన పడే తొలిఐదు దేశాల జాబితాలో నైజీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మొజాంబిక్, బుర్కినా ఫాసో మరియు సియర్రా లియోన్ ఉన్నాయి. 2015 కల్లా భారత్,  మలేరియా వ్యాధి వ్యాప్తిని 50 శాతం నుంచి 75 శాతం వరకు తగ్గిస్తుందని అంచనా.

మలేరియా

మానవుడి ఎర్రరక్త కణాల్లో ప్లాస్మోడియం పరాన్నజీవి వ్యాప్తి వల్ల సోకే మలేరియా, ఒక అంటు వ్యాధి. ఈ పరాన్నజీవికి దోమలు వాహకంగా పనిచేస్తాయి. దీనిని మనం నిరోధించవచ్చు మరియు నివారించవచ్చు. ఈ వ్యాధికి ఎలాంటి వాక్సిన్ లు అందుబాటులో లేవు.
జ్వరం, చలిగా ఉండటం, వాంతులు, వికారం, ఒంటినొప్పులు, తలనొప్పి, దగ్గు మరియు డయేరియా వంటివి మలేరియా వ్యాధిలో కనిపించే కొన్ని లక్షణాలు.

Take Weekly Tests on app for exam prep and compete with others. Download Current Affairs and GK app

एग्जाम की तैयारी के लिए ऐप पर वीकली टेस्ट लें और दूसरों के साथ प्रतिस्पर्धा करें। डाउनलोड करें करेंट अफेयर्स ऐप

AndroidIOS
Comment ()

Post Comment

4 + 0 =
Post

Comments