Search

టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2014 విడుదల

ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ఏప్రిల్ 24, 2014న ‘ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2014ను విడుదల చేసింది

Apr 29, 2014 09:02 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్  ఏప్రిల్ 24, 2014న ‘ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2014ను విడుదల చేసింది.

ఈ ప్రభావశీలుర జాబితాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌లకు చోటు దక్కింది. ర్యాంకులు కేటాయించకుండా ప్రచురించిన ఈ జాబితాలో నలుగురు భారతీయులు ఉన్నారు. నరేంద్ర మోడీ, కేజ్రీవాల్‌లతోపాటు ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్, కోయంబత్తూరుకు చెందిన ఆరోగ్య కార్యకర్త అరుణాచలం మురుగనందమ్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఈ 2014 ఎడిషన్ (11వ వార్షిక పత్రిక) టైమ్ మ్యాగజైన్ ముఖ చిత్రాన్ని పాప్ స్టార్, సింగర్ బేయోన్స్ ఫోటోతో ప్రచురించారు.

ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనీస్ అధ్యక్షుడు జీ జిన్ పింగ్, గ్రామీ విజేత బేయోన్స్, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ, హిల్లరీ క్లింటన్, పోప్ ఫ్రాన్సిస్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఎడ్వర్డ్ స్నోడెన్, జపనీస్ ప్రధాన మంత్రి షింజో అబే మరియు పాకిస్తానీ టీనేజర్ మాలాల తదితరులున్నారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS